By: ABP Desam | Updated at : 24 Dec 2022 01:51 PM (IST)
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు దొరకలేదా ? ఇదిగో ఇలా ఈజీగా టిక్కెట్లు పొందవచ్చు
Tirumala News :తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం భక్తుల కల. అందుకే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. గతంలో ఒక్క రోజు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండేది.కానీ ఇప్పుడు పది రోజుల పాటు ఈ దర్శనాలును ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా శనివారం టిక్కెట్లను విడుదల చేశారు. వైకుంఠ ద్వార దర్శనంమ మొత్తం 10 రోజులకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కు సంబంధించి రెండు లక్షల టిక్కెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయగా.. కేవలం 40 నిమిషాలలోనే టిక్కెట్లు అయిపోయాయి. దీంతో చాలా మంది నిరాశకు గురయ్యారు.
టిక్కెట్లు ఉన్న వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం
అయితే టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించాలని గతంలోనే నిర్ణయించారు. వైకుంట ద్వార దర్శనం జరిగే రోజుల్లో రోజుకు దాదాపు 80 వేల మందికి దర్శనం కల్పించాలని నిర్ణయించారు. అలాగే ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్ఇడి టిక్కెట్లు, ఎస్ఎస్డి టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు “మహా లఘు దర్శనం” చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఇందులో ఆఫ్ లైన్ లోనూ టిక్కెట్లు జారీ చేస్తారు.
జనవరి 1న ఆఫ్‌లైన్ విధానంలో 9 కేంద్రాలు ద్వారా రోజుకు 50 వేల టిక్కెట్లు
జనవరి 1న ఆఫ్‌లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టిక్కెట్లను టీటీడీ కేటాయించింది. భక్తులు ఈ టికెట్లను పొందొచ్చు. జనవరి 1న సర్వదర్శనం టికెట్ల జారీ ఉంటుంది. అంతేకాదు వైకుంఠ ద్వార దర్శనం జరిగే పది రోజులు సామాన భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని టీటీడీ చెబుతోంది. ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్‌లుగా విభజించి జెఇఓలు పర్యవేక్షిస్తారు.
శ్రీవారి ట్రస్ట్ కు విరాళం ఇచ్చే వారి కోసం రెండు వేల టిక్కెట్లు
అలాగే రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ప్రతిరోజూ 2000 మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే దర్శన టిక్కెట్లు కేటాయిస్తారు. సిఫార్సు లేఖలు తీసుకోరు.
2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి
2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి జరుగనుంది. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధంగానే జనవరి 11 వరకు పది రోజుల పాటు టిటిడి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. జనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
న్యూ ఇయర్ వచ్చేస్తోంది, కొత్త క్యాలెండర్ వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశగా పెట్టాలంటే!
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
Chittoor Budget: కార్పొరేటర్ల అసంతృప్తి, అయినా బడ్జెట్ ఆమోదించిన చిత్తూరు మేయర్ అముద
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!
తిరుమల శ్రీనివాసుడికి మంగళవారం ఏ ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా?
KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్
Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత