AP Highcourt School Fees : ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజులను మీరెలా నిర్ణయిస్తారు ? ఏపీ ప్రభుత్వ జీవోలను కొట్టివేసిన హైకోర్టు !
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు ఖరారుచేస్తూ ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టి వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ ఏపీసర్కార్ జారీ చేసిన జీవో నెం. 53, 54లను హైకోర్టు కొట్టి వేసింది. ప్రైవేట్ స్కూళ్లు, జూ.కాలేజీలకు మీరెలా ఫీజులు ఖరారు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో ఇచ్చారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏపీలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లు, జూ.కాలేజీలకు ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. ప్రతి ప్రైవేట్ స్కూళ్లు, జూ.కాలేజీల అభిప్రాయాలను తీసుకున్నాకే.. ఫీజులు ఖరారు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
Also Read: వంగవీటిపై దాడికి రెక్కీ నిర్వహించిందెవరు ? పోలీసులు అంతర్గత విచారణ ప్రారంభించారా?
2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు వర్తించేలా ఫీజులను ఖరారు చేస్తూ గత ఆగస్టు ఆఖరులో జీవో నెం. 53, 54ను ప్రభుత్వం జారీ చేసింది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దోపిడీ ఇష్టానుసారం సాగుతోందని... ది. ముఖ్యంగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు భారీగా ఫీజు వసూలు చేస్తున్నాయని ప్రభుత్వం భావించింది. స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గా ప పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ గత ఏడాదిలోనే ఫీజులపై నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడంతో అమలు చేయలేకపోయారు. తర్వాత ఆగస్టులో అన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వానికి కిందట సిఫార్సులు అందించింది. వీటి ఆధారంగా ప్రభుత్వం జీవో 53, 54లను విడుదల చేసింది.
Also Read: ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థుల ధర్నా.. అందరూ వెళ్లిపోవాలని డిమాండ్, ఎందుకంటే..
ఐదో తరగతి వరకు కనిష్టంగా ఏడాదికి రూ. పది వేలు.. గరిష్టంగా రూ. పన్నెండు వేలను నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు వసూలు చేయాలని ప్రభుత్వం ఆ జీవోల్లో స్పష్టం చేసింది. ఇక ఆరు నుంచి పదో తరగతి వరకూ ఆ ఫీజులు రూ. 12 నుంచి 18వేలు మాత్రమే . జూనియర్ కాలేజీల్లో ఏడాదికి రూ. పదిహేను వేలు కనిష్టం కాగా రూ. పద్దెనిమిది వేలు అత్యధికంగా నిర్ణయించారు. ట్యూషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్సు, కంప్యూటర్ ల్యాబొరేటరీ, స్టూడెంట్ వెల్ఫేర్, స్టడీ టూర్ ఇలా అన్నీ అందులోనే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని జీవోలో పేర్కొంది. అయితే ఇంత స్వల్ప మొత్తం ఫీజులతో కాలేజీలు, స్కూళ్లు నడపడం సాధ్యంకాదని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కోర్టుకెక్కెయి. విచారణ అనంతరం హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.