అన్వేషించండి

Somu Veerraju: ఏపీలో రేషన్ బియ్యంపై వెయ్యి కోట్ల కుంభకోణం జరుగుతోంది - సోము వీర్రాజు ఆరోపణలు

రేషన్ బియ్యం రీసైకిల్ చేసి వెయ్యి కోట్లు కుంభకోణం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ మాఫియాలో వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (BRS) పేరుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెడితే అడ్డుకుంటామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (AP BJP Chief Somu Veerraju) హెచ్చరించారు. గన్నవరం వేదికగా ప్రజాపోరు ప్రారంభం చేద్దామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం...  
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గన్నవరంలో జరిగింది. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసే విధంగా జిల్లా స్థాయిలో కూడా ఛార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. రైతులకు భీమా సౌకర్యం లేకుండా నట్టేట ముంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. రైతులకు చిల్లులు పడిన గోనె సంచులు ఇవ్వడంలో ప్రభుత్వం మాఫియాను నడుపుతోందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు.

రాష్ట్రంలో రేషన్ మాఫియా... 
రేషన్ బియ్యం రీసైకిల్ చేసి వెయ్యి కోట్లు కుంభకోణం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ మాఫియాలో అధికార పార్టీకి చెందిన నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించామని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయని ఎద్దేవా చేశారు.

కేంద్ర కాంట్రాక్టులు మంత్రి అనుచరులకు కేటాయింపు.. 
జాతీయ రహదారుల కనెక్టివిటికి కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఇస్తే, ఆంధ్రప్రదేశ్ లో ఆయా కాంట్రాక్ట్ పనులను మంత్రి అనుచరులకు కట్టబెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసం అధికారులుపై ఒత్తిడి తీసుకువచ్చి, అవినీతి అక్రమాలకు కేంద్రంగా మంత్రులు మారుతున్నారని, అన్నీ తెలిసినప్పటికి అధికారులు సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

బ్రాందీ మీదే మమకారం... 
రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల మీదనే ఎక్కువ ధ్యాస ఉందని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్ పై రాష్ట్ర ప్రభుత్వానికి అసలు అవగాహన లేదని అన్నారు. బ్రాందీ మీద ఉన్న అవగాహన ఆయుష్ పై ముఖ్యమంత్రి జగన్ కి లేదన్నారు. సాంప్రదాయ వైద్య విధానం పై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు చేయడం లేదన్నారు. జగన్ బ్రాందీ షాపు ల్లో అంతా క్యాష్ ని వినియోగిస్తున్నారని, ఆ నగదు అంతా ఎక్కడికి వెళుతుందని సోము వీర్రాజు ప్రశ్నించారు.

ఇళ్ల స్థలాల కోనుగోలులో అవినీతి... 
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి 22 లక్షల ఇళ్ళు కేంద్రం ప్రభుత్వం ఇస్తే 7 లక్షలు నిర్మాణం చేశామని చెపుతున్నారని, ఎంత మందికి ఇళ్ళను కేటాయించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు కొనుగోలులో వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు వందల కోట్ల రూపాయలు అవినీతికి  పాల్పడ్డారని ఆరోపించారు. ఇంత దారుణమైన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యకృత్యం అయ్యాయని, టిడ్కో ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఛార్జ్ షీట్ లో ఎమ్మెల్యేలే టార్గెట్.. 
బీజేపీ అనుబంధ సంఘాలు ఛార్జిషీట్ దాఖలు చేస్తాయని, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి ఛార్జిషీట్ లు దాఖలు చేసినట్లు తెలిపారు. బీజేపీ నేతలపై నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు దాష్టికాన్ని రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు చేశామని చెప్పారు.  

మోడీ పాలన రావాల్సిందే... 
అవినీతి అంతం కావాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో రావాలని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ఇళ్ళు కట్టలేని దద్దమ్మ ప్రభుత్వం ఇక్కడ ఉందని, జిల్లా, రాష్ట్ర స్థాయి ఛార్జిషీట్ దాఖలు చేస్తామని, నరేంద్ర మోడీ పరిపాలన మే30 నుండి జూన్ 30 వరకు ప్రతి ఇంటి కి తీసుకొని వెళ్తామన్నారు. దశాబ్ద కాలంలో కాంగ్రెస్ వేల కోట్ల అవినీతి కి పాల్పడిందని ఆరోపించారు. కానీ బీజేపీ పాలనలో అవినీతికి చోటు లేదన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget