అన్వేషించండి

Andhra CCTV360: నేరగాళ్లను ఇట్టే పట్టిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ - ఏఐ కెమెరాలతో ఏపీ పోలీసుల పని సులువు

AI cameras CCTV 360: ఆధునిక సాంకేతికతతో నేరగాళ్లను ఇట్టే పట్టుకుంటున్నారు ఏపీ పోలీసులు. సీసీటీవీ 360 అనే వ్యవస్థ కేవలం నేరాన్ని రికార్డ్ చేయడం కాదు.. నేరగాళ్లు ఎక్కడ తిరిగినా అలర్ట్స్ పంపుతోంది.

RTGS CCTV 360 system catching criminals : ఆధునిక సాంకేతికత తోడైతే నేరగాళ్ల ఆటలు సాగవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరూపిస్తోంది. నేరాలు చేసి తప్పించుకోవచ్చని భావించే కేటుగాళ్లకు, ప్రమాదాలు చేసి పారిపోయే నిందితులకు ఇప్పుడు  ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ ఒక పీడకలలా మారింది. కేవలం కెమెరా కళ్లు చూస్తుండటమే కాదు, అవి చూసిన విషయాన్ని క్షణాల్లో విశ్లేషించి పోలీసులను ఉరుకులు పెట్టించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత.

చోరీ చేసిన దొంగను ఇట్టే పట్టించిన సీసీటీవీ 360 వ్యవస్థ

ఇటీవల తిరువూరులో జరిగిన ఓ చోరీ కేసు ఈ సాంకేతికతకు అద్దం పడుతోంది. ఇంటి తాళాలు పగులగొట్టి బుల్లెట్ బైకుతో ఉడాయించిన దొంగ, తాను ఎక్కడా దొరకనని భావించాడు. కానీ, ఆర్టీజీఎస్ లోని ఏఎన్‌పీఆర్  ANPR - ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్  అనలిటిక్స్ ఆ బైకు నంబరును లక్ష్యంగా చేసుకుంది. ఆ నిందితుడు ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లోని ఎనిమిది ప్రాంతాల్లో తిరిగిన ప్రతిసారీ కెమెరాలు పోలీసులకు రియల్ టైమ్ అలర్ట్స్ పంపాయి. ఫలితంగా, ఆ బైకు ఎక్కడుందో ఖచ్చితంగా తెలుసుకున్న పోలీసులు నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు.

నేరం చేసి ఎక్కడకు పోయినా పోలీసులకు అలర్ట్స్ 

కేవలం దొంగతనాలే కాదు, ప్రాణాలు తీసి పారిపోయే  హిట్ అండ్ రన్  కేసుల్లోనూ ఈ కెమెరాలు కీలకంగా మారుతున్నాయి. కందుకూరులో ఒక పాదచారిని ఢీకొట్టి పారిపోయిన బైకర్ కోసం పోలీసులు వెతుకుతుండగా, ఒంగోలు బస్టాండ్ వద్ద ఉన్న కెమెరా ఆ వాహనాన్ని గుర్తుపట్టింది. నిందితుడు ఎటు వెళ్తున్నాడో మ్యాప్ పాయింటింగ్‌తో సహా సమాచారం అందడంతో, పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోగలిగారు. నేరం జరిగిన రోజుల తర్వాత కూడా నిందితుడు రోడ్డుపైకి వస్తే చాలు, ఈ వ్యవస్థ నిద్రపోకుండా కనిపెడుతూనే ఉంటుంది.

ఏఐ కెమెరాలోత నిఘా అనుసంధానం

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14,700 అత్యాధునిక ఏఐ (AI) కెమెరాలు  ఇప్పుడు ఒకే గొడుగు కింద అనుసంధానించారు. గతంలో కెమెరా రికార్డింగ్‌లను గంటల తరబడి చూడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం వల్ల మానవ ప్రమేయం లేకుండానే వాహనాల నంబర్లు, రంగులు, మోడళ్లను కెమెరాలు గుర్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు రూపొందించిన ఈ  స్మార్ట్ సర్వైలెన్స్  వ్యవస్థ, నేరాల దర్యాప్తులో పారదర్శకతను పెంచడమే కాకుండా పోలీసుల పనిభారాన్ని కూడా తగ్గిస్తోంది.

నేరగాళ్లకు దొరికిపోవడమే మార్గం                                          

ఈ ఏఐ ఆధారిత కెమెరాలు కేవలం నేరగాళ్లను పట్టుకోవడానికే పరిమితం కాలేదు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, ర్యాష్ డ్రైవింగ్ వంటి అంశాలను గుర్తించడంతో పాటు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. తద్వారా సహాయక చర్యలు వేగంగా చేపట్టేందుకు అవకాశం కలుగుతోంది. ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థతో ఆంధ్రప్రదేశ్‌లో నేరగాళ్లకు ఇక ఎగ్జిట్ రూట్ లేదనే చెప్పాలి!                         

 

టాప్ హెడ్ లైన్స్

Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget