అన్వేషించండి

Calender Vastu Directions: న్యూ ఇయర్ వచ్చేస్తోంది, కొత్త క్యాలెండర్ వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశగా పెట్టాలంటే!

పాత ఏడాదికి గుడ్ బై చెప్పేసి కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఇదే టైమ్ లో ఇంట్లో పాత క్యాలెండర్లు తీసేసి కొత్తవి తగిలిస్తారు. క్యాలెండర్ పెట్టేందుకు కూడా వాస్తు ఉందని తెలుసా

Vastu Tips Telugu:  2022 కి గుడ్ చెప్పేసి 2023 కి వెల్ కమ్ చెప్పే క్షణాలు వచ్చేస్తున్నాయి. ఈ ఏడాదిలో జరిగిన మంచిని కొనసాగాలని, చెడు పాత ఏడాదికే పరిమితం కావాలని ఇష్టదైవాలను ప్రార్థిస్తారంతా. అదేసమయంలో పాత క్యాలెండర్లు తీసేసి కొత్త క్యాలెండర్లు పెట్టుకుంటారు. క్యాలెండర్ అనేది ఒక వ్యక్తి రోజువారీ పురోగతిని సూచిస్తుంది. కొన్ని క్యాలెండర్లలో సీనరీస్ ఉంటే, మరికొన్నింటిలో దేవుడి ఫొటోలుంటాయి, ఇంకొన్ని క్యాలెండర్స్ లో రకరకాల ఫొటోలుంటాయి. అయితే క్యాలెండర్ ని ఇంట్లో ఎక్కడంటే అక్కడ తగిలించకూడదంటారు వాస్తు నిపుణులు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే గడియారానికి ఎలాంటి నియమాలు వర్తిస్తాయో క్యాలెండర్ కి కూడా అలాంటి నియమాలే పాటించాలంటారు. తప్పు దిశలో క్యాలెండర్ పెడితే ఇంటిపై ప్రతికూల ప్రభావాలుంటాయని చెబుతారు. 

Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!

క్యాలెండర్ ఇంట్లో ఎక్కడు ఉండాలి-ఎక్కడ ఉండకూడదు

  • వాల్ క్లాక్ ని తూర్పు, ఉత్తర దిశల్లో పెడతారు కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో ఉంచరు..ఎందుకంటే అది యముడి స్థానం.
  • దక్షిణ దిక్కున వాల్ క్లాక్ పెడితే ఆ ఇంట్లో ఎవరో ఒకరు నిత్యం అనారోగ్యంతో బాధపడతారని చెబుతారు వాస్తునిపుణులు. అలాగే దక్షిణం వైపు క్యాలెండర్ పెడితే వ్యతిరేక శక్తులను ఆకర్షిస్తుంది , ఇంట్లో వారి పురోగతిని అడ్డుకుంటుంది
  • తూర్పు దిశగా క్యాలెండర్ పెడితే సంపద పెరుగుతుంది. ఈ దిశలో పెడితే ఆ ఇంట్లో వ్యక్తి కెరీర్ పరంగా వెలుగుతారు. ఈ దిశలో గులాబీ, ఎరుపు రంగుల క్యాలెండర్‌ను వేలాడదీయండి.
  • ఇంట్లో పశ్చిమ దిశగా క్యాలెండర్ పెడితే అనుకున్న పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. మీరు పనిచేసే రంగంలో పురోగతి ఉంటుంది
  • ఉత్తర దిశగా క్యాలెండర్ పెట్టిన ఇంట్లో ఆనందం ఉంటుంది.
  • జలపాతాలు, ఫౌంటెన్ వాంటి ఫొటోస్ ఉన్న క్యాలెండర్లు ఉత్తరం వైపు గోడకు తగిలించాలి
  • క్యాలెండర్ మీద అడవులు, మొక్కలు, పూలు ఉంటే దానిని తూర్పు దిశగా ఉంచడం మంచిది
  • ఓంకారం, స్వస్తిక్, ఇంద్రధనస్సు, ఉదయించే సూర్యుడి ఫొటోలున్న క్యాలెండర్లు తూర్పు గోడకు పెట్టాలి
  • క్యాలెండర్‌ను ఎల్లప్పుడూ ఇంటి ప్రధాన ద్వారం ముందు వేలాడదీయకూడదు..ఇది ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తుంది
  • కొందరు తలుపుల వెనుక పెడతారు..ఇది కూడా సరికాదంటారు వాస్తు నిపుణులు
  • క్యాలెండర్‌లో యుద్ధం,ఎండిన చెట్టు, విచారకరమైన ఫొటోలు, క్రూర మృగాల ఫొటోలు ఉండకూడుదు.. ఇవి ఉండడం వల్ల కుటుంబంలో కలహవాతావరణం నెలకొంటుంది
  • మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే.. కొత్త క్యాలెండర్‌ను పాత క్యాలెండర్‌పై పెట్టేసే అలవాటు చాలామందికి ఉంటుంది.. ఇలా అస్సలు చేయొద్దు..ఇంట్లో అంతర్గత తగాదాలకు ఇదో కారణం అవుతుంది
  • చిరిగిన క్యాలెండర్‌ ఇంట్లో వాస్తు దోషాన్ని పెంచుతుంది
  • వాస్తు ప్రకారం ఆకుపచ్చ, నీలం, తెలుపు, గులాబీ, నీలం , ఎరుపు రంగులున్న క్యాలెండర్లు శుభప్రదం

Also Read: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!

నోట్: వాస్తు నిపుణలు చెప్పినవి, కొన్ని పుస్తకాల ఆధారంగా తీసుకుని రాసిన వివరాలి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Sunil Nostalgic About His School Days: స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
Nisha Agarwal : సమ్మర్ స్పెషల్ ఎల్లో ఫ్రాక్​లో సిగ్గు పడుతున్న నిషా అగర్వాల్.. ఫోటోల్లో క్యూట్​గా ఉందిగా
సమ్మర్ స్పెషల్ ఎల్లో ఫ్రాక్​లో సిగ్గు పడుతున్న నిషా అగర్వాల్.. ఫోటోల్లో క్యూట్​గా ఉందిగా
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి
Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి
ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఉంటాడా అనే ప్రశ్నకు  రోహిత్ శర్మ ఇచ్చిన ఫన్నీ జవాబు
ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఉంటాడా అనే ప్రశ్నకు రోహిత్ శర్మ ఇచ్చిన ఫన్నీ జవాబు
Embed widget