Tiger Wandering: అమ్మో పులి మళ్లీ వచ్చేసింది, ఆందోళనలో ప్రజలు!
Tiger Wandering: విజయ నగరం జిల్లాలోని పోర్లు గ్రామంలో పులి సంచారం సంచలం సృష్టిస్తోంది. గత రెండు నెలల నుంచి కనిపిస్తూ... ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఓ లేగదూడును కూడా చంపి తింది.
Tiger Wandering: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ పొర్లు గ్రామంలో సోమవారం ఉదయం పులి సంచారం కలకలం సృష్టించింది. మేతకు వెళ్లిన ఆవు దూడపై దాడి చేసి హతమార్చింది. విషయం గుర్తించిన స్థానిక ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నెల రోజుల కిందట ఇదే గ్రామంలో ఒక ఆవుపై దాడి చేసిన పులి మరలా నేడు ఇదే గ్రామంలో కనిపించడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు నెలలుగా ఈ అటవీ ప్రాంత ప్రజాలందరూ పులి భయంతో ఆందోళన చెందుతున్నా.. అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పులిని బందించాలని కోరుతున్నారు.
భయాందోళనలో ఆగమైతున్న ప్రజలు..
గత రెండు నెలలుగా సమీప ప్రాంతంలో పులి సంచరించడంతో.. గ్రామస్తులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. దీంతో అటవీశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు పెద్ద పులి పాద ముద్రలు సేకరించారు. గతంలో పులి దాడిలో మృతి చెందిన ఎద్దుకు నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అయితే అడవుల్లోకి వెళ్లి ఆహారం దొరక్క మళ్లీ వెనక్కి వచ్చి వుండచ్చని అధికారులు భావిస్తున్నారు.
ప్రాణనష్టం జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు..
తూర్పు గోదావరి జిల్లా నుంచి ఈ ప్రాంతానికి పులి వచ్చినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పాద ముద్రలో ఆధారంగా నాలుగేళ్ల వయసున్న రాయల్ బెంగాల్ పెద్దపులిగా తేల్చారు. ఇది చాలా తెలివైందని.. అయితే పులి సంచారంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ వేసి ప్రత్యేక బృందాలను ఇక్కడ పెట్టినట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఇది పగలంతా విశ్రాంతి తీస్కొని రాత్రి వేళలో ప్రయాణం చేస్తున్నట్లు గుర్తించారు.
బాధితులకు నష్టపరిహారం..
అయితే పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని అటవీ శాఖ అధికారులు వివరించారు. విజయనగరం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమాత్రం ఆద మార్చినా పులి ప్రాణాలు తీసేదాక వదలని... అది దృష్టిలో ఉంచుకొని ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అయితే ఆ పులి ఏ దిశగా వెళ్తుందనేది అంచనా వేస్తున్నట్లు వివరించారు. పెద్దపులి సంచారం కోసం డ్రోన్లు కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు. జీపీఎస్ సిస్టం కెమెరా ఆధారంగా పెద్దపులి ఆచూకీ తెలుసుకుంటామన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అలాగే పెద్దపులి వల్ల నష్టపోయిన వారికి పరిహారం కూడా చెల్లిస్తామని వివరించారు.
అన్నీ అఫ్పుడే.. ఇప్పుడు కనీసం స్పందిచట్లేరు!
మొదటి సారి ఈ ప్రాంతంలో పులి సంచరించిందని తెలిసినప్పటి నుంచి అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. గత రెండు నెలల క్రితం పులి కనపించదని చెప్తే... పోలీసులు, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించారని, కానీ మళ్లీ ఇప్పుడు చెప్తే మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పులి జాడ కనిపెట్టాలని కోరుతున్నారు.