By: ABP Desam | Updated at : 08 Apr 2023 08:56 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తిరుమల
Tirumala Heavy Rush : తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సప్తగిరుల్లో కొలువైయున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్ధం అనూహ్యంగా తిరుమలగిరులకు భక్తజనం పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో సహా తిరుమలలో ఎటు చూసినా భక్త జనంతో నిండిపోయింది. భక్తుల అధిక రద్దీతో ఏడుకొండలు గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి.
మధ్యాహ్నానికి 80 వేల మంది
కోనేటి రాయుడి దర్శనానికి దేశ విదేశాల నుంచి ప్రతి నిత్యం భక్తులు తిరుమలకు వస్తుంటారు. అయితే ఎన్నో వ్యాయ ప్రయాసలకు లోనై క్షణకాలం పాటు జరిగే శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపం దర్శించగానే వారు పడిన కష్టాలు అన్ని మరిచిపోతుంటారు. ఇలా తిరుమలకు విచ్చేసిన భక్తులకు వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైం స్లాట్ టోకెన్లు, దివ్యదర్శనం వంటి వివిధ రూపాల్లో దర్శనాలు కల్పిస్తుంది టీటీడీ. భక్తులు వారి స్ధోమతకు తగ్గట్టుగా స్వామి వారిని దర్శించుకుని పునీతులు అవుతుంటారు. ఈ నేపధ్యంతో శుక్రవారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అప్రమత్తమైన టీటీడీ అధికారులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, తాగు నీరు అందిస్తున్నారు. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపు 79 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 80 వేల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్నప్రసాదాలు అందించారు.
టోకెన్లు ఉంటేనే దర్శనానికి
అంతే కాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు సేవకులు. ఇక క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 50 వేల మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోగా, భక్తుల అధిక రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ఎస్డీ టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వీఐపీ సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులు తేదీలను మార్పు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.
శ్రీవారి సేవలో సినీ దర్శకురాలు గౌరీ రొనంకి
తిరుమల శ్రీవారిని సినీ దర్శకురాలు గౌరి రొనంకి దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఆమె పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆమెకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే నూతన చిత్రం ప్రారంభమిస్తున్న నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకున్నారన్నారు. పెళ్లిసందడి లాగా ఈ చిత్రం ఘన విజయం సాధించాలని శ్రీవారిని ప్రార్ధించినట్లు చెప్పారు. నూతన చిత్రం కూడా పూర్తిగా వినోదోత్మక చిత్రంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు.
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా
Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!
Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బడకేసి కొట్టిన తండ్రి! స్పాట్లోనే చిన్నారి మృతి
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్లో జీటీపై చెన్నై విక్టరీ!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!