By: ABP Desam | Updated at : 26 May 2023 06:23 PM (IST)
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ శనివారానికి వాయిాదా
Avinash Bail Case : వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన విచారణలో మొదట అవినాష్ రెడ్డి తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఐదున్నర గంటల పాటు వాదనలు వినిపించిన తర్వాత.. సునీతారెడ్డి తరపు లాయర్లు గంట పాటు తమ వాదనలు వినిపించారు. ఇక సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించాల్సి ఉంది. దీంతో శనివారం ఉదయానికి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
అవినాష్ రెడ్డి తరపు లాయర్లు ఏమని వాదించారంటే ?
ఫోన్ కాల్స్ ఆధారంగా అవినాష్ రెడ్డిని కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆయన తరపు లాయర్లు వాదించారు. వివేకానందరెడ్డిది హత్యో, గుండెపోటో చెప్పడానికి అవినాష్ రెడ్డి లాయరో, డాక్టరో కాదన్నారు. 2020 జులై 9న సీబీఐ FIR నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను సీబీఐ విచారించిందని అవినాష్ రెడ్డి లాయర్ కోర్టుకు తెలిపారు. రంగన్న స్టేట్‌మెంట్ రికార్డు చేసి సంవత్సరం పాటు వదిలేశారని, స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా నలుగురి వివరాలు చెప్పాడని అవినాష్ లాయర్ అన్నారు. కానీ సీబీఐ నెలరోజుల పాటు దస్తగిరిని విచారణకు పిలవలేదని, దస్తగిరిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని అవినాష్ లాయర్ వాదించారు. మున్నా దగ్గర డబ్బు దొరికినా ఛార్జ్‌షీట్‌లో సాక్షిగా పేర్కొనలేదని, దస్తగిరి స్టేట్‌మెంట్‌లో అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా? అని జడ్జి ప్రశ్నించారు. దస్తగిరి దగ్గర 3 సార్లు 161 కింద సీబీఐ స్టేట్‌మెంట్ తీసుకుందని, మొదటి స్టేట్‌మెంట్‌లో ఎక్కడ అవినాష్ గురించి చెప్పలేదని అవినాష్ లాయర్ చెప్పారు. చివరి స్టేట్‌మెంట్‌లో గంగిరెడ్డి తనతో చెప్పిన వ్యాఖ్యలలో అవినాష్ తమ వెనుకాల ఉన్నాడని చెప్పినట్టు స్టేట్‌మెంట్ ఇచ్చారని లాయర్ పేర్కొన్నారు.
సునీత తరపు లాయర్ ఏం వాదించారంటే ?
వివేకా గుండె పోటుతో చనిపోయాడని చెప్పారని, రక్తపు వాంతులతో మృతి చెందినట్లు చెప్పారని, హత్య జరిగితే.. గుండె పోటు అని ఎలా చెపుతారని సునీతారెడ్డి తరుపు న్యాయవాది వాదించారు. ఇందులో కుట్ర దాగి ఉందని, రాజారెడ్డి, గంగి రెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చి కుట్లు వేశారని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అవినాష్ రెడ్డి, కృష్ణారెడ్డి, గంగిరెడ్డి, శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారని సునీతారెడ్డి తరుపు న్యాయవాది రవిచంద్ వాదించారు. దాదాపుగా గంట సేపు సునతారెడ్డి తరపు లాయర్.. న్యాయమూర్తికి తన వాదనలు వినిపించారు.
శనివారం సీబీఐ తరపు వాదనలు
సీబీఐ లాయర్ వాదనలు శనివారం వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అదనపు వివరాలను న్యాయమూర్తి ముందు సీబీఐ అధికారులు ఉంచారు. మరో వైపు అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. కర్నూలు నుంచి ఆమెను డిశ్చార్జ్ చేశారు వైద్యులు. అక్కడ్నుంచి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. తల్లి వెంట అవినాష్ రెడ్డి కూడా హైదరాబాద్ వచ్చారు. మరో వైపు జైల్లో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి బీపీ పెరగడంతో.. నిమ్స్ లో చికిత్స చేయించి మళ్లీ జైలుకు తరలించారు.
చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వివాహం
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్! బిపర్‌జోయ్ తుపాను తీవ్రత ఎలా ఉందంటే?
Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
Medical Collages: 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం - ఏపీ, తెలంగాణకు ఎన్నంటే
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam