అన్వేషించండి

Andhra Pradesh Liquor Scam Update: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం - జగన్ సోదరుడి పీఏను ప్రశ్నిస్తున్న సిట్

AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి పీఏను సిట్ ప్రశ్నిస్తోంది. లిక్కర్ స్కాం సొమ్ముని జగన్ కోసం అనిల్ రెడ్డి కలెక్ట్ చేశాడని సిట్ అనుమానిస్తోంది.

SIT questions Jagan brother Anil Reddy PA in AP liquor scam: ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ప్రమేయంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. . అనిల్ రెడ్డి పీఏ దేవరాజును గత మూడు రోజులుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతి నెలా రూ.  50-60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసినట్లు సిట్  ఇప్పటికే గుర్తించింది. ఈ సొమ్ము అనిల్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప (A-33), ఎంపీ మిథున్ రెడ్డి (A-4), విజయసాయి రెడ్డి (A-5), పి. కృష్ణమోహన్ రెడ్డి (A-32), కె. ధనుంజయ రెడ్డి (A-31) ద్వారా జగన్‌కు చేరినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.        

లిక్కర్ పాలసీ మార్చి కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు            
 
YSRCP ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, కొత్త లిక్కర్ పాలసీని అమలు చేసింది. ఈ పాలసీ కింద ప్రముఖ  బ్రాండ్లను తొలగించి, తక్కువ గుర్తింపు ఉన్న స్థానిక బ్రాండ్లకు ఆర్డర్లు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ బ్రాండ్ల నుంచి నెలవారీ ముడుపులు వసూలు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి) ఈ లంచాల సేకరణలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఈ ముడుపులు హవాలా నెట్‌వర్క్ ద్వారా హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో లాండరింగ్ చేసినట్లు సిట్ ఆరోపిస్తోంది.               

జగన్ ఆర్థిక వ్యవహారాలను చూసుకునే వైెఎస్ అనిల్ రెడ్డి           

అనిల్ రెడ్డి, జగన్‌కు వరుసకు సోదరుడు . జగన్ ఆర్థిక వ్యవహరాలు చూస్తారనే పేరు ఉంది.  చెన్నైలో ఉంటారు.  అనిల్ రెడ్డిపై ఇసుక కుంభకోణంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. తన  పీఏ దేవరాజు  ద్వారా లిక్కర్ స్కామ్ సొమ్మును సేకరించినట్లుగా భావిస్తున్నారు.  చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన దేవరాజు, కేసులోని నిందితులతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు సిట్ తేల్చింది. మూడు రోజులుగా దేవరాజును విచారిస్తున్న సిట్, అతనికి సాంకేతిక ఆధారాలను చూపించి ప్రశ్నిస్తున్నారు.          

మరికొన్ని అరెస్టులు చేసే చాన్స్                         

సిట్ దర్యాప్తులో ముడుపుల సొమ్ము ఎలా, ఎవరి ద్వారా తరలించారు.  చివరకు ఎక్కడికి చేరింది అనే కోణాలను పరిశీలిస్తోంది. రాజ్ కసిరెడ్డి నుంచి అనిల్ రెడ్డికి, అక్కడి నుంచి ఇతర నిందితుల ద్వారా జగన్‌కు సొమ్ము చేరినట్లు సిట్ ఆరోపిస్తోంది.  సిట్ మరిన్ని అరెస్టులు, సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లను దాఖలు చేసే అవకాశం ఉంది.          

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget