అన్వేషించండి

YS Sharmila: జగన్ కోసం ఎంతో చేశా - ఇంత అన్యాయం చేస్తారా ? కంట తడి పెట్టుకున్న షర్మిల

YSRCP : జగన్ కోసం ఎంతో త్యాగం చేస్తే అన్యాయం చేస్తారా అని షర్మిల కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

Sharmila Tears: జగన్ కోసం ఎంతో చేశానని కానీ జగన్ తన చెల్లి కోసం ఏమీ చేయలేదని పైగా ఆస్తుల విషయంలో మోసం చేస్తున్నారని ఆయన సోదరి షర్మిల కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల తనకు జగన్ చేసిన అన్యాయం గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తాను జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేశానన్నారు. పాదయాత్రలు చేశామని ఏ పని చెబితే ఆ పని చేశానన్నారు. మరి జగన్ తన కోసం ఏం చే్శాో చెప్పాలని అడిగారు. ఏమీ  చేయకపోగా ఇప్పుడు ఆస్తుల విషయంలో, తన బిడ్డలకు అన్యాయం చేయాలని అనుకుంటున్నారని ఆవేనద వ్యక్తం చేశారు.

సాక్షి  పత్రికలో జగన్ షర్మిలకు అన్ని ఆస్తులు పంచేశారని ప్రచురించడంతో  నాలుగుపేజీల లేఖను షర్మిల విడుదల చేశారు. ఆ లేఖలో షర్మిల .. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, కేవీపీ రామచంద్రరావుల సమక్షంలోనే వైఎస్ నోటి మాట ద్వారా ఆస్తుల పంపకాలు చేశారని  షర్మిల పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రెస్ మీట్ పెట్టిన సుబ్బారెడ్డి ఆ ఆస్తులన్నీ  జగన్ వేనని.. అవన్నీ  షర్మిల ఆస్తులు అయితే ఆమె కూడా జైలుకు వెళ్లాలి కదా అని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో కలత చెందిన షర్మిల ప్రెస్ మీట్  పెట్టారు. చాలా ఆస్తులు భారతి పేరు మీద ఉన్నాయని సుబ్బారెడ్డి లాజిక్ ప్రకారం భారతి కూడా జైలుకు వెళ్లాలి కదా ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. 

శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం

విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి జగన్ ఇచ్చిన పదువుల్ని తీసుకుని ఆర్థిక ప్రయోజనాలు కూడా పొంది ఉన్నారు కాబట్టి వారు నిజాలు మాట్లాడే అవకాశం లేదని తెలిసినా వారి గురించి తన తెలియాలన్న ఉద్దేశంతోనే ఆ లేఖల్లో పేరు పెట్టానన్నారు. నిన్నసుబ్బారెడ్డి రేపు విజయసాయిరెడ్డి కూడా వెలుగులోకి వచ్చి వస సుబ్బారెడ్డి మాట్లాడినట్లే మాట్లాడతారని అందులో వింత ఏమీ ఉండదని స్పష్టం చేశారు. కానీ ఓ ఆడబిడ్డకు తమ స్వార్థం కోసం ఇంత అన్యాయం చేయాలని ఎందుకు అనిపిస్తోందని.. ఒక్క సారి అయినా ఆలోచించరా అని షర్మిల ప్రశ్నించారు. వైపీసీ విజయాల కోసం తాను ఎంతో శ్రమించానని.. తాను ఏం తప్పు చేశానో చెప్పాలని వైసీపీ కార్యకర్తలు, నేల్ని కోరారు.

Also Read: Free Gas Cylinder In AP: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులు ఎవరు? ఎలా బుక్‌ చేయాలి? ఎప్పుడు బుక్ చేయాలి? 

ఆస్తుల విషయంలో జగన్ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. ఎవరైనా గిఫ్ట్ డీడ్ చేయాలనుకుంటే ఎంవోయూ చేస్తారా అని ప్రశ్నించారు. తనకు రావాల్సినవి ఇవ్వడానికి మాత్రమే ఎంవోయూ చేశారని దానిలో భాగంగా వచ్చిన డివిడెండ్లు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. ఇప్పుడు కన్నతల్లిని కోర్టుకు లాగడమే కాకండా.. ఘర్ ఘర్ కీ కహానీ అంటున్నారని మండిపడ్డారు. షర్మిల తన తల్లి గురించి. జగన్ చేసిన మోసం గురించి చెబుతున్న సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు. గొంతులో నుంచి మాటలు రాలేదు. అందుకే కాసేపటికే ప్రెస్‌మీట్ పూర్తి చేసి వెళ్లిపోయారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
Nara Lokesh US Tour: శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
Priyanka Gandhi: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
iPhone 16 Banned: ఐఫోన్ 16 ఆ దేశంలో బ్యాన్ - ఎందుకు నిషేధమో తెలుసా?
ఐఫోన్ 16 ఆ దేశంలో బ్యాన్ - ఎందుకు నిషేధమో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సౌత్‌పై ఇంత చిన్న చూపా మోదీజీ, ఏబీపీ సదర్న్ రైజింగ్ ఈవెంట్‌లో సీఎం రేవంత్నేను చాలా ప్రాక్టికల్, కొంచెం సెంటిమెంటల్ కూడా - నటి గౌతమిరేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడు - కేటీఆర్ సంచలనంపర్ఫెక్ట్‌గా పాట పాడేవాళ్లు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు - సింగర్ శిల్పా రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
Nara Lokesh US Tour: శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
Priyanka Gandhi: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
iPhone 16 Banned: ఐఫోన్ 16 ఆ దేశంలో బ్యాన్ - ఎందుకు నిషేధమో తెలుసా?
ఐఫోన్ 16 ఆ దేశంలో బ్యాన్ - ఎందుకు నిషేధమో తెలుసా?
Israel Iran War: ఇరాక్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు- మధ్యప్రాచ్యంలో టెన్షన్ టెన్షన్
ఇరాక్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు- మధ్యప్రాచ్యంలో టెన్షన్ టెన్షన్
Nalgonda News:తెలంగాణలో మారుమోగుతున్న ఏక్ పోలీస్ పాలసీ నినాదం- నల్గొండలో ఎస్సై కానిస్టేబుళ్ల తిరుగుబాటు - విపక్షాలకు కొత్త అస్త్రం
తెలంగాణలో మారుమోగుతున్న ఏక్ పోలీస్ పాలసీ నినాదం- నల్గొండలో ఎస్సై కానిస్టేబుళ్ల తిరుగుబాటు - విపక్షాలకు కొత్త అస్త్రం
Spiderman 4: ‘స్పైడర్ మాన్ 4‘ వచ్చేస్తోంది,  అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
‘స్పైడర్ మాన్ 4‘ వచ్చేస్తోంది, అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
MS Dhoni: ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ, ఓటర్లలో అవగాహనా పెంచేందుకు ఈసీ ప్లాన్స్
ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ, ఓటర్లలో అవగాహనా పెంచేందుకు ఈసీ ప్లాన్స్
Embed widget