News
News
X

Somu On Pawan : జనసేనతో కలిసే ఎన్నికలకు - టీడీపీతో వెళ్తామని పవన్ చెప్పలేదన్న సోము వీర్రాజు !

జనసేనతోనే పొత్తు కొనసాగుతుందని సోము వీర్రాజు ప్రకటించారు.

FOLLOW US: 
Share:

Somu On Pawan :  జనసేన పార్టీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఆవిర్భావ  సభలో పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి వెళ్తామని ప్రకటించలేదన్నారు. స్పీచ్‌లో ఎక్కడా పవన్ టీడీపీ ప్రస్తావన తీసుకు రాలేదని.. బీజేపీతోనే పొత్తులో ఉన్నామని చెప్పుకొచ్చారు. ముస్లింల విషయంలో పవన్ కల్యాణ్  ఎవరో ప్రస్తాన విషయం  చెప్పారు కానీ.. బీజేపీని నిందించలేదన్నారు.   తాను బీజేపీతో ఉంటే జనసేనకు ముస్లింలు దూరమవుతారని కొందరు అంటున్నారని... ముస్లింలకు ఇష్టంలేకపోతే బీజేపీకి తాను దూరమవుతానని చెప్పారు. ఒకవేళ బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు వారిపై ఎక్కడైనా దాడి జరిగితే పొత్తు నుంచి బయటకు వస్తానని తెలిపారు. అయితే సోము వీర్రాజు మాత్రం పవన్ తో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. 

మచిలీపట్నం సభలో పవన్ కల్యాణ్ ఏపీ బీజేపీ నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.   అసలు ఎదగలేకపోవడానికి ఆ పార్టీనే కారణం అని నిందించారు. .అమరావతి  మెదలుగొని, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసే విషయం వరకు కాషాయ దళం తీరు పై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టిలో తనను ముందుగా పిలిచింది   నరేంద్ర మోడీ అని ఆయన అంటే తనకు గౌరవం ఉందని పవన్ అన్నారు.ఆ తరువాత భారతీయ జనతా పార్టి లోని ఇతర నేతలతో కలసి సమావేశంలో చర్చించుకున్న అంశాలు, రాష్ట్రాని వచ్చే సరికి ఎందుకో అమలు కాలేదని పవన్ వ్యాఖ్యానించారు. అందుకు కారణాలు కూడా బీజేపీ  నేతలే చెప్పాల్సి ఉందన్నారు.                                                                          

అంతే కాదు  పొత్తులో ఉన్నామని చెబుతూ..  ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం పై పవన్ కౌంటర్లు వేశారు.  జాతీయ నాయకత్వంతో చర్చలు తరువాత వాటి కొనసాగింపు చర్యలు ఆంధ్రప్రదేశ్ లో ఉండాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఇక్కడ ఉన్న నాయకుల వైఖరి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ వ్యవహరంలో తనకు పూర్తి అవగాహన ఉందని అయితే ఏపీ బీజేపీ నేతలు  మాత్రం ఎందుకనో మౌనంగా ఉంటున్నారని పవన్ వ్యాఖ్యానించారు.దీంతో ఇరు పార్టీల మధ్య  ఉన్న గ్యాప్ అంశం పై ఇప్పటి వరకు ఉన్న రుమార్స్ కాస్త వాస్తవమే అనే అభిప్రాయం    స్పష్టం అయ్యిందని అంటున్నారు.       

కేంద్రంలోని నాయకత్వంతో సంప్రదింపులు చేసిన తరువాత ఆంద్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు కలసి పని చేసేందుకు ముందు కు రాకపోవటం వలనే రాష్ట్రంలో తెలుగు దేశం బలపడగలిగిందని పవన్ కళ్యాణ్ మరింత ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ సీరియస్ కామెంట్స్ చేసినా సోము వీర్రాజు మాత్రం బీజేపీని  ఏమీ అనలేదని.. పొత్తు కొనసాగుతుందని ప్రకటనలు చేశారు. 

Published at : 15 Mar 2023 03:45 PM (IST) Tags: AP Politics Somu Veerraju Jana Sena Jana Sena BJP Alliance

సంబంధిత కథనాలు

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన

Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన

రైల్వే అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం - చర్చించిన అంశాలివే

రైల్వే అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం - చర్చించిన అంశాలివే

Tirupati News: శ్రీసిటీని సందర్శించిన సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్

Tirupati News: శ్రీసిటీని సందర్శించిన సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!