Andhra News : రఘురామ పెట్టిన కేసులో కీలక పరిణామం - విచారణకు హాజరైన రిటైర్డ్ పోలీస్ అధికారి విజయ్‌పాల్
RRR Case : కస్టోడియల్ టార్చర్‌కు సంబంధించి రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేయడంతో విచారణకు వచ్చారు.
Retired DSP Vijay Pal attended the hearing in the Raghurama case : మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ విచారణ అధికారుల ఎదుట హాజరయ్యారు. కేసు నమోదు అయిన తర్వాత విజయ్ పాల్ ఆజ్ఞాతంలోకి వెళ్లారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ముందస్తు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. హైకోర్టులో చుక్కెదురు అయింది. సుప్రీంకోర్టులో ఆయన ప్రయత్నించారు. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకూ చర్యలు తీసుకోకుండా ఉత్తర్వుల ఇచ్చింది. అయితే విజయ్ పాల్ విచారణకు సహకిరంచాల్సిందేనని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. గురువారం గుంటూరు ఎస్పీకి ఆయన తాను విచారణకు హాజరవుతానని లేఖ రాశారు. శుక్రవారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న పశ్చిమ డీఎస్పీ ఎదుట ఆయన హాజరయ్యారు. ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రఘురామకృష్ణరాజు పట్టిన రోజు నాడు హైదరాబాద్‌లోని ఇంట్లో ఉన్నప్పుడు విజయ్ పాల్ నేతృత్వంలోని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో సీఐడీ ఓఎస్డీగా ఉన్న విజయ్ పాల్ సుమోటోగా రాజద్రోహం కేసు పెట్టారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
అనంతపురం ఎస్పీ సాయంతో చంపేసే ప్లాన్ - తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ఆరోపణ
అరెస్టు చేసిన రోజున సీఐడీ ఆఫీసులో రఘురామపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆస్పత్రిలో పరీక్షలకు ఆదేశించింది. ఆ ఆస్పత్రిలోనూ రిపోర్టులు తారుమారు చేశారని రఘురామ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో.. హైదరాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో టెస్టులు చేయించారు. అక్కడ వచ్చిన నివేదిక ఆధారంగా రఘరామకు బెయిల్ వచ్చింది. అయితే దాడి చేసినట్లుగా ఆర్మీ ఆస్పత్రి రిపోర్టులు ఇచ్చిందని .. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో మాజీ సీఎం జనగ్ పేరు కూడా ఉంది.
పుట్టబోయే బిడ్డకు దువ్వాడ జగన్ అని పేరు పెడతారట - టీవీ ఇంటర్యూల్లో హల్చల్ చేస్తున్న దువ్వాడ, దివ్వెల
ఈ కేసులో ఉన్న పోలీసు అధికారుల్ని, సిబ్బందిని ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. అందరి వాంగ్మూలాలు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలను కూడా సేకరించారు. సీఐడీ ఆఫీసులో ఆ రోజున రఘురామను కొట్టేందుకు ఐపీఎస్ సునీల్ కుమార్ మరో నలుగుర్ని తీసుకుని వచ్చారని అప్పట్లో సీఐడీ ఆఫీసు దగ్గర విధుల్లో ఉన్న గార్డులు వాంగ్మూలం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని సునీల్ కుమార్ ఖండించారు. కేసు నమోదు అయిన రోజున వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందున ఆయనపై క్రమిశిక్షణా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసింది.