(Source: ECI/ABP News/ABP Majha)
TDP Attacks on YSRCP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రాంతాల్లో విధ్వంసం- టీడీపీ శ్రేణులపై వైసీపీ విమర్శలు
Andhra Pradesh News: ఏపీలో ఫలితాలు తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు టీడీపీ శ్రేణులు ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు. వైసీపీ లీడర్లు కూడా కొన్ని ప్రాంతాల్లో తెగబడుతున్నారు.
TDP And YSRCP Cadre Attack Each Other: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. కొన్ని రోజుల్లోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే గెలిచిన ఉత్సాహంలో కొందరు టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. వైసీపీ బలంగా ఉన్న చోట్ల తమకు ఓట్లు వేయలేదని దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
కళ్యాణదుర్గం లో టీడీపీ నేతల గూండాగిరి
— YSR Congress Party (@YSRCParty) June 5, 2024
వైఎస్సార్ సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై టీడీపీ నేతల దాడి
కారు ధ్వంసం, ఇంటిపైకి రాళ్లు రువ్విన టీడీపీ గూండాలు#TDPGoons pic.twitter.com/NcInrc5vWd
టీడీపీ, జనసేన కార్యకర్తలు కత్తులు, కొడవళ్లతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలో దూరి దాడులకు తెగబడుతున్నారని వైసీపీ అధికారిక ట్విట్టర్‌లో వీడియోలు పోస్టు చేసింది. వెనుకబడిన వర్గాలపై టీడీపీ, జనసేన నేతలు దాడులకు దిగుతున్నారన్న విమర్శించింది.
ఏపీలో భీతావహ వాతావరణం!
— YSR Congress Party (@YSRCParty) June 6, 2024
వెనుకబడిన వర్గాలపై సామూహిక దాడులకు దిగుతున్న టీడీపీ, జనసేన
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని ఎస్సీ పెద్దపేట గ్రామస్తులపై @JaiTDP, @JanaSenaParty గుండాల మూకుమ్మడి దాడి
పెత్తందారుల దౌర్జన్యం పతాకస్థాయికి #TDPGoons pic.twitter.com/3BbqEgwpx4
టిడిపి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ పరిధిలోని సూర్యారావుపేటకు చెందిన వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ భౌతికకాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, అన్ని విధాలుగా అండగా ఉంటామని… pic.twitter.com/C1TpBMc1yd
— Kotaru Abbaya Chowdary (@AbbayaChowdary) June 5, 2024
రేషన్ వాహనాలు ధ్వంసం చేస్తున్నారు... ప్రశ్నించిన వారిని చంపేందుకు కూడా వెనకాడటం లేదని వైసీపీ ఆరోపించింది. తమ పార్టీకి భారీ మెజార్జీ వచ్చిందన్న పొగరో... లేక.. పవర్ చేతిలో ఉంటే.. తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమానో కానీ... విచక్షణ మరిచి ఉన్మాదుల్లా మారి పేదలపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తింది. ఒకటి కాదు, రెండు కాదు... ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి
టీడీపీ గూండాల వీరంగం!
— YSR Congress Party (@YSRCParty) June 5, 2024
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి గంటలు కూడా గడవకముందే @JaiTDP గూండాలు రెచ్చిపోతున్నారు. పులివెందులలో వైయస్ఆర్సీపీ కార్యకర్త ఆది శేషుపై దాడులకు తెగబడుతున్నారు. ఏకంగా ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దాడిచేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మహిళలు అన్న కనికరం లేకుండా… pic.twitter.com/XiAwucJ5DL
ఏపీలో బరితెగిస్తున్న టీడీపీ నాయకులు.
— YSR Congress Party (@YSRCParty) June 6, 2024
రాష్ట్రంలో ప్రతీ చోట ఇళ్ళలోకి చొరబడి ఆడవారు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్న @JaiTDP గూండాలు.#TDPGoons pic.twitter.com/PGhWdlwGwy
కడప జిల్లా పులివెందులలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త.. ఆదిశేషు ఇంట్లోకి మారణాయుధాలతో ఆకతాయిలు చొరబడ్డాయి. ఇంట్లో ఉన్న మహిళలను బయటకు పంపి... ఆదిశేషుపై కత్తులతో దాడి చేశారు. భయానక వాతావరణం సృష్టించారంటూ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో... ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కత్తులతో ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలను... బయటకు పంపారు. ఆ తర్వాత.. ఇంట్లో ఉన్న వ్యక్తిపై దాడికి తెగబడ్డారు. ఇది టీడీపీ గూండాల పనే అని బాధితులు అంటున్నారు.
ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేస్తున్న టీడీపీ, జనసేన గుండాలు
— YSR Congress Party (@YSRCParty) June 6, 2024
కోట్ల మంది రేషన్ కార్డుదారులకి గడప వద్దకే నాణ్యమైన బియ్యం ఇవ్వడంపై కడుపుమంటతో వాహనం ధ్వంసం
విచక్షణ మరిచి ఉన్మాదుల్లా మారి పేదలపై దాడులు
పెత్తందారుల బుద్ధి బట్టబయలు#TDPGoons pic.twitter.com/9ppyYbWVc7
తిరుపతి జిల్లా చంద్రగిరిలోనూ ఎన్నికల్లో గెలవగానే... వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులకు దిగుతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని ఓ దాబా దగ్గర వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణ వార్డు మెంబర్ వంశీపై... టీడీపీ నాయకులు మన్సూర్, చంద్రశేఖర్, ప్రసాద్‌కుమార్ రాజు, లోకేష్‌తోపాటు పలువరు దాడి చేశారని సమాచారం. చంద్రగిరి దాసరి వీధి సమీపంలో మండల వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు మస్తాన్‌పై కూడా టీడీపీ నాయకులు... కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది.
గుంటూరులోని లక్ష్మీపురంలో హాస్టల్ నేమ్ బోర్డ్ లో రెడ్డి అనే పేరు ఉన్నందుకు హాస్టల్ మీద కర్రలతో, రాళ్ళతో దాడి చేసి ఆ హాస్టల్
— YSR Congress Party (@YSRCParty) June 6, 2024
యజమానిని కొట్టి బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్ళు పట్టించుకున్న @JanaSenaParty గూండాలు.
ఇదేనా నీ కొత్తతరం రాజకీయం అంటే @PawanKalyan ? pic.twitter.com/cVK38l1ksB
కళ్యాణదుర్గంలోనూ వైఎస్‌ఆర్‌సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారని సమాచారం. ఆయన కారును ధ్వంసం చేసి... ఇంటిపైకి టీడీపీ గూండాలు రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామంలో వృద్ధిరాలిపై దాడి చేశారట. వృద్ధురాలిని కొట్టి... ట్రాక్టర్ కిందకి తోసేశారని వైసీపీ ఓ వీడియో పోస్టు చేసింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పరిధిలోని సూర్యారావుపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్‌కు టీడీపీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్‌కు నివాళులర్పించి... వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు వైసీపీ నేతల అబ్బయ్య చౌదరి. ప్రవీణ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్న టీడీపీ గుండాలు.
— YSR Congress Party (@YSRCParty) June 6, 2024
చంద్రగిరి నియోజకవర్గం నేండ్రగుంట గ్రామంలో వైయస్ఆర్ సీపీ జెండా దిమ్మెను ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందుతున్న @JaiTDP గూండాలు.#TDPGoons pic.twitter.com/11Lh3GcaWq
ప్రభుత్వ ఆస్తులను కూడా టీడీపీ, జనసేన శ్రేణులు ధ్వంసం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బియ్యం పంపిణీ చేసే వాహనాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ ధ్వంసం చేస్తున్నారట. ప్రభుత్వ భవనాలు ముందున్న శిలాఫలకాలు, గ్రామాల్లోని వైఎస్‌ఆర్ విగ్రహాలను కూడా పగలగొడుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ-జనసేన శ్రేణుల దాడులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ప్రభుత్వ ఆస్తులపై కూడా దాడులకు తెగబడుతున్న టీడీపీ నాయకులు.
— YSR Congress Party (@YSRCParty) June 6, 2024
5 సంవత్సరాలుగా రైతులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఊర్లలోనే సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు, సచివాలయలపై దాడులకు దిగి అందులో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేస్తున్న @JaiTDP గూండాలు.#TDPGoons pic.twitter.com/HY4sssxz3M
తిరుపతి జిల్లా చంద్రగిరిలో @JaiTDP నాయకుల రౌడీయిజం
— YSR Congress Party (@YSRCParty) June 5, 2024
వైయస్ఆర్ సీపీ నాయకులపై ఆగని దాడులు
చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీపై దాడి టీడీపీ నాయకులు మన్సూర్, చంద్రశేఖర్, ప్రసాద్ కుమార్, రాజు, లోకేష్, పలువురు నాయకులు… pic.twitter.com/JFDClpM9Pk