Raksha Bandhan: అన్నకు రాఖీ కట్టని షర్మిల... ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు.. కారణం ఇదేనా..!
ఏపీ సీఎం జగన్ కు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రక్షా బంధన్ సందర్భంగా ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పుడు అన్నకు స్వయంగా రాఖీ కట్టే షర్మిల ఈసారి వెళ్లలేదు.
రాజకీయాల్లో శత్రువులైనా... ఆఫ్ ద రికార్డ్ మంచి మిత్రులే. మైక్ ముందు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నా... మైక్ ఆఫ్ చేస్తే హాస్యపు పలకరింపులు ఉంటాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం తేస్తానంటూ వైఎస్ఆర్టీపీ స్థాపించిన వైఎస్ షర్మిల ఈ ఏడాది తన అన్న, ఏపీ సీఎం జగన్ కు రాఖీ కట్టలేదు. కానీ ట్వీట్టర్ ద్వారా "నా తోడ బుట్టిన జగనన్నకు రాఖీ శుభాకాంక్షలు" అని తెలిపారు.
సొంత మీడియాపై వ్యాఖ్యలు
తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటానికి పార్టీ పెట్టానని వైఎస్ షర్మిల చెబుతున్నారు. ఆమె రాజకీయాల్లోకి రావడానికి అన్నా, చెల్లెలు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని ముందు ఎవరూ నమ్మలేదు. తాజా పరిస్థితులు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. మొదట్లోనే వైఎస్ షర్మిల, జగన్ సొంత మీడియా సంస్థపై బహిరంగానే కొన్ని కామెంట్స్ చేశారు. మీరు మాకు కవరేజ్ ఇవ్వరులే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ రాజకీయాల్లో భాగమని అందరూ భావించారు.
నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల. #HappyRakhi pic.twitter.com/EP35BVUJ7z
— YS Sharmila (@realyssharmila) August 22, 2021
వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్న సందర్భాలే కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీ పెట్టిన అనంతరం ఇప్పటి వరకూ అన్న జగన్‌తో షర్మిల భేటీ కాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కూడా తల్లి విజయమ్మతో కలిసి మాత్రమే ఇడుపులపాయలో కనిపించారు. సీఎం జగన్ నివాళులు అర్పించినప్పుడు కూడా షర్మిల ఎక్కడా కనిపించలేదు.
Also Read: Jagan Sharmila Rakhi : జగన్‌కు రాఖీ కట్టేందుకు షర్మిల వెళ్తారా..?
తాజాగా ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా షర్మిల ఇదే వైఖరిని అవలంభించారు. ఇప్పటి వరకూ చాలా మంది రాజకీయంగా విరుద్ధంగా ఉన్నా కుటుంబ సంబంధాలు మాత్రం కొనసాగించేవారు. ఒకే ఇంట్లో మూడు నాలుగు రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. కుటుంబ సంబంధాల్లో రాజకీయాలు అడ్డురాకుండా చూసుకునేవారు. కాని షర్మిల మాత్రం ఇలా వ్యవహరించడంలేదని అనుకోవచ్చు.
Also Read: Watch: 10 ఏళ్ల నుంచి మంత్రి హరీశ్ రావుకు తొలి రాఖీ కట్టేది ఈమెనే..
Also Read: Keerthy Suresh Photos: కీర్తి సురేష్ ఓనమ్ సెలబ్రేషన్.. ట్రెడీషనల్ లుక్‌లో ‘మహానటి’ ఫొటోస్