అన్వేషించండి

Chittoor: తల్లీకుమార్తె హత్య, మరో బాలికను గర్భవతిని చేసిన వ్యక్తి - చిత్తూరు కోర్టు సంచలన తీర్పు

తంబళ్లపల్లెలో జంట హత్యల కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ నిందితుడికి  చిత్తూరు జిల్లా కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

జంట హత్య కేసులో నేరం‌ నిరూపణ కావడంతో నిందితుడికి చిత్తూరు జిల్లా న్యాయస్ధానం సంచలన తీర్పు వెల్లడించింది. గత ఏడాది తంబళ్లపల్లెలో జంట హత్యల కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ నిందితుడికి  చిత్తూరు జిల్లా కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఇద్దరి చావుకు కారణమై, మరో మైనర్ బాలిక భవిష్యత్తును అంధకారం చేసిన కర్కోటకుడికి తగిన శిక్ష పడిందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఫిర్యాదుదారు ధనమ్మ వెల్లడించిన వివరాల మేరకు. చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె మండలం, ఏటిగడ్డ తాండా సమీపంలోని పొలం వద్ద రేకుల షెడ్ లో నివాసం ఉన్న గంగులమ్మ, సరళమ్మ, ముగ్గురు మైనర్ పిల్లలు శ్రావణి (14), శశికళ (12), శ్యామ్ (8) మొత్తం ఐదు మంది కనిపించడం లేదని, చిత్తూరులోని ఇందిరానగర్ లో నివసిస్తున్న శివ భార్య ధనమ్మ ఫిర్యాదు చేసింది. ఆ మేరకు 28-01-2021 లో cr no 12/2021 మహిళ, పిల్లలు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ధనమ్మ అన్న వెంకటరమణ అనారోగ్యంతో మరణించిన కొంతకాలం తర్వాత తన వదిన సరళమ్మ(40), తన ముగ్గురు పిల్లలను తీసుకొని తన పుట్టినిల్లు అయిన తంబళ్లపల్లె మండలం, గోవిందువారిపల్లెలో నివసిస్తున్న అమ్మ గంగులమ్మ వద్దకు వెళ్లి అక్కడే కూలీ పనులు చేసుకొంటూ జీవిస్తుంది.

వివాహేతర సంబంధం

అప్పుడప్పుడు వెళ్లి పిల్లలను చూసుకొని వచ్చే క్రమంలో సరళమ్మ గంగిరెడ్డిపల్లె కి చెందిన సయ్యద్ మౌలాతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నట్లు తెలిసింది. అయితే గ్రామంలో వీరి గురించి చెప్పుకొంటున్నందున మౌలా పెద్దేరు ప్రాజెక్టు సమీపంలోని తన పొలంలో రేకుల షెడ్ నిర్మించి వీరందరినీ అక్కడే నివాసం ఉంచినట్లు తెలిసింది. అయితే అక్కడికి కూడా వెళ్లి పిల్లలను పలకరించే దానిని అని ధనమ్మ తెలిపారు. అప్పట్లో కరోనా వ్యాప్తి కారణంగా వెళ్లలేదని, ఫోన్ చేసినా ఫోన్ కలవలేదని కరోనా ఆంక్షల సడలింపు ఇచ్చిన తర్వాత వెళ్లగా సదరు రేకుల షెడ్ కు తాళం వేసి ఉందని తెలిపింది. గ్రామంలోకి వెళ్లి విచారణ చేస్తే, వారు 3 నెలలుగా కనిపించలేదని చెప్పడంతో మౌలాపై అనుమానం వ్యక్తం చేస్తూ తంబళ్లపల్లె పోలీసులకు 28-01-2021న ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. దీనిపై Cr no 12/2021 గా మహిళ , పిల్లలు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో సయ్యద్ మౌలా తాను సరళమ్మ, వారి తల్లి గంగులమ్మను హత్య చేసినట్లు, మైనర్ బాలికపై అత్యాచారం చేశానని మిగిలిన ఇద్దరు పిల్లలను కర్ణాటకలోని ఓ పల్లెలో దాచి ఉంచానని ఒప్పుకున్నాడు. వారి మృతదేహాలను సమీపంలోని చెరువులో పాతి పెట్టానని నేరం అంగీకరించాడు. దీంతో స్థానిక రెవెన్యూ, వైద్య సిబ్బంది సహకారంతో మృతదేహాలను వెలికి తీశారు. తమ వదిన సరళమ్మ, వారి అమ్మ గంగులమ్మ మృతదేహాలను ఫిర్యాదుదారు ధనమ్మ గుర్తించింది. శవ పరీక్షల నివేదికలో హత్య కేసు, మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని మైనర్ బాలిక వాగ్మూలం, డాక్టర్ల పరీక్షల నివేదిక ఆధారంగా ఫోక్సో కేసు పెట్టారు. మొత్తం రెండు కేసులుగా మార్పు చేసిన పోలీసులు, సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత ఫోక్సో కేసులో ముద్దాయి సయ్యద్ మౌలాకు జీవిత ఖైదు విధించారు. రూ.5 వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే జంట హత్యలు, ఎస్సీ, ఎస్టీ కేసులో జీవిత ఖైదుతో పాటు ఉరిశిక్షను అదనపు న్యాయమూర్తి రమేష్ విధించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget