అన్వేషించండి

Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం

Southwest Monsoon Enters Andhra Pradesh | నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. జూన్ 6న (శనివారం) రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నైరుతి రుతుపవనాలు జూన్ 6న ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి.
  • ఈనెల 10 నాటికి సగానికి పైగా రాష్ట్రానికి విస్తరిస్తాయని అంచనా.
  • రుతుపవనాలు వచ్చినా వేడి, వడగాల్పులు తగ్గవని వాతావరణశాఖ హెచ్చరించింది.
  • శ్రీకాకుళానికి రెడ్ అలర్ట్; కొన్నిచోట్ల ఈదురుగాలులు, వర్షాలు.

Rains In Andhra Pradesh | అమరావతి: తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణశాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. శనివారం (జూన్6న) నాడు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల ద్వారా నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. ఈ నెల 10వ తేదీ నాటికి రాష్ట్రంలోని సగానికి పైగా భూభాగానికి నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తొలకరి జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికే కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు, ఈసారి 3 రోజులు ఆలస్యంగా అక్కడ ప్రవేశించాయి. జూన్ నుండి సెప్టెంబరు వరకు సాగే ఈ రుతుపవనాల సీజన్‌లో దేశంలో 80 శాతానికి పైగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అయితే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, ఉక్కపోత, వేడి వాతావరణం వెంటనే తగ్గవని అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రాలో వేడిగాలుల ప్రభావం మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అక్కడి ప్రజలను హెచ్చరించింది.

Also Read: AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?

ఏపీలో విభిన్న వాతావరణం, వడగాల్పులు, వర్షాల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో 2 రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు వీస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, వాటి పరిసర ప్రాంతాలలో గంటకు 60 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. వీటితో పాటు మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించగానే చెట్ల కింద ఉండకుండా, వెంటనే సురక్షితమైన పక్కా భవనాల్లోకి వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

మరోవైపు రాష్ట్రంలోని పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడవచ్చు. అయితే, వర్ష సూచన ఉన్నప్పటికీ ఎండల తీవ్రత తగ్గలేదు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 50 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచాయని, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు.

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ఎప్పుడు, ఏ జిల్లాల ద్వారా ప్రవేశించాయి?

నైరుతి రుతుపవనాలు జూన్ 6న (శనివారం) అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల మీదుగా ఏపీలోకి ప్రవేశించాయి. జూన్ 10 నాటికి రాష్ట్రంలోని సగానికి పైగా ప్రాంతానికి విస్తరిస్తాయి.

నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ రాష్ట్రంలో వేడి వాతావరణం తగ్గుతుందా?

రుతుపవనాలు వచ్చినా ఉక్కపోత, వేడి వాతావరణం వెంటనే తగ్గదని అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రాలో వేడిగాలుల ప్రభావం మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.

శ్రీకాకుళం జిల్లాకు వాతావరణ శాఖ జారీ చేసిన ప్రత్యేక హెచ్చరికలు ఏమిటి?

శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు, హిరమండలం, పాతపట్నం పరిసర ప్రాంతాలలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget