2023 కర్కాటక రాశివారి నెలవారీ ఫలితాలు



జనవరిలో ఆరోగ్యం విషయంలో మినహా మిగిలిన అన్నీ బావుంటాయి. ఒత్తిడి తగ్గుతుంది, ఉద్యోగం, వ్యాపారంలో సక్సెస్ అవుతారు. కుజుడు పదకొండో స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.



ఫిబ్రవరి నెలలో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అవివాహితులకు పెళ్లి జరుగుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. పిల్లల వల్ల కొన్ని సమస్యలుంటాయి.



మార్చి, ఏప్రిల్ లో గురుబలంతో అదృష్టం ఉంటుంది. కార్యాలయంలో పరస్పర మార్పిడికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకున్న వారికి కూడా ఇదే సరైన సమయం. మానసిక ఒత్తిడికి లోనైనా మళ్లీ దాన్నుంచి బయటపడతారు



అంగారకుడి సంచారం వల్ల మే నెలలో కొంత చికాకుగా ఉంటుంది. ఈ సమయాల్లో చర్చలకు దూరంగా ఉండటం మంచిది



విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి జూన్ లో అడుగు ముందుకు పడుతుంది. ఈ నెలలో ఖర్చులు పెరుగుతాయి, వైవాహిక జీవితంలో సమస్యలుంటాయి.



జూలై 2023 ఆర్థిక విజయాన్ని తెస్తుంది. ఈ సమయంలో మీరు అహంకార ఆలోచనలు వదులుకుంటే మంచిది. మీ ప్రవర్తన కూడా వ్యక్తిగత, ఉద్యోగ జీవితంలో వివాదాలకు దారితీస్తుంది



ఆగస్ట్ ,సెప్టెంబరులో మీరు మరింత దృఢంగా మరియు సాహసోపేతంగా ఉంటారు. అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొంటారు.



అక్టోబర్‌లో మీరు ఆస్తులు కొనుగోలు చేయడంలో సక్సెస్ అవుతారు. మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి



నవంబర్‌లో మీ వ్యక్తిగత జీవితం బావుంటుంది. రాహువు మీ తొమ్మిదవ ఇంట్లోకి వెళ్లడంతో మీ రంగంలో కష్టాలు కూడా తొలగిపోతాయి. మంచి ఆర్థిక ప్రతిఫలాలను పొందుతారు



డిసెంబర్ కూడా మీకు మంచినెల అవుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి.



నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు