News
News
X

Paritala Sunitha: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి అంత దమ్ముందా: పరిటాల సునీత ఫైర్

రైతులను ఆదుకోవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. భూములను రైతులకు తిరిగిచ్చే దమ్ముందా అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సవాల్ విసిరారు.

FOLLOW US: 

రైతుల్ని ఆదుకోవడం కోసం జైలుకైనా వెళ్తా ౼ పరిటాల సునీత

అనంతపురం జిల్లా - రైతుల కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గం లోని గాండ్లపర్తిలో ఆమె మంగళవారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైతు సమస్యలను తెలుసుకోవడానికి తాను పాదయాత్ర చేపడితే పోలీసుల ద్వారా వైసీపీ నాయకులు అనేక ఇబ్బందులు కలగజేస్తున్నారని ఆరోపించారు. 

పోలీసులను అడ్డం పెట్టుకుని ఆటంకాలు కలిగిస్తున్నారు 
జాకీ పరిశ్రమకు కేటాయించిన భూములను తిరిగి రైతులకు అప్పగించే దమ్ము రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉందా అంటూ మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. గాండ్లపర్తిలో రైతుల కోసం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం ముసలి కన్నీరు కార్చే ప్రకాష్ రెడ్డి రైతులకు చేసిందేమీ లేదని తేల్చి చెప్పారు. పోలీసులను అడ్డంపెట్టుకుని తన పాదయాత్ర కార్యక్రమాలకు అనేకమైన ఆటంకాలు కలగజేస్తున్నారని ఆరోపించారు. ఏదేమైనా రైతుల కోసం పాదయాత్ర విజయవంతం చేస్తానని.. అవసరమైతే రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధం అన్నారు.

పాదయాత్ర చేపడతామని తాము 15 రోజుల కిందట వెల్లడించామని మాజీ మంత్రి పరిటాల సునీత తెలిపారు. కానీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీఎం జగన్ పేరు చెప్పి ఏదో కార్యక్రమం నిర్వహించారు. అయినా పోలీసులకు గౌరవం ఇచ్చి ఒకరోజు తరువాత నేడు పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. శాంతియుతంగా పాదయాత్ర చేయాలని పోలీసులు సూచించగా, మేం అదే విధంగా పాదయాత్ర చేస్తున్నామని.. కేవలం రైతుల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలుస్తామన్నారు. యద్ధం చేయడానికి రాలేదని, బాంబులు, కత్తులు, కటార్లు లాంటివి తీసుకురాలేదని.. ఆటంకాలు కలిగించకూడదన్నారు. శాంతియుతంగా మేం చేస్తున్న యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, కానీ వందలాది మంది పోలీసులను ఇక్కడికి రప్పించి అదనపు భద్రతా చర్యలు చేపట్టడం సరికాదన్నారు.

News Reels

ఎమ్మెల్యే పేరు అడిగితే జగన్ పేరు చెబుతున్నారు.. 
కేవలం పాదయాత్ర చేసి రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రప్పించారని, విజిల్స్ వేయకూడదు అంటూ ఎన్నో ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. పాదయాత్రలో పాల్గొంటున్న వారికి పథకాలు రావని బెదిరింపులకు పాల్పడుతున్నారని, మూడేన్నరేళ్లు అయిందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరు కూడా నియోజకవర్గ ప్రజలకు తెలియదని ఎద్దేవా చేశారు. కొందర్ని మీ ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే.. సీఎం జగన్ పేరు చెబుతున్నారని, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పరిస్థితి ఇలా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం అంత వయసు కూడా లేని ప్రకాష్ రెడ్డి టీడీపీ అధినేతపై కామెంట్లు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

జాకీ వచ్చింది, ఈ ప్రాంతం ప్రజలు బాగుండాలి. 6 వేల మందికి ఉపాధి దొరుకుతుందని గతంలో కలెక్టర్ నిర్ణయాలు తీసుకున్నారని, కానీ మీ ప్రభుత్వంలోకి రాగానే, రూ.15 కోట్లు డిమాండ్ చేశారని ప్రకాష్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. మహిళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తనకు చదువులేదని, ఆయనకు చదువు ఉన్నా కారు బాంబుతో 26 మందిని పొట్టనపెట్టుకున్న వ్యక్తివి అంటూ మండిపడ్డారు. రైతులను కాపాడే బాధ్యత తనపై ఉందని, అవసరమైతే వారి కోసం జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమన్నారు. వెనక్కి వెళ్లిన జాకీని తెప్పించగలరా, రైతులకు భూములు తిరిగి ఇప్పించే దమ్ము ధైర్యం ఉందా అని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి సవాల్ విసిరారు.

Published at : 22 Nov 2022 05:09 PM (IST) Tags: Paritala Sunitha Telugu News TDP Raptadu Thopudurthy Prakash Reddy

సంబంధిత కథనాలు

TTD News: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, ఆ సమయాల మార్పులపై చర్చ!

TTD News: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, ఆ సమయాల మార్పులపై చర్చ!

TTD News: నేడు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యం ఇదే! నిన్నటి హుండీ ఆదాయం, దర్శన సమయం వివరాలు

TTD News: నేడు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యం ఇదే! నిన్నటి హుండీ ఆదాయం, దర్శన సమయం వివరాలు

AP News Developments Today: నేడు మదనపల్లెకు సీఎం జగన్; పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు టూర్

AP News Developments Today: నేడు మదనపల్లెకు సీఎం జగన్; పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు టూర్

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Gold-Silver Price 30 November 2022: బంగారం కొనాలంటే మాత్రం ఆలస్యం చేయకండి- ఈ నగరంలో కొంటే మరింత తగ్గనున్న రేట్‌!

Gold-Silver Price 30 November 2022: బంగారం కొనాలంటే మాత్రం ఆలస్యం చేయకండి- ఈ నగరంలో కొంటే మరింత తగ్గనున్న రేట్‌!

టాప్ స్టోరీస్

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Indian Army's Kite: గద్దలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ, శత్రు డ్రోన్‌లు పసిగట్టేందుకు కొత్త ప్లాన్

Indian Army's Kite: గద్దలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ, శత్రు డ్రోన్‌లు పసిగట్టేందుకు కొత్త ప్లాన్

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

UP Man Dies: డ్యాన్స్ వేస్తుండగా హార్ట్ ఎటాక్! వైరల్ వీడియో

UP Man Dies: డ్యాన్స్ వేస్తుండగా హార్ట్ ఎటాక్! వైరల్ వీడియో