Weather Updates: ఏపీలో వణికిస్తున్న చలి గాలులు, తెలంగాణలో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రత
Weather Updates: రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాంధ్రలో చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది.
AP Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో చలి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాంధ్రలో చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. జంగమేశ్వరపురం, నందిగామ, కళింగపట్నం పరిసర ప్రాంతాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ఎత్తులో తూర్పు దిశ నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
నేడు కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చలి తగ్గుముఖం పట్టనుంది. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జంగమేశ్వరపురంలో 15.2 డిగ్రీలు, కళింగపట్నంలో 15.8 డిగ్రీలు, నందిగామలో 16.3 డిగ్రీలు, బాపట్లలో 18.7, అమరావతిలో 18.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
View this post on Instagram
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం సాధారణంగా ఉంటుంది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.3 డిగ్రీలు, కర్నూలులో 18.9 డిగ్రీలు, కడపలో 21.6 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం సాధారణంగా ఉండనుంది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉదయం వేళ కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం ఇలాగే పొడిగా ఉండనుంది.
Also Read: సైలెంట్‌గా ఉండేవారు అంత డేంజరా? ఈ కారణాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు!