What Happend In Konaseema : పేరు మార్పుపై ఇంత రియాక్షనా ? ప్రభుత్వం ఎందుకు అంచనా వేయలేదు?
కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఇంత రియాక్షనా ? ప్రభుత్వం ఎందుకు అంచనా వేయలేకపోయింది ?
What Happend In Konaseema : కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం ఇప్పుడు ఆ జిల్లాలో శాంతి భద్రతల సమస్యను తీసుకొచ్చింది. జిల్లాకు పేరు పెట్టాలని గతంలో ఉద్యమం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా పేరు మారుస్తూ జీవో జారీ చేసింది. ఇలా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వందల మంది ఆందోళనకు దిగారు. కోన సీమ జిల్లానే ( Konaseema District ) కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు ప్రభుత్వం ప్రజల ఆలోచనలేమిటో అర్థం చేసుకోకుండా పూర్తి స్థాయిలో రాజకీయ అవసరాల కోసం ఇలా చేయడం వల్లనే శాంతిభద్రతల ( Law and Order Problem ) సమస్య వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎవరి కుట్రో తెలియడం లేదు - సజ్జల, హోంమంత్రి రియాక్షన్ !
కోనసీమ జిల్లా పేరు మార్పు అంశంపై జీవో జారీ చేసినప్పటి నుండి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మొదటి సారే.. ప్రజలందరితో చర్చించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అన్నీ ఏకపక్షంగా.. రాజకీయ లెక్కలు ( Political Reasons ) వేసుకుని నిర్ణయాలు తీసుకోవడం వల్లే సమస్య వచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం మరింత పెంచుతూ.. పాలకులే వ్యూహాలు అమలు చేస్తూండటంతో ప్రజలు నలిగిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస సౌకర్యాలు ఏర్పాట్లు చేయకుండా .. జిల్లాలు పేపర్ల మీద విభజించేయడం.. పైసా ఖర్చు లేని పనే కదా పేర్లు ఇష్టం వచ్చినట్లు పెట్టడం , మార్చడం లాంటి పనులు చేస్తూ.. కనీస ఆలోచన లేకుండా…బాధ్యత లేకుండా వ్యవహరిస్తూండటంతో సమస్యలు పెరిగిపోతున్నాయని మండి పడుతున్నారు.
అగ్ని గుండంలా అమలాపురం- కొనసాగుతున్న విధ్వంసకాండ
నిజానికి కోనసీమ జిల్లా పేరు మార్చాలాని ఉద్యమాలు జరిగాయి. అందుకే ప్రభుత్వం ( Ap Governament ) కూడా ఇంత పెద్ద రియాక్షన్ వస్తుందని అనుకోలేదు.పేరు మార్పు జీవో జారీ చేసినప్పటి నుండి ఆందోళనలు సాగుతున్నాయి కానీ.. ఉద్రిక్తతలకు కారణం అవుతాయని అనుకోలేదు. ఈ కారణంగానే పోలీసు బలగాలను కూడా పెద్ద ఎత్తున మోహరించ లేదు. మంగళవారం అనూహ్యంగా తరలి వచ్చిన ఆందోళనకారులు ఒక్క సారిగా చుట్టుముట్టడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. దీంతో అప్పటికప్పుడు పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బలగాలను పిలిపించాల్సి వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.