X

Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్లలో కొండ చరియలను పరిశీలించిన కేరళ నిపుణుల బృందం

ఇటీవల వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘాట్ రోడ్లు, కొండ చరియలను కేరళ నిపుణుల బృందం ఇవాళ పరిశీలించింది. దీనిపై టీటీడీకి నివేదిక ఇవ్వనుంది ఈ బృందం

FOLLOW US: 

ఇటీవల వర్షాలకు తిరుమల ఘాట్‌ రోడ్డులో విరిగిప‌డిన కొండ చరియలను కేరళ నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. కేరళ కొల్లంలోని అమృత  విశ్వవిద్యాల‌యం వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్‌స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్ కింద అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్ చేస్తున్న నిపుణుల బృందం కొండ చరియలను పరిశీలించింది. కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,  సూచనల కోసం వీరిని  టీటీడీ ఆహ్వానించింది. ల్యాండ్‌ స్లైడ్స్ నిపుణులు కొండ‌చ‌రియ‌లు విరిగిన ప్రాంతంలో పున‌రుద్ధర‌ణ ప‌నులు, భ‌విష్యత్తులో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా అత్యాధునిక శాస్త్రా ప‌రిజ్ఞానం ఉప‌యోగించుకొని స‌మ‌గ్ర స‌ర్వే నిర్వహించి టీటీడీకి నివేదిక అందించనున్నారు.  

Also Read: తిరుమల ఘాట్ రోడ్లను పరిశీలించిన ఢిల్లీ ఐఐటీ నిపుణులు.. ఏం చెప్పారంటే..

ఇప్పటికే ఢిల్లీ నిపుణుల బృందం పరిశీలన

భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమలలో మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడటంతో మొదటి ఘాట్ రోడ్డులోనే భక్తులను టీటీడీ అనుమతించింది. ఘాట్ రోడ్డుపై రాకపోకలు.. నిలిపేసిన టీటీడీ.. మరమ్మతుల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే.. ఇటీవల ఢిల్లీ ఐఐటీ నిపుణులు ఘాట్ రోడ్డును పరిశీలించారు. టీటీడీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఐఐటీ బృందానికి ఘాట్ రోడ్డు పరిస్థితిని వివరించారు. ఘాట్ రోడ్డుతో పాటుగా పక్కనే ఉన్న కొండ పరిస్థితి వివరించారు.  దాదాపు వెయ్యి ఏళ్ల కిందట ఏర్పడిన పర్వతాలు కావడంతో పరిస్థితిని కూలంకషంగా అధ్యయనం చేయాలని బృందం అనుకుంది. 

Also Read:  ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

ఇటీవల వర్షాలకు ఘాట్ రోడ్లపై విరిగిపడిన కొండ చరియలు

ప్రస్తుతం జరిగిన ఘటన ప్రమాదకరమైందని టీటీడీ ఇంజినీరింగ్ అధికారి రామచంద్రారెడ్డి అన్నారు. టీటీడీ ఉన్నతాధికారులకు పరిస్థితిని తెలియజేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలు.. చేపడతామని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తిరుమలలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. వరదల కారణంగా తిరుమల శ్రీవారి మెట్ల మార్గం చాలా వరకు ధ్వంసమైంది.  కొండ చరియలు ఎక్కువగా విరిగి పడిన రోజున.. ఘాట్ రోడ్డులో‌ నిలిచి పోయిన వాహనాలను లింక్ రోడ్డు గుండా తిరుమలకు అనుమతించారు. మొదటి ఘాట్ రోడ్డు నుండే తిరుమలకు వాహనాలను అనుమతించారు. అయితే తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే వాహనాలు ఒక గంట, తిరుమల నుండి తిరుపతికి వచ్చే వాహనాలకు మరో గంట పాటు అనుమతిస్తూ ఒకే ఘాట్ రోడ్డులో వాహనాలను అధికారులు అనుమతించారు.

Also Read: తిరుమలకు వెళ్లే భక్తులకు ఇబ్బంది లేదు.. మెుదటి ఘాట్ రోడ్డులో వాహనాలు నడుస్తున్నాయి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: tirupati Tirumala Ghat roads kerala experts

సంబంధిత కథనాలు

Gudivada :  గుడివాడలో టీడీపీ వర్సెస్ వైఎస్‌ఆర్‌సీపీ - కేసినో రాజకీయంతో  ఉద్రిక్తత.. మోహరించిన పోలీసులు !

Gudivada : గుడివాడలో టీడీపీ వర్సెస్ వైఎస్‌ఆర్‌సీపీ - కేసినో రాజకీయంతో ఉద్రిక్తత.. మోహరించిన పోలీసులు !

Nellore Corona Deaths: నెల్లూరులో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. మరణాల వెనక అసలు కారణం అదే..! 

Nellore Corona Deaths: నెల్లూరులో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. మరణాల వెనక అసలు కారణం అదే..! 

Breaking News Live: ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. వరంగల్‌లో నిలిపివేత

Breaking News Live: ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. వరంగల్‌లో నిలిపివేత

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

PRC Issue In AP: పీఆర్సీ కోసం ఏకమైన ఉద్యోగ సంఘాలు.. నేడు సచివాలయంలో కీలక భేటీ, ప్రభుత్వంతో తాడో పేడో !

PRC Issue In AP: పీఆర్సీ కోసం ఏకమైన ఉద్యోగ సంఘాలు.. నేడు సచివాలయంలో కీలక భేటీ, ప్రభుత్వంతో తాడో పేడో !
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Oscars 2022: ఆస్కార్ బరిలో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్' 

Oscars 2022: ఆస్కార్ బరిలో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్' 

Hyderabad Microsoft : హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల గిఫ్ట్.. రూ. 15వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మైక్రోసాఫ్ట్ !

Hyderabad Microsoft :  హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల గిఫ్ట్.. రూ. 15వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మైక్రోసాఫ్ట్ !

Balakrishna: అభిమానులూ... బాలయ్యను కలుస్తారా? మీకు ఇదొక మంచి ఛాన్స్!

Balakrishna: అభిమానులూ... బాలయ్యను కలుస్తారా? మీకు ఇదొక మంచి ఛాన్స్!

T20 World Cup 2022: ఈ సారి తగ్గేదే లే! ఈ ప్రపంచకప్‌లోనూ పాక్‌తోనే టీమ్‌ఇండియా తొలి పోరు

T20 World Cup 2022: ఈ సారి తగ్గేదే లే! ఈ ప్రపంచకప్‌లోనూ పాక్‌తోనే టీమ్‌ఇండియా తొలి పోరు