TDP Mahanadu 2022 : టీడీపీ మహానాడుకు భారీ స్పందన, అటు చంద్రబాబు ఇటు బాలయ్య ప్రసంగాలతో దద్దరిల్లిన స్టేజ్
TDP Mahanadu 2022 : టీడీపీ మహానాడుకు భారీ స్పందన వచ్చింది. ఒకే స్టేజ్ పై బావ బావమర్థులు చంద్రబాబు, బాలయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలయ్య ప్రసంగం ఆద్యంతం సభాప్రాంగణం దద్దరిల్లిపోయింది.
TDP Mahanadu 2022 : తెలుగుదేశం మహానాడు చివరి రోజు బహిరంగ సభకు భారీగా స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావటంతో చంద్రబాబుకు పట్టరాని సంతోషం వచ్చింది. స్టేజ్ పైకి ఆయన వచ్చిన తరువాత అభిమానులు దూసుకోని ముందుకు రావటంతో ఒకానొక దశలో మైక్ లు పని చేయని పరిస్థితి ఏర్పడింది. దీంతో చంద్రబాబే స్వయంగా ముందుకు వచ్చి అభిమానులకు సర్ది చెప్పాల్సిన వచ్చింది. అయితే మరో వైపు స్టేజ్ పై అటు బాలయ్య, ఇటు చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అభిమానులు తరలి రావటం, మహానాడు సక్సెస్ కావడంతో సంతోషంతో ఉన్న బావ బామ్మర్దులు, అభిమానుల తాకిడిని కంట్రోల్ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఇక బాలయ్య ప్రసంగం ఆద్యంతం అభిమానులు అరుపులు, కేకలతో సభా వేదికను దద్దరిల్లింది. అన్న ఎన్టీఆర్ పేరుతో ప్రసంగాన్ని ప్రారంభించిన బాలయ్య, జగన్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బాలయ్య స్టేజికి ఇరువైపులా తిరుగుతూ అభిమానులను అలరిస్తూ ప్రసంగించారు.
బాలయ్య రూట్లో బావ
స్టేజిపై అటు ఇటు తిరుగుతూ మాట్లాడటం బాలయ్యకు అలవాటు. ఒక చోట నిల్చొని మాట్లాడితే తనకు కిక్ ఉండదదని బాలయ్య అనేక సార్లు చెప్పారు. ఇక్కడ జరిగిన మహానాడు వేదికపై బాలయ్య స్టైల్ లోనే చంద్రబాబు కూడా స్టేజికి ఇరువైపులా తిరుగుతూ ప్రసంగించారు. ప్రభుత్వం తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. గూగుల్ మ్యాప్ లు తీసి మరి, జగన్ అవినీతిని కక్కిస్తాననని చంద్రబాబు హెచ్చరించారు. అంతే కాదు కింగ్ ఫిషర్ బీర్ విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించటంతో అభిమానులు కేరింతలు కొట్టారు. భూమ్ భూమ్ బీర్లు తెచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించటంతో అభిమానులు ఉత్సాహంతో నినాదాలు చేశారు..
ప్రసంగాన్ని ఆపేసిన లోకేశ్
అటు తండ్రి. ఇటు మామయ్య. ఒకే వేదికపై ఉండటంతో లోకేశ్ మహానాడు వేదికగా చేసే ప్రసంగంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే మహానాడు ప్రారంభం అయినప్పటి నుంచి బిజీగా ఉన్న లోకేశ్ కు చివరి రోజు ప్రసంగంలో గొంతు సహకరించలేదు. మాట్లాడేందుకు లోకేశ్ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. లోకేశ్ మాట్లాడుతుండగానే హఠాత్తుగా ఆయన స్వరం మారింది. దీంతో వెంటనే కలగ చేసుకున్న పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ లోకేశ్ తరపున రెండు విషయాలు ప్రస్తావించి ముగించారు.
Also Read : Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !