అన్వేషించండి

Tirumala Updates: తిరుమల శ్రీవారికి శనివారం నివేదించే ప్రసాదం ఏంటో తెలుసా !

శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం సేవలో నువ్వుల గింజలతో ప్రసాదంను నివేదిస్తారు అర్చకులు. నిన్న 3.72 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు

తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం సేవలో నువ్వుల గింజలతో ప్రసాదంను నివేదిస్తారు అర్చకులు. శుక్రవారం 28-10-2022 రోజున 63,512 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 35,549 మంది తలనీలాలు సమర్పించగా, 3.72 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోవడంతో బయట క్యూలైన్స్ లో శిలాతోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. 
శ్రీ వేంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలువబడుతుంది. ఈ క్రమంలో ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదన సమర్పించిన అనంతరం "నల్ల నువ్వుల బెల్లంతో " కలిపిన ప్రసాదంను స్వామి వారిని నివేదిస్తారు. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.

పచ్చ కర్పూరం అద్ది గొల్ల హారతి సమర్పణ
శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తరువాత గొల్ల హారతి సమర్పణ జరుగుతుంది. తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థంను అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేసిన అర్చకులు తోమాల సేవ ప్రారంభిస్తారు. ముందుగా ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధా క్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. 
ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం,అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అటుతరువాత వక్షఃస్ధల లక్ష్మీ ,పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. ఈ తంతుతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు. 

నవనీత హారతి
శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేసి, సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహించిన తరువాత సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనంకు భక్తులను అనుమతిస్తారు. అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయినా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు.

శాస్త్రోక్తంగా డోలోత్సవం సేవ
శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోక్తంగా నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వారికి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఊంజల్ సేవను నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు అర్చకులు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల,రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Happy New Year 2026:భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy New Year 2026:భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Bajaj Platina 100 : ఫుల్ ట్యాంక్‌లో 800 కి.మీ ప్రయాణం! కొత్త సంవత్సరంలో తక్కువ ధరకే బజాబ్‌ ప్లాటినా 100!
ఫుల్ ట్యాంక్‌లో 800 కి.మీ ప్రయాణం! కొత్త సంవత్సరంలో తక్కువ ధరకే బజాబ్‌ ప్లాటినా 100!
Japan Earthquake News: నూతన సంవత్సర వేడుకలకు ముందు జపాన్‌లో తీవ్ర భూకంపం !
నూతన సంవత్సర వేడుకలకు ముందు జపాన్‌లో తీవ్ర భూకంపం !
Tatamel Bike: ఇప్పుడు పార్కింగ్ టెన్షన్‌కు గుడ్ బై! కుర్చీలా మడతెట్టే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్! రేంజ్, ధర తెలుసుకోండి
ఇప్పుడు పార్కింగ్ టెన్షన్‌కు గుడ్ బై! కుర్చీలా మడతెట్టే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్! రేంజ్, ధర తెలుసుకోండి
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Embed widget