అన్వేషించండి

Tirumala Kidnap Case: తిరుమల బాలుడు మైసూర్‌లో- కిడ్నాప్‌ చేసిందెవరో తెలిస్తే షాకే

ఐదు రోజుల టెన్షన్‌కు తెరపడింది. ఐదు రోజుల తర్వాత తల్లి ఒడికి చేరాడు బిడ్డ. మొత్తానికి తిరుమలలో కిడ్నాప్‌నకు గురైన బాలుడు క్షేమంగా తల్లి వద్దకు చేరాడు.

ఏడుకొండలపై గత నాలుగు రోజుల క్రితం ఐదేళ్ళ బాలుడు కిడ్నాప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కిడ్నాప్ కు గురైన బాలుడిని కిడ్నాపర్ తల్లిదండ్రులే పోలీసులకు అప్పగించడం ఆశ్చర్యానికి గురి చేసింది. గత నాలుగు రోజుల క్రితం మతిస్థిమితం లేని పవిత్ర అనే మహిళ తిరుమల శ్రీవారి ఆలయం ముందు కూర్చోని ఉన్న బాలుడిని కిడ్నాప్ చేసి మైసూరుకి తీసుకెళ్ళింది. అటుతరువాత ఆ మహిళ తల్లిదండ్రులు బాలుడిని తిరుమలకు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించడంతో గోవర్ధన్ తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ నెల 1న సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు దామినేడుకి చేందిన ఐదేళ్ళ బాలుడు గోవర్ధన్ కిడ్నాప్ కు గురి అయ్యాడు.. ఆలయంలో ముందు ఆడుకుంటున్న బాలుడిని గుర్తు తెలియని‌ మహిళ కిడ్నాప్ చేసినట్లు బాలుడి తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు.. దీంతో అప్రమత్తంమైన టిటిడి విజిలెన్స్, పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ కు గురైన బాలుడి ఆచూకీ కోసం గాలించారు.. ఐదేళ్ళ బాలుడికి కిడ్నాప్ చేసిన మహిళ బాలుడితో పాటుగా అదే రోజు సాయంత్రం 6:15 నిమిషాల సమయంలో తిరుమల బాలాజీ బస్టాండ్ లో బస్సు ఎక్కి తిరుపతికి బయలుదేరింది.. దాదాపు 7:15 నిమిషాలకు తిరుపతికి చేరుకున్న పవిత్ర, అక్కడ ఆ రాత్రి బస చేసింది. సోమవారం వేకువజామున తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుని ట్రైన్ లో ప్రయాణం చేసింది. ఈ వివరాలను సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు.

అయితే బృందాలుగా ఏర్పడిన పోలీసులు నెల్లూరు, కడప జిల్లాలతో పాటు మరికొన్ని ప్రదేశాల్లో బాలుడి ఆచూకీ కోసం గాలించారు. కానీ బాలుడి జాడ మాత్రం లభించలేదు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ నేరుగా మైసూరుకి వెళ్ళింది. కిడ్నాప్ కి గురై దాదాపు 72 గంటలకు పైగా సమయం గడవడంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూ ఉండగానే బాలుడి కిడ్నాప్ కేసు ఎవరూ ఊహించని మలుపు తిరిగింది.

కిడ్నాప్ గురైన బాలుడిని కిడ్నాప్ చేసిన పవిత్ర అనే మహిళ తల్లిదండ్రులే ఇవాళ ఉదయం (మే 5) బాలుడిని తిరుమలకు తీసుకొచ్చి పోలిసులకు అప్పగించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ పవిత్ర మతిస్తిమితం సరిగా లేకపోవడంతో పాటు ఆమె 15 రోజుల క్రితం తప్పిపోయినట్లు పవిత్ర తల్లిదండ్రులు మైసూరులో పోలిసులకు ఫిర్యాదు చేశారు..కొద్ది రోజుల క్రితం తప్పిపోయిన పవిత్ర దాదాపు 15 రోజుల తరువాత ఇంటికి చేరుకోవడంతో పవిత్ర తల్లిదండ్రులు ఊపీరి పీల్చుకున్నారు.. అయితే పవిత్ర తనతో పాటు ఓ బాలుడిని తీసుకు రావడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన పవిత్ర తల్లిదండ్రులు ఇదే విషయాన్ని పోలిసులకు సమాచారం అందించారు.. అప్పటికే తిరుమలలో బాలుడు కిడ్నాప్ కు గురైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. కిడ్నాప్ కు గురైన బాలుడు గోవర్ధన్ నే పవిత్ర తీసుకొచ్చినట్లు గుర్తించి ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో పవిత్ర తల్లిదండ్రులే పవిత్రతో సహా గోవర్ధన్ ను తిరుమలకు తీసుకొచ్చి పోలీసుల సమక్షంలో బాలుడిని గోవర్ధన్ తల్లి స్వాతికి అప్పగించారు.. తప్పిపోయిన తన కొడుకు దొరక్కడంతో బాలుడి తల్లి పట్టలేని సంతోషానికి లోనైంది.. తన బాలుడిని తనకు అప్పగించిన పోలీసులకు బాలుడి తల్లి స్వాతి కృతజ్ఞతలు తెలిపింది.

టాప్ హెడ్ లైన్స్

Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget