అన్వేషించండి

YS Sharmila: జగన్ విశ్వసనీయత కోల్పోయాడు- అందుకే విజయసాయిరెడ్డి కూడా వెళ్లిపోయాడు -షర్మిల కీలక వ్యాఖ్యలు

YSRCP: విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారన్నారు. విజయసాయిరెడ్డి ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు.

Sharmila made key comments on Vijayasai Reddy  resignation:  జగన్ కోసం విజయసాయిరెడ్డి చేయని పనులే లేవని అలాంటి వ్యక్తి కూడా జగన్ ను వదిలేసి వెళ్లిపోయారంటే వైసీపీలో ఏం జరుగుతుందో ఆలోచించాలని ఆ పార్టీ కార్యకర్తలకు షర్మిల పిలుపునిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయారని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి అంశంపై విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 

జగన్‌ మోహన్‌రెడ్డికు ఏం చెప్పకుండా విజయసాయి రెడ్డి రాజీనామా చేయరనన్నారు. జగన్ చెప్పాడని  తన కుటుంబం, తన పిల్లల మీద ఇష్టం వచ్చినట్లుగా విజయసాయిరెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు.   వైసీపీని ఆయన వీడారంటే చిన్న విషయం కాదన్నారు. జగన్‌ను వీసారెడ్డి వంటి వారే వదిలి వేస్తున్నారంటే ఆలోచన చేయాలని అన్నారు. ఒక్కొక్కరుగా జగన్‌ను వదిలి బయటకు వస్తున్నారన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయినందున  తన అనుకున్నవారంతా వైసీపీ నుంచి వెళ్లిపోతున్నారని అన్నారు. బీజేపీకి, మోదీకి జగన్ దత్త పుత్రుడు అని విమర్శించారు. ఇంతకాలం వీసారెడ్డిని బీజేపీ దగ్గర ఉంచే కేసుల విచారణ సాగకుండా జగన్ చేశారని ఆరోపించారు. 

ఇప్పుడు విశ్వాసనీయతను జగన్ కోల్పోయారని విమర్శలు చేశారు. విజయసాయి రెడ్డి గతంలో ఎన్నో అబద్దాలు చెప్పారన్నారు. ఇప్పడైనా అన్ని నిజాలు ఆయన బయట పెట్టాలని చెప్పారు. మాజీ మంత్రి వివేకా కేసులో కూడా జగన్ చెప్పమన్న విధంగా అబద్దాలు చెప్పారన్నారు. వీసా రెడ్డి అన్నీ నిజాలు చెబితే.. ప్రజలు ఇప్పుడైనా హర్షిస్తారని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 

ఆస్తుల వివాదంలో జగన్ షర్మిలతో పాటు విజయమ్మపైఎన్సీఎల్టీలో కేసు వేసినప్పుడు పెద్ద దుమారం రేగింది. ఆ సమయంలో షర్మిల ఓ లేఖ విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలోనే ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చారని.. అప్పుడు  విజయసాయిరెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. తర్వాత విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. షర్మిల చెప్పినవన్నీ అబద్దాలని చెప్పారు. షర్మిలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ విషయాలను షర్మిల ప్రస్తావించారు. ఇప్పుడు అయినా నిజాలు చెప్పాలని ఆమె కోరుతున్నారు. 

షర్మిల వివేకా విషయంలోనూ నిజాలు చెప్పారని కోరుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు వైసీపీ తరపున విజయసాయిరెడ్డి ముందుగా గుండెపోటుతో చనిపోయారని ప్రకటించారు. తర్వాత అది దారుణ హత్యగా తేలింది. దారుణహత్యగా తేలిన తర్వాత టీడీపీ నేతలపై ఆరోపణలు ప్రారంభించారు. ఎందుకు ఆయన గుండెపోటుతో ముందుగా చనిపోయారని ప్రకటించారన్నదానిపై అనేక సందేహాలు వచ్చాయి. ఆయనకు హత్య వెనుకా, ముందు ఏం జరిగిందన్నది ఆయనకు తెలుసని అందుకే నిజాలు చెప్పాలని షర్మిల కోరుతున్నారని అంటున్నారు.                                     

విజయసాయిరెడ్డి రాజీనామా అంశం.. వైఎస్ఆర్‌సీపీలో సంచలనంగా మారుతోంది. త్వరలో మరికొంత మంది రాజీనామాలు చేసి వెళ్తారన్నప్రచారంతో ఆ పార్టీ నేతలు గందరగోళానికి గురవుతున్నారు. 

Also Read: ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా?

టాప్ హెడ్ లైన్స్

Net Zero Village: ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget