అన్వేషించండి

Andhra Pradesh: 9 నెలల క్రితం అదృశ్యమైన యువతి ఇప్పుడెలా దొరికిందీ? జమ్మూ ఎందుకు వెళ్లినట్టు?

Vijayawada: ప్రేమ పేరిట యువకుడు చేసిన మోసానికి బలైన యువతిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చొరవతో పోలీసులు కాపాడారు. జమ్మూలో ఉన్న యువతిని రక్షించి తీసుకొచ్చారు.

Deputy CM Pawan Kalyan :  ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం చొరవతో 9 నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని రోజుల వ్యవధిలోనే పోలీసులు కనిపెట్టారు. ఇంతకీ ఇన్ని రోజులు కనిపించని యువతిని ఇంత త్వరగా ఎలా కనిపెట్టారు. ఆమెను ఎవరు తీసుకెళ్లారు. వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?

సామాజిక మాధ్యమాల వేధికగా  యువతులతో పరిచయం పెంచుకోవడం...తియ్యని మాటలతో వలపు వల విసరడం ఆపై సన్నిహితంగా మెలిగినప్పుడు తీసుకున్న ఫొటోలు(Photos), వీడియోలు(Video) చూపించి బెదిరించడా పరిపాటిగా మారింది. నిత్యం వేలాది ఘటనలు వెలుుగుచూస్తున్నా...యువతలు మోసగాళ్ల బారీన పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిలే ఎక్కువ మంది ఈ మోసగాళ్ల చేతిలో బలైపోతున్నారు. అలా ప్రేమపేరిట బలైపోయిన ఓ యువతి అదృశ్యం కేసును ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌(Pavan Kalyan) చొరవతో పోలీసులు ఛేదించారు. 

ప్రేమ పేరిట వల
భీమవరానికి(Bhimavaram) చెందిన ప్రభాకర్‌రావు, శివకుమారి దంపతులుకు ఇద్దరు కుమార్తెలు..చిన్న కుమార్తె  తేజస్విని(Tejeswani) విజయవాడలోని పెధ్దమ్మ వాళ్ల ఇంట్లో ఉంటూ హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్స్‌ చేస్తోంది

అదే కళాశాలలో చదువుకుంటున్న సీనియర్ అంజాద్‌(Amjad) ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత తియ్యని మాటలతో ప్రేమ పేరిట ట్రాప్‌ చేశాడు. ఆ తర్వాత ఆ యువతిని తీసుకుని పారిపోయాడు. రెండేళ్ల క్రితం కూడా అంజాద్ ఇదే విధంగా ఓ యువతిని ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని ప్రేమపేరిట తీసుకుని వెళ్లిపోయాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపి ఇద్దరిని పట్టుకుని వచ్చారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి యువతిని తల్లిదండ్రులు అప్పగించి...అంజాద్‌ను గట్టిగా హెచ్చరించి వదిలేశారు. అయినప్పటికీ అతని బుద్ధి మారలేదు. సామాజిక మాధ్యమాల్లో యువతులకు వలవేయడం వారిని లవ్‌ పేరిట ట్రాప్‌ చేయడం మానలేదు.

తేజస్వీనితో పరార్
తేజస్వీనిని సైతం ప్రేమపేరిట మోసం చేసిన అంజాద్‌...గతేడాది అక్టోబర్ 28న ఆమెను తీసుకుని హైదరాబాద్‌(Hyderabad) పారిపోయాడు. యువతి ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు విజయవాడ(Vijayawada)లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి  వెళ్లేసరికి వారిరువురూ తమ ఫోన్లను అమ్మేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులకు ఆచూకీ దొరక్కుండా ఉండేందుకు కేరళ(Kerala), రాజస్థాన్‌(Rajasthan) వివిధ ప్రాంతాలకు తేజస్విని తిప్పుతూ ఆమెను హింసించాడు. డబ్బుల్లేకపోవడంతో ఆమె చెవికమ్మలు, బంగారు వస్తువులు అమ్మేశాడు. ముంబయి,పుణెకు వెళ్లిన ఈ జంట చివరిగా జమ్ము(Jammau) చేరుకున్నారు. బ్రతకడానికి డబ్బులు లేకపోవడంతో అంజాద్‌ ఓ హోటల్‌లో పనికి కుదిరాడు. 

తేజస్వినికి నరకం 
ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి తేజస్విని తీసుకుపోయిన అంజాద్ నిజస్వరూపం కొంతకాలానికే తెలిసొచ్చింది. చేతిలో ఉన్న డబ్బులు, బంగారం అయినపోయిన తర్వాత అతని ప్రవర్తన ఏంటో తెలిసిపోయింది. ఇంట్లో వాళ్లతే మాట్లాడితే పోలీసులు పసిగట్టేస్తారని నమ్మబలికిన అంజాద్‌....ఆమె ఎవరితోనూ కాంటాక్ట్ కాకుండా జాగ్రత్తపడ్డాడు. ఆ తర్వాత కొత్త ఫోన్ కొనుగోలు చేసినా...ఆమెకు కనీసం ఫోన్‌ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. కనీసం తాను ఎక్కడ ఉందో కూడా ఆమెకు తెలియనివ్వలేదు. ఊరుగాని ఊరు...భాషకూడా రాకపోవడంతో అతను చెప్పినట్లు ఆమె విన్నది. అయితే అంజాద్‌ ఆదమరుపుగా ఉన్న సమయంలో అతని ఫోన్ నుంచి అక్క ఇన్‌స్ట్రాగ్రామ్‌కు తేజస్విని మెసేజ్‌ చేసింది. పోలీసులు ఆమెతో ఛాటింగ్‌ చేసినా...తాను ఎక్కడ ఉన్నానన్నది కచ్చితంగా చెప్పలేకపోయింది. అయితే ఇటీవలే అమెజాన్‌ నుంచి తెప్పించిన ఫార్శిల్ కవర్‌పై ఉన్న అడ్రస్‌ను ఫొటో తీసి పంపించడంతో...పోలీసులు వారు జమ్మూలో ఉన్నట్లు తెలుసుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి తేజస్విని కాపాడారు.

పవన్‌ చొరవతో కదిలిన యంత్రాంగం
ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనలో పాలకుల్లో ఉంటే సమస్యలు ఎంత సత్వరం పరిష్కారం అవుతాయో చెప్పేందుకు ఈకేసే ఉదారహణ..తేజస్విని అదృశ్యమై 9 నెలలవుతుంటే తల్లిదండ్రులు తిరగని స్టేషన్ లేదు..మొక్కని అధికారి లేడు. గత ప్రభుత్వ హయాంలో ఈ కేసున పట్టించుకున్న పాపాన పోలేదు. డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్(Pavan Kalyan) బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పవన్‌కు ఆ తల్లిదండ్రులు గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన పవన్ ఈ కేసు చేధించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రెండురోజుల్లోనే యువతీ, యువకుల జాడ కనిపెట్టారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Greater MLAs :  గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా ? కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా !
గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా ? కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా !
NEET PG 2024 Date: నీట్ పీజీ - 2024 పరీక్ష షెడ్యూలు వెల్లడి, ఎగ్జామ్ ఎప్పుడంటే?
నీట్ పీజీ - 2024 పరీక్ష షెడ్యూలు వెల్లడి, ఎగ్జామ్ ఎప్పుడంటే?
Margani Bharat Ram :  ప్రచార వాహనానికి నిప్పు పెట్టింది భరత్ రామ్ అనుచరుడే - అసలు ట్విస్ట్‌తో మాజీ ఎంపీకి షాక్ !
ప్రచార వాహనానికి నిప్పు పెట్టింది భరత్ రామ్ అనుచరుడే - అసలు ట్విస్ట్‌తో మాజీ ఎంపీకి షాక్ !
UK Election Results 2024: ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Emotional Speech About Jasprit Bumrah | బుమ్రా ఈ దేశపు ఆస్తి అంటున్న కోహ్లీ | ABP DesamVirat Kohli Emotional About Rohit Sharma |15 ఏళ్లలో రోహిత్ శర్మను అలా చూడలేదంటున్న విరాట్ కోహ్లీJagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Greater MLAs :  గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా ? కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా !
గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్ తప్పదా ? కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా !
NEET PG 2024 Date: నీట్ పీజీ - 2024 పరీక్ష షెడ్యూలు వెల్లడి, ఎగ్జామ్ ఎప్పుడంటే?
నీట్ పీజీ - 2024 పరీక్ష షెడ్యూలు వెల్లడి, ఎగ్జామ్ ఎప్పుడంటే?
Margani Bharat Ram :  ప్రచార వాహనానికి నిప్పు పెట్టింది భరత్ రామ్ అనుచరుడే - అసలు ట్విస్ట్‌తో మాజీ ఎంపీకి షాక్ !
ప్రచార వాహనానికి నిప్పు పెట్టింది భరత్ రామ్ అనుచరుడే - అసలు ట్విస్ట్‌తో మాజీ ఎంపీకి షాక్ !
UK Election Results 2024: ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ 
iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్‌పై భారీ ఆఫర్లు - అదనంగా రూ.59 వేల వరకు!
ఐఫోన్ 15 సిరీస్‌పై భారీ ఆఫర్లు - అదనంగా రూ.59 వేల వరకు!
Telangana: అర్థరాత్రి బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ - కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు
అర్థరాత్రి బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ - కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు
Raj Tarun: హీరో రాజ్‌ తరణ్‌పై చీటింగ్‌ కేసు - హీరోయిన్‌తో ఎఫైర్‌,  నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు ఫిర్యాదు
హీరో రాజ్‌ తరణ్‌పై చీటింగ్‌ కేసు - హీరోయిన్‌తో ఎఫైర్‌, నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు ఫిర్యాదు
Bimbisara Prequel: 'బింబిసార'కు ప్రీక్వెల్ - 'రొమాంటిక్' దర్శకుడితో కళ్యాణ్ రామ్ సినిమా!
'బింబిసార'కు ప్రీక్వెల్ - 'రొమాంటిక్' దర్శకుడితో కళ్యాణ్ రామ్ సినిమా!
Embed widget