అన్వేషించండి

Yuvagalam Tension : నూజివీడు యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత - లాఠీచార్జ్ చేసిన పోలీసులు

యువగళం నూజివీడు పాదయాత్రలో ఉద్రిక్తత ఏర్పడింది. రెండు వర్గాలపై లాఠీచార్జ్ చేసి పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.

Yuvagalam Tension :  టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర నూజివీడులో కొనసాగుతూండగా ఉద్రిక్తత ఏర్పడింది.  ఏలూరు జిల్లా నూజివీడులో  పలువురు వైకాపా కార్యకర్తలు తమ పార్టీ జెండాలతో అక్కడికి వచ్చారు. అధికార పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం లేదని టీడీపీ  నేతలు ఆరోపించారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నవైసీపీ  కార్యకర్తలను అడ్డుకునేందుకు టీడీరపీ  కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ  కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. అనంతరం ఇరు వర్గాలను చెదరగొట్టి పాదయాత్రను ముందుకు నడిపించారు.                                              

నూజివీడు మండలం తుక్కులూరు గ్రామం వద్ద కూడా  యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత ఏర్రడింది.  సైకో పోవాలి అని వస్తున్న పాటను ఆపాలంటూ  వైసీపీ నేతలు  పాదయాత్రపైకి దూసుకు వచ్చారు.  ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  వైఎస్సార్సీపీ నాయకుడు పాలడుగు విజయ్ కుమార్ ఇంటి పై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు.  రెండు బైక్ లు పాక్షికంగా ధ్వంసం అవడంతోపరి్సథితి ఉద్రిక్తంగామారింది.   ఇంటి భవన అద్దాలు పగిలిపోయాయి.  మీడియా ఫోన్లను టిడిపి యువగళం టీమ్ లాక్కుంది.  పోలీసులు వారితో గొడవపడి ఫోన్లు తెచ్చి ఇచ్చారు.  పోలీసులు ఇరువర్గాలని చదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు పోలీసులు.                            

194వ రోజు పాదయాత్ర నూజివీడు నియోజకవర్గంలో సాగుతోంది. నూజివీడు నియోజకవర్గం తుక్కులూరు గ్రామ దళితులు  యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామంలో ఎస్సీ (SC)లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారని, ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేసి ద్రోహం చేసిందన్నారు. అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్ తొలగించారని, గురుకుల పాఠశాలలో వసతులు లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదని, ఎస్సీ, ఎస్టీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరించాలని లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు.                              

దళితుల విషయంలో  ఏరుదాటాక తెప్పతగలేసిన చందంగా’ వ్యవహరిస్తున్నారని లోకేష్ విమర్శించారు.  పేద దళితుల ఉన్నత విద్యా భ్యాసం కోసం అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో నిర్వీర్యం చేశారని విమర్శించారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలు చేయడం నిత్యకృత్యంగా మారిందని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీలకు పక్కా ఇళ్లు, దళితవాడల్లో డ్రైనేజీలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB Won Against CSK Entered into Playoffs | చెన్నైని కొట్టి ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ | ABP DesamVizag Police About Sensational Attack | వైజాగ్‌లో కుటుంబంపై జరిగిన దాడి గురించి స్పందించిన పోలీసులు | ABP DesamPavitra Bandham Chandu Wife Sirisha Comments | సీరియల్ నటుడు చందు మృతిపై భార్య శిరీష సంచలన నిజాలు | ABP DesamWhat if RCB Vs CSK Match Cancelled | ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Lok Sabha Election 2024: ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది
Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది
Rains: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
BJP MLAs Meet Revanth Reddy : రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఎందుకంటే ?
రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఎందుకంటే ?
Embed widget