Shiva Jyothi : తిరుమల ప్రసాదంపై అపహాస్యం - యాంకర్ శివజ్యోతి రియాక్షన్
Shiva Jyothi Reaction : ప్రముఖ యాంకర్ శివజ్యోతి సారీ చెప్పారు. తిరుపతి క్యూలైన్లో ప్రసాదంపై ఆమె చేసిన కామెంట్స్‌పై తీవ్ర విమర్శలు రాగా దానిపై రియాక్ట్ అయ్యారు.

Anchor Shiva Jyothi Reaction On Comments About Tirupati Prasadam : తిరుమల క్యూలైన్లో అన్న ప్రసాదంపై చేసిన కామెంట్స్‌తో ప్రముఖ యాంకర్ శివజ్యోతి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. క్యూలైన్లో ఉండగా... 'ప్రసాదం అడుక్కుంటున్నాడు. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం' అంటూ నవ్వుతూ వీడియో చేయడంపై భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు రాగా ఆమె స్పందించారు. సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.
హర్ట్ చేసి ఉంటే సారీ...
తిరుమల ప్రసాదంపై తాను చేసిన కామెంట్స్ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించాలని కోరారు శివజ్యోతి. 'నావైపు నుంచి తప్పు జరిగింది. క్యూలైన్లో నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10 వేల L1 క్యూలైన్లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్‌లీ లైన్లో నిలబడ్డామనే ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేశాను. ఇప్పుడు నేను ఏం చెప్పినా వివరణలానే ఉంటుంది. అందుకే నేను తప్పు ఒప్పుకొంటున్నాను తప్పితే వివరణ కూడా ఇవ్వడం లేదు.
తప్పు నా తరఫున, నా తమ్ముడు సోను తరఫు నుంచి కూడా జరిగింది. తన తరఫున నా తరఫున అందరికీ క్షమాపణలు చెబుతున్నాం. వెంకటేశ్వర స్వామి నాకు జీవితంలో అన్నీ ఇచ్చారు. నేను ఆయన గురించి తప్పుగా ఎలా మాట్లాడతా?. నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకు నేను అందరి దేవుళ్లకు మొక్కుతానని, అన్నీ మతాలను గౌరవిస్తానని తెలుసు. వెంకటేశ్వర స్వామి నా జీవితాన్నే మార్చాడు. ఈ రోజు నేను అనుభవించే ఏదీ కూడా ఆయన దయ లేకుంటే రాదు. తెలిసో తెలియక పొరపాటు మాటలైతే నా నోటి నుంచి నా తమ్ముడు నోటి నుంచి వచ్చాయ్. దానికి సారీ అడుగుతున్నా. ఇంకోసారి ఇలా జరగదు.' అని చెప్పారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Sorry 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/LDyEbt9YJT
— Shiva Jyothi (@iamshivajyothi) November 22, 2025
Also Read : 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోయిన్లు, ఆర్టిస్టులకు అందులో సగం కూడా ఇవ్వలేదు





















