By: ABP Desam | Updated at : 29 Jan 2023 08:04 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో తెలంగాణ ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డులో రక్షణ గోడను ఢీకొట్టిన బస్సు శ్రీశైలం లోయలో పడబోయి, అంచున నిలిచింది. శ్రీశైలం డ్యాం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీశైలం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులతో మహబూబ్ నగర్ వెళ్తోన్న ఆర్టీసీ బస్సు డ్యాం సమీపంలోని టర్నింగ్ వద్ద అదుపు తప్పి గోడను బలంగా ఢీకొట్టింది. గోడకు ముందు ఇనుప రాడ్లను తగులుకొని బస్సు నిలిచిపోయింది. లేదంటే భారీగా ప్రాణనష్టం సంభవించేదని ప్రత్యక్షసాక్షులు అంటున్నారు.
ప్రాణాలు కాపాడిన ఇనుప బారికేడ్లు
శ్రీశైలం డ్యాం వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్ వెళ్తోన్న ఆర్టీసీ బస్సు డ్యాం వద్దకు రాగానే టర్నింగ్ వద్ద అదుపుతప్పింది. డ్రైవర్ బస్సు వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ఘాట్ రోడ్డులోని రక్షణ గోడను వేగంగా ఢీకొట్టింది. రక్షణ గోడ ధ్వంసమైనప్పటికీ, గోడకు ఇనుప రాడ్లు ఉండటంతో బస్సు లోయలో పడకుండా నిలిచింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకున్న ఆర్టీసీ సిబ్బంది బస్సులో ఉన్న ప్రయాణికులు కిందకు దించేశారు. శ్రీశైలం డ్యాంకు ఇరువైపులా ఉన్న ఘాట్ రోడ్డు టర్నింగ్ ల వద్ద రక్షణ గోడలు బలహీనంగా ఉన్నాయి. ఇనుప బారికేడ్ ఉండటంతో పెనుప్రమాదం తప్పందని ప్రయాణికులు అంటున్నారు.
పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం
దక్షిణ అమెరికా పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెరూ రాజధాని లిమాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 24 మంది మృతిచెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. డెవిల్స్ కర్వ్ గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 24 మంది మరణించారని పెరూ పోలీసులు తెలిపారు. కరీబియన్ దేశంలోని హైతీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థిలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కొరియాంకా టూర్స్ కంపెనీ బస్సు లిమా నుంచి బయలుదేరి ఈక్వెడార్ సరిహద్దులోని టుంబేస్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు ఆర్గానోస్ సమీపంలోని కొండపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు, ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.
పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం
పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. బలూచిస్థాన్‌లోని లాస్బెలాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 41 మంది మరణించారు. ఈ ప్రమాదాన్ని పాకిస్థాన్‌లోని అధికారులను ధృవీకరించారు. డాన్ లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్ హమ్జా అంజుమ్ సంఘటన వివరాలు తెలియజేశారు. దాదాపు 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు క్వెట్టా నుంచి కరాచీకి ప్రయాణిస్తోందని ఆయన చెప్పారు. అధిక వేగం కారణంగా లాస్బెలా సమీపంలో యు-టర్న్ తీసుకుంటుండగా బస్సు వంతెన పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు లోయలో పడిపోయి మంటలు చెలరేగాయని స్థానిక అధికారులు అంటున్నారు.
Tiger in Mahabubnagar: ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన తల్లిపులి - నల్లమలలో తిరుగుతున్నట్టు గుర్తింపు!
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆ రెండు సీట్లు కూడా రావు- మంత్రి రోజా విమర్శలు
300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడ్రోజులు వానలు - వాతావరణ కేంద్రం ఇంకా ఏం చెప్పిందంటే?
విధేయత+సమర్థత= పంచుమర్తి అనూరాధ, స్ఫూర్తిదాయక ప్రస్థానం
Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు
దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
పేపర్ లీకేజీపై గవర్నర్ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ
OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే