By: ABP Desam | Updated at : 27 Dec 2022 03:04 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పరిటాల సునీత
Paritala Sunitha : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా.. దౌర్జన్యాలు, సెటిల్మెంట్లే కనిపిస్తాయని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. రాప్తాడు మండలం మరూరు గ్రామంలో జరిగిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలసి ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ప్రతి ఇంట్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్యలు, మహిళలు పడుతున్న ఇబ్బందులు, రైతులు పడుతున్న కష్టాలు ఇలా అన్ని వర్గాల వారి కష్టాలు తెలుసుకున్నారు. పరిటాల సునీత గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముచ్చుమర్రి రామాంజనేయులు అనే వ్యక్తి హఠాత్తుగా వచ్చి సునీత కాళ్లపై పడ్డారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరి తప్పు చేశానంటూ సునీత కాళ్లు పట్టుకున్నారు. దీంతో అతన్ని పైకి లేపి ఆప్యాయంగా పలకరించారు సునీత. జరిగిందేదో జరిగిందంటూ.. ఈ పార్టీలో ఎప్పటికీ మీ లాంటి వాళ్లకు చోటు ఉంటుందని తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. ఇక నుంచి పార్టీ కోసం నిర్విరామంగా శ్రమిస్తానని రామాంజనేయులు చెప్పారు.
రూ.15 కోట్లు డిమాండ్ వాస్తవం కాదా?
అనంతరం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత... మాట్లాడుతూ గతంలో పసుపు కుంకుమ, చంద్రన్న కానుక, పింఛన్లు అన్నీ పార్టీలకతీతంగా ఇచ్చేవారమన్నారు. అయితే ఇప్పుడు పార్టీలు చూసి పథకాలు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా చాలా మంది పింఛన్లు తొలగించినట్టు వాపోతున్నారని.. ప్రభుత్వం ఇలానే పింఛన్లు తొలగిస్తూ పోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి తాము జాకీ పరిశ్రమ తీసుకొస్తే.. ఎన్నికల్లో ఖర్చు చేశామంటూ ఆ కంపెనీ ప్రతినిధులను రూ.15 కోట్లు డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాము దీనిపై విమర్శిస్తే.. ఎమ్మెల్యే సోదరుడు అసభ్య పదజాలంతో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని, పత్రికాధిపతుల్ని దూషించారన్నారు.
అక్రమ కేసులతో వేధింపులు
టీడీపీ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. జాకీ పరిశ్రమ వచ్చి ఉంటే.. నియోజకవర్గంలో 6 వేల మంది మహిళలకు ఉపాధి దొరికి ఉండేదన్నారు. కేవలం ఇవొక్కటే కాకుండా ఏ గ్రామంలో చూసిన ఎమ్మెల్యే సోదరుల అక్రమాలు, దౌర్జన్యాలే కనిపిస్తున్నాయన్నారు. చివరకు రైతుల భూములను లాక్కునేందుకు కూడా వెనుకాడటం లేదన్నారు. ఎన్నికలకు ఇక ఎంతో దూరం లేదని ప్రతి ఒక్కరూ వాటికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని.. నాయకులు, కార్యకర్తలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
"డ్వాక్రా సంఘాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. చంద్రన్న పాలనలో అన్ని వర్గాలను ఆదుకున్నారు. వైసీపీ పాలనలో పింఛన్లు కూడా తొలగించారు. వైసీపీ నేతలు మా భూములు కబ్జా చేశారని బాధితులు వాపోతున్నారు. అన్నదమ్ములను కూడా సెఫరేట్ చేసి భూముల దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. ఇసుక, మట్టి మాఫియా మొదలెట్టారు. రాప్తాడు ఎమ్మెల్యే భూ దందాలు, రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నారు. రైతులను బెదిరించి భూముల లాక్కొన్నారు ఎమ్మెల్యే. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపాలి. మోటర్లకు మీటర్లు పెడతారంటే అంటే రైతులకు ఉరితాడు బిగించినట్లే. ఏ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించుకోవాలి." - పరిటాల సునీత
MLA RK : మంగళగిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం - సమస్యలను పరిష్కరించట్లేదని అడ్డుకున్న జనం !
ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
APFSL Recruitment: ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు - పూర్తి వివరాలు ఇలా!
Andhra Loans : ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం ఎవరు ? తప్పు మీదంటే మీదని అధికార, విపక్షాల ఆరోపణలు !
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్కు పనికొచ్చే విషయాలేంటి?
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Balakrishna Phone : బాలకృష్ణ ఏ ఫోన్ వాడుతున్నారో చూశారా? పాకెట్లో ఎలా స్టైలుగా పెట్టారో?