![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP News: అమరావతికి చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి - సీఎం సీఎం అంటూ నినాదాలు
Amaravati News: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా సీఎం.. సీఎం.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
![AP News: అమరావతికి చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి - సీఎం సీఎం అంటూ నినాదాలు TDP top leaders Chandrababu Nara Lokesh reaches Amaravati ahead of Election counting AP News: అమరావతికి చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి - సీఎం సీఎం అంటూ నినాదాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/03/9a6f1f513f29946f29299923348c43931717415522740234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Latest News: ఏపీలో రేపే (జూన్ 4) ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ టీడీపీ అగ్ర నేతలు అమరావతికి చేరుకున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోగా.. అక్కడికి అప్పటికే భారీగా చేరుకున్న నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా సీఎం.. సీఎం.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ కేంద్ర కార్యాలయం సందడిగా మారింది. దీంతో చంద్రబాబు స్పందిస్తూ.. సంబరాలు రేపు చేసుకొందామని అన్నారు. శక్తిని అప్పుడే ఖర్చు చేయొద్దని శ్రేణులతో చంద్రబాబు చమత్కారం చేశారు.
మరోవైపు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వారికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేశ్, భువనేశ్వరి కుటుంబసభ్యులు ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూటమి పార్టీలకు అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణుల్లో ఎనలేని జోష్ కనిపిస్తోంది. పోలింగ్ ముగిశాక హైదరాబాద్ మీదుగా విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు దాదాపు మూడు వారాలు తరువాత అమరావతికి తిరిగి వచ్చారు. నేడు లోకేశ్, భువనేశ్వరి కూడా విజయవాడకు చేరుకున్నారు. అటు తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ విద్యుత్ కాంతులతో ధగధగలాడింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలుగుదేశానికి అనుకూలంగా రావటంతో యువత కేరింతలు కొట్టారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)