IND in IRE, 2 T20Is, 2022 | 2nd T20I | Malahide Cricket Club Ground, Dublin - 28 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND

AP Brands : రూ. 20కు కొని రూ. 200కు అమ్ముతున్నారు ! ఏపీ మద్యం బ్రాండ్లపై టీడీపీ ఆరోపణలు..!

ఏపీలో మద్యం బ్రాండ్లు అన్నీ కల్తీవేనని టీడీపీ ఆరోపించింది. రూ. 20 కూడా చేయని మద్యాన్ని రూ. 2వందలకు అమ్మి దోచుకుంటున్నారని టీడీపీనేత బొండా ఉమ ఆరోపించారు. ఈ మద్యం తాగి పలువురు చనిపోయారని ఆరోపించారు.

FOLLOW US: 

రూ.20 విలువైన మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రూ. 200 అమ్మి దోచుకుంటున్నారని  ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. దమ్ముంటే ఆ మద్యం తయారు చేసే కంపెనీలు, కొనుగోలు చేస్తున్న ఎక్సైజ్ శాఖ ఇన్వాయిస్‌లను బయట పెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు సవాల్ చేశారు. మద్యం బాటిళ్లను మీడియా ముందు ప్రదర్శించి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం లో మద్యం ఏరులై పారుతోందని జగన్ విమర్శించారని గుర్తు చేశారు. దశల వారీగా మద్యం రద్దు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా ఇప్పటికీ మద్యం ఏరులై పారుతోందన్నారు. ఆదాయాన్ని ప్రధాన ఆదాయన వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు.

Also Read : బైక్‌పై కలెక్టర్ నగర సంచారం

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమ్మగలిగే డమ్మీ బ్రాండ్‌లతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఏపీలో అన్ని చోట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే తయారీ , రవాణా జరుగుతోందన్నారు. నిబంధనలు పాటించకుండా... నాసి రకం మద్యం తయారు చేయించి అమ్ముతున్నారని.. దీని వల్ల పెద్ద ఎత్తున యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. మద్యం తాగే వారి పదేళ్లు ముందే చనిపోతున్నారని ఆరోపిచారు. ఈ రెండేళ్లలో ఎంతో మంది చనిపోయారని వారందరూ కరోనా వల్ల చనిపోయారని నమోదు చేసి ప్రభుత్వం తప్పించుకుందని విమర్శించారు. కాయ కష్టం చేసే కూలీలు జె బ్రాండ్ పిచ్చి మందు తాగి తెల్లారేసరికి ఆస్పత్రి పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

Also Read : సీబీఐ కేసులు పెట్టడమేనా..? నిరూపించేది ఏమైనా ఉందా ?

మద్యం అమ్మాకాలతో పాటు జే ట్యాక్స్ వసూలు చేస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు.  ఏపీలో అమ్ముతున్నవన్నీ పిచ్చి బ్రాండ్లేనని.. వీటి అమ్మకాలతో ప్రభుత్వానికి ఎంత, వైఎస్ఆర్ సీపీ నేతల జేబుల్లోకి ఎంత వెళ్తుందో తమ వద్ద లెక్కలున్నాయని ప్రకటించారు. మద్యం దుకాణాలు తగ్గిస్తామని ప్రకటించి ఇప్పుడు కొత్తగా వాక్ ఇన్ స్టోర్ల పేరుతో 700 దుకాణాలను ప్రారంభించడాన్ని బొండా ఉమ ఖండించారు. హోటల్స్, రెస్టారెంట్‌లను మించి మద్యం వాక్ ఇన్ స్టోర్లు కనిపిస్తున్నాయని.. దశల వారీ మద్య నిషేధం అంటే ఈ పిచ్చి మందులు అమ్మడమా అని ప్రశ్నించారు. 

Also Read : హిందువుల పండుగలకే కరోనా వస్తుందా..?

మద్యనిషేధం చేస్తామని హామీ ఇస్తే మహిళలు నమ్మి ఓట్లేశారని ఇప్పుడు మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని..  మద్యపాన నిషేధంపై ప్రభుత్వ విధానం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.వచ్చే పదిహేనేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ. పాతిక వేల కోట్ల అప్పులు తెచ్చారని.. జగన్ కు వచ్చిన ఐడియా దేశంలో ఇంకెవరికీ వచ్చి ఉండదన్నారు. ఇప్పుడు మద్యం దుకాణాలను పెంచి మరో మరో 25వేల కోట్లు తేవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మద్యం తాగే ప్రతి వ్యక్తి తలకాయ తాకట్టు పెట్టి అప్పులు తేవడం ఇప్పుడే చూస్తున్నామని మండిపడ్డారు. ప్రభుత్వం మాటలు నమ్మి  బ్యాంకులు రుణాలు ఇస్తే బ్యాంకర్లు మునిగిపోతారని హెచ్చరించారు. ఒక్క మద్యం అమ్మకాల ద్వారానే వైసీపీ నేతల జేబుల్లోకి రూ. ఆరు వేల కోట్లు వెళ్తున్నాయన్నారు.  

Published at : 06 Sep 2021 04:00 PM (IST) Tags: YS Jagan tdp BONDA UMA AP BRAND LiQAR J TAX

సంబంధిత కథనాలు

Tirumala News : తిరుమల కొండపై మరోసారి ఏనుగుల గుంపు హల్ చల్

Tirumala News : తిరుమల కొండపై మరోసారి ఏనుగుల గుంపు హల్ చల్

K Raghavendra Rao : ఎన్టీఆర్ ప్రపంచానికే రత్న, నాకు సినీ జన్మనిచ్చింది ఆయనే - రాఘవేంద్రరావు

K Raghavendra Rao : ఎన్టీఆర్ ప్రపంచానికే రత్న,  నాకు సినీ జన్మనిచ్చింది ఆయనే - రాఘవేంద్రరావు

Jagananna Amma Vodi : తల్లుల ఖాతాల్లో డబ్బులు, రేపు అమ్మఒడి నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్

Jagananna Amma Vodi : తల్లుల ఖాతాల్లో డబ్బులు, రేపు అమ్మఒడి నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్

AP Politics : ఆత్మకూరులో వైసీపీ విజయం దేనికి సంకేతం? ప్రతిపక్షాల్ని ఆలోచనలో పడేసిన ఫలితాలు

AP Politics : ఆత్మకూరులో వైసీపీ విజయం దేనికి సంకేతం? ప్రతిపక్షాల్ని ఆలోచనలో పడేసిన ఫలితాలు

Breaking News Live Telugu Updates: రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన 

Breaking News Live Telugu Updates: రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన 

టాప్ స్టోరీస్

Chiranjeevi: 'పక్కా కమర్షియల్' స్టేజ్ పై మారుతితో మెగాస్టార్ బేరం!

Chiranjeevi: 'పక్కా కమర్షియల్' స్టేజ్ పై మారుతితో మెగాస్టార్ బేరం!

Presidential Election 2022 : రేపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్, హాజరుకానున్న మంత్రి కేటీఆర్

Presidential Election 2022 : రేపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్, హాజరుకానున్న మంత్రి కేటీఆర్

Dell G15 5525: వావ్ అనిపించే గేమింగ్ ల్యాప్‌టాప్ - లాంచ్ చేసిన డెల్ - ధర ఎంతంటే?

Dell G15 5525: వావ్ అనిపించే గేమింగ్ ల్యాప్‌టాప్ - లాంచ్ చేసిన డెల్ - ధర ఎంతంటే?

Ram Pothineni: గర్ల్ ఫ్రెండ్ తో రామ్ పెళ్లి - త్వరలోనే ప్రకటన?

Ram Pothineni: గర్ల్ ఫ్రెండ్ తో రామ్ పెళ్లి - త్వరలోనే ప్రకటన?