News
News
X

Vijay CID : చింతకాయల విజయ్‌కు నాయిబెయిలబుల్ వారెంట్ - కోర్టును కోరిన సీఐడీ !

చింతకాయల విజయ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని గుంటూరు కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది.

FOLLOW US: 
 
Vijay CID :  తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల విజయ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చే్యాలని గుంటూరు కోర్టును సీఐడీ అధికారులు ఆశ్రయించారు. చింతకాయల విజయ్ ఐటీడీపీ అధ్యక్షుడిగా ఉంటూ సీఎం సతీమణి అయిన వైఎస్ భారతిపై..భారతీపే అనే క్యూఆర్ కోడ్‌ను తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని దీనిపై కేసు నమోదయిందని సీఐడీ అధికారులు తమ పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసు విషయంలో నోటీసులు ఇవ్వడానికి వెళ్తే.. తమను చింతకాయ విజయ్ అనుచరులు అడ్డుకున్నారని తెలిపారు. విచారణకు హాజరు కాలేదని దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరపాల్సి ఉంది. 

భారతి పే పేరుతో క్యూ ఆర్ కోడ్ తయారు చేశారని చింతకాయల విజయ్‌పై సీఐడీ కేసు

హైదరాబాద్‌లోని చింతకాయల విజయ్ ఇంట్లో ఈ నెల ఒకటో తేదీన ఏపీ సీఐడీ పోలీసులు హల్ చల్ చేశారు.  హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్న  విజయ్ ఇంటికి  ఏపీసీఐడీ అధికారుల బృందం వారింటికి వెళ్లింది. ఆ సమయంలో చింతకాయల విజయ్ ఇంట్లో లేరు. పనిమనిషులతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు. అయితే వారినే సీఐడీ అధికారులు ప్రశ్నించారని.. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారని ఆరోపణలు వచ్చాయి. చింతకాయల విజయ్ లేకపోవడంతో ఆయన ఇంట్లో ఉండే పనిమినిషికి నోటీసులు ఇచ్చారు.   ఈనెల 6న హాజరుకావాలంటూ 41 సీఆర్పీసీ కింద నోటీసుల్లో పేర్కొన్నారు. 

ఆరో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా హాజరు కాని విజయ్ 

News Reels

అయితే ఆరో తేదీన విజయ్ సీఐడీ విచారణకు హాజరు కాలేదు. విజయ్ తరపున వచ్చిన న్యాయవాదులు తాము తీసుకొచ్చిన లేఖను అందించే ప్రయత్నం చేసారు. అధికారులకు నేరుగా లేఖ ఇచ్చేందుకు విజయ్ తరపు న్యాయవాదులు చాలా సేవు వేచి చూసారు. కానీ, స్పందన రాలేదు. దీంతో.. తపాలా విభాగంలో ఆ లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. సీఐడీ పోలీసులు విజయ్ నివాసంలో ఇచ్చిన నోటీసు చెల్లదని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు కాకుండా, పనిమనిషిలకు ఇస్తే చెల్లదని వివరించారు.ఆ నోటీసులో కేసు వివరాలు ప్రస్తావించలేదని, భయపెట్టేందుకే ఈ నోటీసులు ఇచ్చారన్నారు.  జారీ చేసిన నోటీసుల పైన చింతకాయల విజయ్ సీఐడీకి రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్ కాపీ, నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు చెప్పాలని విజయ్ లేఖలో కోరారు.  

సీఐడీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం 

అయితే ఈ లేఖను సీఐడీ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. తాము విచారణకు పిలిచినా హాజరు కావడం లేదని.. దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ చేస్తే.. ఆయనను సీఐడీ అదుబులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే సీఐడీ అధికారుల తీరుపై చింతకాయల విజయ్ కూడా న్యాయపోరాటం చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

Published at : 08 Oct 2022 03:59 PM (IST) Tags: AP CID Chintakayala Vijay non-bailable warrant Bharti pay

సంబంధిత కథనాలు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Vizag Woman Murder: విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు, ట్విస్ట్ మామూలుగా లేదు

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana :  మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ -  బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

Sathya Sai District News: వాషింగ్ మెషిన్ పెట్టిన చిచ్చు - మహిళను కొట్టి చంపేసిన పక్కింటి వ్యక్తులు

Sathya Sai District News: వాషింగ్ మెషిన్ పెట్టిన చిచ్చు - మహిళను కొట్టి చంపేసిన పక్కింటి వ్యక్తులు

Chittoor District News: పలమనేరులో ఫ్యామిలీతో రోడ్డుపై మకాం వేసిన గజరాజులు, భయం గుప్పిట్లో ప్రజలు

Chittoor District News: పలమనేరులో ఫ్యామిలీతో రోడ్డుపై మకాం వేసిన గజరాజులు, భయం గుప్పిట్లో ప్రజలు

టాప్ స్టోరీస్

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

TS Minister Harish Rao: ‘కంటి వెలుగు’పై కీలక విషయాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు, ఈసారి 100 రోజులే

Most T20 Wickets 2022: మీ పెద్దోళ్లున్నారే! అంటూనే ఎక్కువ వికెట్లు పడగొట్టిన కుర్రాళ్లు - 2022 టీ20 టాప్‌ 10 బౌలర్లు వీరే!

Most T20 Wickets 2022: మీ పెద్దోళ్లున్నారే! అంటూనే ఎక్కువ వికెట్లు పడగొట్టిన కుర్రాళ్లు - 2022 టీ20 టాప్‌ 10 బౌలర్లు వీరే!