Renu Desai: నా విషయంలో చేసింది తప్పే, కానీ పవన్‌కే నా ఫుల్ సపోర్ట్ - మా పిల్లల్ని మధ్యలో లాగొద్దు: రేణు దేశాయ్ రిక్వెస్ట్
కల్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ స్పందించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పెట్టారు. పవన్ కల్యాణ్ చాలా అరుదైన వ్యక్తి అని రేణు దేశాయ్ అన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి విపక్ష నేతలు పదే పదే లేవనెత్తే సంగతి తెలిసిందే. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, వారికి అన్యాయం చేశారని అంటూ ఉంటారు. మధ్యలో పవన్ కల్యాణ్ పిల్లల గురించి కూడా కొంత మంది మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ విమర్శల వేళ పవన్ కల్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ స్పందించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పెట్టారు. పవన్ కల్యాణ్ చాలా అరుదైన వ్యక్తి అని రేణు దేశాయ్ అన్నారు. రాజకీయంగా కచ్చితంగా తన మద్దతు పవన్ కల్యాణ్ కే ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ పేదల కోసమే ఆలోచిస్తారని, ఆయన అస్సలు డబ్బుల మనిషి కాదని అన్నారు.
‘‘ఇటీవల పవన్ కల్యాణ్ నటించిన ఓ సినిమా తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. నేను ఇన్ని రోజులు విదేశంలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు స్పందిస్తున్నాను. నా మాజీ భర్త గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు తీస్తామని అంటున్నారు. నేను ఓ తల్లిగా అందరికీ ఒకటే కోరుతున్నాను. మీ ప్రొఫెషన్‌లోకి దయచేసి పిల్లల్ని లాగకండి. వాళ్లకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఒక తల్లిగా నేను అభిమానుల్ని, ప్రత్యర్థుల్ని, రాజకీయ నాయకుల్ని వేడుకుంటున్నాను. దయచేసి పిల్లల్ని, కుటుంబంలోని ఆడవారిని రాజకీయాల్లోకి లాగకండి.
నేను మొదటి నుంచి రాజకీయాల పరంగా నా మాజీ భర్తను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాను. నా విషయంలో ఆయన చేసినది తప్పే. వంద శాతం దాన్ని నేను అంగీకరిస్తాను. కానీ, నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే.. పవన్ కల్యాణ్ జనం కోసమే ఉంటారు. ఆయన డబ్బు మనిషి కాదు. డబ్బు అంటే ఇంట్రెస్ట్ లేదు. సమాజానికి మంచి చేయాలనే తపన ఉన్న వ్యక్తి. నేను నా వ్యక్తిగత ఇబ్బందుల్ని పక్కన పెట్టి, కచ్చితంగా రాజకీయంగా సపోర్ట్ చేస్తాను. ఆయన వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి, రాజకీయంగా మాట్లాడండి. పవన్ ఒక సక్సెస్ ఫుల్ యాక్టర్ అయినా రాజకీయాల్లోకి వచ్చారు. దయచేసి ఈసారి ఆయనకు ఛాన్స్ ఇవ్వండి. నేను ఆయన మాజీ భార్యగా మాట్లాడడం లేదు. సమాజంలో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. దయచేసి మూడు పెళ్లిళ్ల గురించి చర్చను ఆపండి. అది వినేందుకు చాలా అన్‌కంఫర్టబుల్ గా ఉంది’’ అని రేణు దేశాయ్ అన్నారు.
View this post on Instagram