అన్వేషించండి

East Godavari Latest News: వీర రాఘవ రెడ్డి చాలా మంచోడు! క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్న సొంతూరి ప్రజలు!

East Godavari Latest News: రామ‌రాజ్యం వీర‌రాఘ‌వ రెడ్డి చాలా మంచి వాడు. అన‌ప‌ర్తి మండ‌లం కొప్ప‌వ‌రం వాసుల సంచలన కామెంట్స్ చేశారు.

East Godavari Latest News: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కొవ్వూరి వీర రాఘవ రెడ్డి అలియాస్‌ రామరాజ్యం వీర రాఘవ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ అయితే జరుగుతోంది.. రామరాజ్య స్థాపనకు అవసరమైతే ప్రాణాలివ్వడం, ప్రాణాలు తీయడం అనే నినాదంతో సైన్యాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పుకుంటున్న వీరరాఘవ రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 

ఇంతకీ వీరరాఘవ రెడ్డిది అసలు ఏ ఊరు.. ఆయన స్వస్థలం ఎక్కడ అనే చర్చ జరుగుతోంది. వీర‌రాఘ‌వ రెడ్డి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం కొప్పవరం. ఈ గ్రామంలో వీర రాఘ‌వ‌రెడ్డి గురించి తెలుసుకునేందుకు ఏబీపీ దేశం అక్కడ పర్యటించింది. ఆ గ్రామ ప్రజలతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుంది. 

అన‌ప‌ర్తి మండ‌లం కొప్ప‌వ‌రం గ్రామంలో వీర‌రాఘ‌వ రెడ్డి ఇల్లు ప్ర‌స్తుతం తాళం వేసి ఉంది. ఆయ‌న తల్లిదండ్రులు చిన్న‌ కుమారుడు వ‌ద్ద నూజివీడులో ఉంటున్నార‌ని చుట్టుప‌క్క‌ల వాళ్లు చెప్పారు. వీరరాఘవరెడ్డి చాలా కాలంగా ఆ గ్రామంలో ఉండడం లేదట. గ్రామంలో ఎవ్వరిని కదిపినా వీరాఘవరెడ్డి మంచివాడనే చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

వీర‌రాఘ‌వ రెడ్డి చిన్నతనమంతా కొప్పవరంలోనే గడిపాడు. సుమారు 25 సంవ‌త్స‌రాల క్రితం గ్రామం నుంచి హైద‌ర‌బాద్ వెళ్లిపోయార‌ని ఆ గ్రామ స‌ర్పంచ్ బులిమోహ‌న్ రెడ్డి తెలిపారు. వీర‌రాఘ‌వ రెడ్డి కుటుంబం చాలా ప‌ద్ద‌తైన కుటుంబం అని అంటున్నారు. తండ్రి స‌త్తిరెడ్డి వ్య‌వ‌సాయ‌దారుడ‌ని, త‌ల్లి త‌ల్లి మ‌హాల‌క్ష్మి హోమ్‌మేకరని వివరించారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్ర‌ధాన అర్చ‌కునిపై దాడి అనేది జ‌రిగిందో లేదో తెలీద‌ని అన్నారు. 

Also Read: అధికారులు, అభ్యర్థి కలిసి అక్రమాలు-పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై హర్షకుమార్‌ తనయుడి ఆరోపణలు

అంత‌రించిపోతున్న హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించాల‌న్న‌ట్టు వీర‌రాఘ‌వ రెడ్డి వీడియోల‌ను బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంద‌న్నారు కొప్పవరంవాసులు. గ్రామంలోకి ఆయ‌న ఎప్ప‌డూ రాడ‌ని, అయితే ఎవ్వ‌రైనా ఎదైనా స‌మ‌స్య‌ల్లో ఉన్నట్టు తెలిస్తే మాత్రం సాయం చేసేవాడట.  

వీర‌రాఘ‌వ రెడ్డికి చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న ఉంది..
రామ‌రాజ్యం వీర‌రాఘ‌వ రెడ్డికి చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న ఎక్కువ‌గా ఉంద‌ని ఆ గ్రామ స‌ర్పంచ్ బులిమోహ‌న్ రెడ్డి తెలిపారు. త‌ను చ‌దువుకున్న‌ది ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కేన‌ని తెలుస‌ని, అయితే అక్క‌డికి వెళ్లాక ఎంత చ‌దువుకున్నాడో తెలియ‌ద‌న్నారు. గ్రామంలో వీర‌రాఘ‌వ రెడ్డి అనుచ‌రులుగా ఉన్నారా అన్న ప్ర‌శ్న‌కు ఎవ్వ‌రూ త‌న‌తో అంత‌గా ట‌చ్‌లో లేర‌న్నారు. త‌న‌తో కూడా అత‌ను అందుబాటులో ఉండ‌లేద‌న్నారు. త‌న ప‌నేదో త‌ను చూసుకోవ‌డం త‌ప్ప ఇంకేమీ తండ్రికి తెలియ‌ద‌ని, త‌ల్లి కూడా అంతే అన్నారు. ఇక సోద‌రుడు అయితే వ్యాపారం చేసుకుంటున్నాడ‌ని, తండ్రి ఐటీసీలో కార్మికునిగా రిటైర్ అయ్యాక ఇక్క‌డ ఉండ‌డం లేద‌న్నారు. వీర‌రాఘ‌వ రెడ్డి వ్య‌క్తిత్వం గురించి ఏం చెబుతార‌ని ప్ర‌శ్నించ‌గా త‌న‌కు తెలిసినంత వ‌ర‌కు ఆయ‌న మంచి వ్య‌క్తి అని స‌ర్పంచ్ బులిమోహ‌న్ రెడ్డి చెప్ప‌కొచ్చారు. 

Also Read: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget