తెలుగు యాంకర్లలో సుమకు ఉండే క్రేజే వేరు. ఆ కట్టు బొట్టును చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా ఆమె నిండుగా వేసుకునే డ్రెస్‌లు అంటే మహిళలు చాలా ఆసక్తి చూపిస్తారు. చీరలు, లంగా ఓణీలు, డ్రెస్‌లు ఇలా ఏది వేసినా.. తనదైన శైలిలో వాటిని సుమ క్యారీ చేస్తుంది. సమ్మర్ స్పెషల్ ఫ్లోరల్ డ్రెస్‌లను చాలా మంది ఎంచుకుంటారు. మీరు కూడా ఇలాంటి ఫ్లోరల్ డ్రెస్‌ల పట్ల ఆసక్తి చూపిస్తే మీరు సుమని ఫాలో అయిపోవచ్చు. సుమ ధరించే ఫ్లోరల్ డ్రెస్‌లు ట్రెడీషనల్‌తో పాటు.. ట్రెండీగా కూడా ఉంటాయి. మీరు ఫంక్షన్లకు వెళ్లేప్పుడు, కాలేజ్, ఆఫీస్‌కు వెళ్లే సమయంలో ఇలాంటి డ్రెస్‌లు ఎంచుకోవచ్చు. సమ్మర్లో ఫ్లోరల్ డ్రెస్‌లతో పాటు, లైట్ కలర్ డ్రెస్‌లు ఎంచుకుంటే మంచిది. (Images Source : Instagram/kanakalasuma)