Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
ప్రభుత్వ వైఫల్యాన్ని తమపై నెడుతున్నారని టీడీపీ, జనసేన అధినేతలు మండిపడ్డారు. హోంమంత్రి బాధ్యతా రాహిత్యమైన ప్రకటన చేశారని ఆరోపించారు.
అల్లర్ల వెనుక తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయన్న వైఎస్ఆర్‌సీపీ నేతల విమర్శలపై ఆ పార్టీ అగ్రనేతలు స్పందించారు. ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. సున్నితమైన అంశంలో హోంమంత్రి నిరాధారణ ఆరోపణలు చేయడం మంచిది కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. నసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని.. సంయమం పాటించాలని చంద్రాబబు పిలుపునిచ్చారు. ప్రశాంతంగా ఉండే కోనసీమలో నిరసనలు దురదృష్టకమన్నారు.
కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి.ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.ప్రశాంతంగా ఉండే కోనసీమలో నిరసనలు దురదృష్టకరం.సున్నిత అంశంలో హోంమంత్రి నిరాధార ఆరోపణలు తగదు.కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలి - @ncbn .
— iTDP Official (@iTDP_Official) May 24, 2022
మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని పవన్ ప్రకటించారు. వై.సి.పి.ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేన పై రుద్దకండని పవన్ కల్యాణ్ హితవు పలికారు .
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ప్రకటన
— JanaSena Party (@JanaSenaParty) May 24, 2022
•అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలి.
•ప్రజలందరూ సంయమనం పాటించాలి. శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
పేరు మార్పుపై ఇంత రియాక్షనా ? ప్రభుత్వం ఎందుకు అంచనా వేయలేదు?
కొత్త జిల్లా ల పేర్లను గజెట్‌లో చేర్చకుండా ఇప్పుడు మార్చడం వెనుక జగన్ రెడ్డి రాజకీయ కుట్ర ఉందని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఆరోపించారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. జేఏసీల ముసుగులో దాడులకు పాల్పడ్డ వారిపై తక్షణమే అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వివాదాలకు కేంద్ర బిందువుగా కొనసీమని మార్చడం దురదృష్టకరమన్నారు.