మేష రాశి ప్రేమ, స్నేహానికి ఉత్తమమైన రోజు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. స్వతంత్ర సంబంధాలు పేరుప్రఖ్యాతులను ప్రభావితం చేస్తాయి.
వృషభ రాశి ఈ రాశివారు ప్రేమికులకు సమయం కేటాయిస్తారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి కానీ వివాదం అంతలోనే సమసిపోతుంది. అవివాహితుల వివాహాల్లో మరికొంత జాప్యం జరుగుతుంది
మిధున రాశి ఈ రోజు మీకు చాలా మంచిరోజు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు ఎవ్వరినైనా తొందరగా ఆకర్షించగలుగుతారు. కొత్త సంబంధాలు మీలో ఉత్సహాన్ని పెంచుతాయి. పాత ప్రేమికులను కలుసుకుంటారు. మీ ఆశ నెరవేరుతుంది.
కర్కాటక రాశి ప్రేమ భాగస్వామి దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఏదో లోటున్నట్టు ఫీలవుతారు. కుటుంబ సమస్యలపై జీవిత భాగస్వామితో వివాదం ఉంటుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
సింహ రాశి భాగస్వామితో సంతోష సమయం గడపడానికి ఈ రోజు మంచి రోజు. మీ మాటతీరుతో ఆ సంతోషం మరింత పెరుగుతుంది.
కన్యా రాశి ఈ రోజు మీరు అకస్మాత్తుగా పాత భాగస్వామిని కలుస్తారు. ఆ సంబంధాన్ని కొనసాగించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. మీరు ఇప్పటికే రిలేషన్లో ఉన్నట్టైతే మీ భాగస్వామితో గడిపేందుకు కొంత సమయం తీసుకుంటారు
తులా రాశి ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేసేందుకు ఈ రోజు మంచి రోజు. మీ మనసులో ప్రేమను తెలియజేసేందుకు మంచి రోజు. జీవిత భాగస్వామితో ఉన్న వివాదం ముగుస్తుంది. రొమాంటిక్ మ్యూజిక్ వినడంపై ఆసక్తి చూపిస్తారు
వృశ్చిక రాశి ఈ రాశివారు ఈ రోజు మీ భాగస్వామితో ప్రత్యేక సమయాన్ని గడపబోతున్నారు. పాత స్నేహితుడిని కలిసే అవకాశం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి.
ధనుస్సు రాశి అవివాహితులకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. మీ మనసుకి నచ్చిన సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ మాటతీరుతో ఎవ్వరినీ బాధపెట్టకండి. వైవాహిక జీవితం బాగుంటుంది.
మకర రాశి ప్రేమ భాగస్వామికి దూరమయ్యే అవకాసం ఉంది. వివాహితులు జీవిత భాగస్వామితో జర్నీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితంలో ఒడుదుడుకులు ఉండవచ్చు.
కుంభ రాశి ప్రేమ సంబంధాల పరంగా మీకు చేసిన తప్పు మిమ్మల్ని నిరాశపరుస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తారు. వైవాహిక జీవితంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
మీన రాశి ప్రేమ సంబంధాలు మధురంగా అనిపిస్తాయి. ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకునేలా ప్రవర్తించవద్దు. వైవాహిక జీవితంలో ఉన్న చేదు తొలగిపోతుంది. భార్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు