అన్వేషించండి

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గలేదన్న కేంద్రం - సైలెంట్ కిల్లింగ్ అని షర్మిల ఆగ్రహం

YS Sharmila: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గలేదని కేంద్రం ఇచ్చిన సమాధానం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సైలెంట్ కిల్లింగ్ కు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు.

Vizag steel plant privatization : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ఇచ్చిన ఓ సమాధానం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందా అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. అమ్మే నిర్ణయంలో మార్పు లేదంటూ లిఖిత పూర్వకగా చెప్పడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని చెబుతూనే .. తమ నిర్ణయం మార్చుకోలేదని చెప్పడం ఏమిటని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. 

విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వానిది రెండు నాలుకల ధోరణి అని షర్మిల విమర్శించారు.  పైకి ఆంధ్రుల హక్కుకు గౌరవం ఉందంటూనే లోపల ప్లాంట్ అమ్మే కుట్రకు మోడీ తెరలేపారని ఆరోపించారు.   రూ.11 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామంటూనే.. లోలోపల ప్లాంట్ ప్రాణం తీస్తున్నారు. విశాఖ స్టీల్ పై మోడీ   ఫార్ములా "సైలెంట్ కిల్లింగ్" అని అనుమానం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానిది పచ్చి మోసమని..  ప్లాంట్ ను ఉద్ధరించామని చెప్పినవన్నీ ఉత్త మాటలేనన్నారు. అంతా మోసపూరితం. అసత్యపు వాగ్దానాలు. విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. *మోదాని* కంపెనీకి అప్పనంగా కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కును చంపడంలో కర్త మోడీ గారు అయితే  కర్మ, క్రియ చంద్రబాబు, పవన్ అన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు  , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నామని డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజిమెంట్‌   నుంచి వచ్చిన సమాధానం పై ఏం చెప్తారని నిలదీశారు. నాలుగేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం నేటికి అమలు అనే సమాధానంపై మీ వైఖరి ఏంటి ? ప్లాంట్ ను ఉద్ధరించేందుకు మోడీ గారు ఇచ్చే అచంచలమైన మద్దతు అంటే ఇదేనా? ప్రైవేటీకరణ ఆపకపోవడమేనా వికసిత భారత్ - వికసిత ఆంధ్ర ? మీ నిబద్ధత, ఎన్నికల వాగ్ధానం, పోరాట స్ఫూర్తికి నిదర్శనం అంటే ఇదేనా ? కూటమి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ఇప్పటికైనా మోడీ గారు కుటిల ప్రయత్నాలు మానుకోవాలన్నారు. వెంటనే స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేయాలి. తక్షణమే అధికారిక ప్రకటన చేయాలి. ఉద్యోగులను,కాంట్రాక్టు కార్మికులను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్  ప్లాంట్ తీవ్ర నష్టాల్లో ఉండటంతో ప్రైవేటీకరణ చేయాలని గతంలో కేంద్రం భావించింది. కానీ కూటమి  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేశారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ తో .. కేంద్రం నుంచి ఇలాంటి సమాధానం రావడంతో మరో సారి రాజకీయ  ప్రకంపనలకు కారణం అవుతోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget