అన్వేషించండి

Nara Lokesh: విజయవాడకు తిరిగొచ్చిన లోకేష్‌కు కార్యకర్తల ఘనస్వాగతం, ఇవాళ చంద్రబాబుతో ములాఖత్

Nara Lokesh: ఢిల్లీ నుంచి నారా లోకేష్ విజయవాడకు చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును లోకేష్ కలవనున్నారు.

Nara Lokesh: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజులుగా హస్తినలో ఉన్న ఆయన.. గురువారం రాత్రి విజయవాడకు తిరిగొచ్చారు. ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు లోకేష్ చేరుకున్నారు. లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలతో కరచాలనం, అభివాదం చేసిన లోకేష్.. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. 

ఈ ఉదయం రాజమండ్రికి నారా లోకేష్ చేరుకోనున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై విచారణ, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల గురించి బాబుతో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే పార్టీ పరంగా చేపట్టాల్సి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి బాబుతో లోకేష్ మాట్లాడే అవకాశముంది. హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు, కస్టడీపై శుక్రవారానికి విచారణ వాయిదా పడింది. ఈ అంశాన్ని కూడా చంద్రబాబుకు వివరించనున్నారు. కేసుల్లో న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయాలతో పాటు టీడీపీ-జనసేన పొత్తు పరిణామాల గురించి చంద్రబాబుతో చర్చించనున్నారు.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత రెండుసార్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లోకేష్ ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసేందుకు, అక్కడ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపేందుకు  గత నెల 14న లోకేష్ ఢిల్లీకి బయల్దేరారు. ఆ తర్వాత ఇవాళ విజయవాడకు చేరుకోగా.. రేపు మరోసారి జైల్లో బాబును కలవనున్నారు. లోకేష్‌తో పాటు కుటుంబసభ్యులు కూడా చంద్రబాబును కలవనున్నారు. బాబుతో భేటీ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడే అవకాశముంది. రేపు రాజమండ్రికి లోకేష్ వస్తుండటంతో భారీగా శ్రేణులు కూడా చేరుకుంటున్నారు. 

అయితే ఇవాళ లోకేష్‌కు స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే సమయంలో టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారి వద్దే పార్టీ కార్యకర్తలను అడ్డగించారు. దీంతో కార్యకర్తలు వెహికల్స్‌ను రోడ్డుపైనే పార్కింగ్ చేసి ఎయిర్‌పోర్ట్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. లోకేష్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద  ఎత్తున కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఢిల్లీలో 20 రోజుల పాటు ఉన్న లోకేష్.. చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేశారు. పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టడంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు ఢిల్లీ వేదికగానే చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర నేతలతో చర్చించారు. టీడీపీ సమావేశాలకు వర్చువల్ విధానంలోనే లోకేష్ పాల్గొన్నారు. దీంతో పాటు చంద్రబాబు కేసు పరిణామాల గురించి సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. 

కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేష్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ విచారణకు హాజరయ్యేందుకు లోకేష్‌కు సీఐడీ ఇచ్చిన గడువును హైకోర్టు పెంచింది.

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget