అన్వేషించండి

YSRCP Rajya Sabha: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ

R Krishnaiah and Niranjan Reddy : ఏపీ వారిని కాదని, తెలంగాణ వ్యక్తులకు పదవులు ఇవ్వడంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తొలగించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ని డిమాండ్ చేశారు.

YSRCP Rajya Sabha Members: ఎంపీ వి.విజయసాయిరెడ్డితో పాటు ఆర్‌.కృష్ణయ్య, ఎస్‌.నిరంజన్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావులను వైఎస్సార్‌సీపీ తమ రాజ్యసభ సభ్యులుగా మంగళవారం ప్రకటించింది. అయితే ఏపీ వారిని కాదని, తెలంగాణ వ్యక్తులకు పదవులు ఇవ్వడంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్ రెడ్డిలు తెలంగాణకు చెందిన వారని, వారికి కేటాయించిన రాజ్యసభ పదవుల నుంచి తక్షణమే తొలగించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు.

2024 ఎన్నికల్లో జగన్‌కు కష్టమే.. 
ఆ ఇద్దరికి కేటాయించిన రాజ్యసభ పదవుల నుంచి తొలగించకపోతే 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు, రుద్యోగులు, ప్రజలు సీఎం జగన్‌కు దూరం అవుతారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్, ఎస్సీ ఎస్టీ నాయకులు అక్క బత్తుల గిరీష్ బీసీ నాయకులు ఉమ్మడి మహేష్ సంతోష్ చిన్ని  సీతంపేట వేదికగా తెలియజేశారు. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు తెలంగాణ రాష్ట్ర సాధణ పోరాటంలో ఆంధ్రులకు వ్యతిరేకంగా  కీలక పాత్ర పోషించారని, 2024 వరకు తమకు హైదరాబాద్‌లో ఉమ్మడి రాజధానిగా సమాన హక్కు ఉన్నప్పటికీ, ఎన్నడూ ఏపీ నిరుద్యోగులను హైదరాబాద్ ఉద్యోగాలలో స్థానికులుగా పరిగణించాలని ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు.

ఆంధ్ర ద్రోహులకు రాజ్యసభ పదవులా ? 
అలాంటి ఆంధ్ర ద్రోహులకు రాష్ట్రం నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు రాజ్యసభకు వారిని పంపడం అన్యాయం అన్నారు. ఏపీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, సీఎం వైఎస్ జగన్‌ను, రాష్ట్రాని అభిమానించే ఎంతోమంది కార్యకర్తలు, అభిమానులు ఉండగా, 175 బీసీ కులాలకు చెందిన లక్షలాది మంది నేతల్ని కాదని తెలంగాణకు చెందిన వ్యక్తులకు రాజ్యసభ పదవులు ఇవ్వడం తమ మనోభావాలు దెబ్బతీయడమేనన్నారు. నిరుద్యోగ పోరాటాలు చేసిన ఉద్యమకారులు ఏపీలో ఉండగా, వారందర్నీ కాదని ఆర్.కృష్ణయ్య ,నిరంజన్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ నేతలకు రాజ్యసభ పదవులను కేటాయించే వరకు నిరసన దీక్షలు కొనసాగిస్తామని ఏపీ నిరుద్యోగ జేఏసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు స్పష్టం చేశారు.  

Also Read: R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

Also Read: Lucky Krishnayya : ఏ పార్టీ అయినా పిలిచి మరీ అవకాశాలు - అదృష్టమంటే ఆర్.కృష్ణయ్యదే !

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget