By: ABP Desam | Updated at : 06 Sep 2021 02:29 PM (IST)
సుప్రీంకోర్టు ఫైల్ ఫోటో
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ ) ఎన్ని కేసులు పెడుతుందో తెలుస్తుంది కానీ ఎన్ని కేసుల్లో నిందితులకు శిక్షలు వేయించగలుగుతుందో మాత్రం ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు. కానీ అత్యధిక కేసుల్లో నేరాలను నిరూపణ చేయలేకపోతోందన్న విషయం సంచలనాత్మక కేసులు వీగిపోయినప్పుడు ప్రచారంలోకి వస్తూ ఉంటుంది. సీబీఐ ఈ తరహా పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు న్యాయవాదుల అరెస్టుకు సంబంధించిన కేసు విచారణ సందర్భంలో సీబీఐ అధికారులు సరైన వివరాలు సమర్పించకపోవడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సీబీఐ చేపట్టిన కేసులు కోర్టుల్లో నిలబడే పరిస్థితి కనిపించడం లేదని ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం మండిపడింది. ఇప్పటివరకు సీబీఐ ఎన్ని కేసులు చేపట్టింది?, ఎన్ని నిరూపించింది?, ఎందరికి శిక్ష పడింది?, ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ... జస్టిస్ సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఓ కేసు విషయంలో పంజరంలో చిలుకకు స్వేచ్ఛ అవసరం అంటూ.. మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను జస్టిస్ కౌల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సిబ్బంది, మౌలిక వసతుల లేమి కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు వారాల్లో నివేదిక అందించాలని ఆదేశించారు.
సీబీఐ నమోదు చేస్తున్న కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. కేసులు నమోదు చేస్తారు.. విచారణ చేస్తారు కానీ తర్వాత అవి ఏమవుతాయో ఎవరికీ తెలియదు. అలాంటి కేసులు వేలల్లో ఉంటాయన్న ప్రచారం ఉంది. కానీ వివరాలేమీ బయటకు రావు. ఇరవై ఏళ్ల కిందటి సీబీఐ కేసులూ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కానీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అవసరమైనప్పుడు మాత్రం ఆ కేసులు బయటకు వస్తూంటాయన్న విమర్శలు మాత్రం ఉన్నాయి.
భారత్‌ను నంబర్ వన్‌గా మారుద్దాం రండీ- 2024 టార్గెట్‌గా కేజ్రీవాల్ ఉద్యమం
Rohingya Refugee: రోహింగ్యాలకు ప్రత్యేక ఫ్లాట్లు, భద్రత - అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పిన కేంద్రం
YSRCP Vs Janasena : వైఎస్ఆర్సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !
Nipun F-INSAS LCA: ఇండియన్ ఆర్మీకి కొత్త వెపన్స్ వచ్చాయ్, ఆ సైన్యానికి వణుకు తప్పదు!
Semi Bullet Train : హైదరాబాద్ - బెంగళూరు మధ్య సెమీ హైస్పీడ్ రైలు - ఎన్ని గంటల్లో వెళ్లొచ్చంటే ?
Munugode Bypoll : రేవంత్ టార్గెట్‌గా సీనియర్ల దండయాత్ర - మునుగోడు ముందు మునిగిపోతున్న టీ కాంగ్రెస్ !
Tendulkar On Vinod Kambli: దిగజారిన కాంబ్లీ ఆర్థిక పరిస్థితి! పని కోసం సచిన్ ఫ్రెండ్ వేడుకోలు!
BJP : పార్లమెంటరీ బోర్డులోకి లక్ష్మణ్ - గడ్కరీ, చౌహాన్‌లకు నిరాశ ! బీజేపీ కీలక కమిటీల్లో మార్పులు
AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?