అన్వేషించండి

East Godavari Latest News: అధికారులు, అభ్యర్థి కలిసి అక్రమాలు-పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై హర్షకుమార్‌ తనయుడి ఆరోపణలు

East Godavari News: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూట‌మి అభ్య‌ర్ధ‌కి అనుకూలంగా అధికారులు వ్య‌వ‌హ‌రించార‌ని జీవీ శ్రీ‌రాజ్ ఆరోపించారు. అఫ‌డ‌విట్ స‌రిదిద్దుకునే అవ‌కాశం ఎలా ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు.

East Godavari MLC Elections : ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థుల నామినేషన్ల స్క్రూట్నీలో అక్రమాలు జరిగాయని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీ‌రాజ్‌ ఆరోపిస్తున్నారు. కూటమి నాయకత్వానికి అధికారులు కొమ్ముస్తున్నారని విమర్శించారు. ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన తన సోదరుడు, స్వతంత్ర అభ్యర్ధి జీవీ సుందర్‌ పేరు కావాలనే 43వ స్థానంలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నామినేషన్ రిజెక్ట్ అయినా తీసుకున్నారు: జీవీ శ్రీ‌రాజ్‌

కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్‌ నామినేషన్‌ ముందు రిజెక్ట్‌ అయ్యిందని సంచలన ఆరోపణలు చేశారు జీవీ శ్రీ‌రాజ్‌. ఆ నామినేషన్‌ను ఎలా స్వీకరించారని అధికారులను ప్రశ్నించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రూల్స్‌ను అతిక్రమిస్తున్నారని అన్నారు. ఓటర్లును ప్రలోభపెడుతున్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. దీనికి సంబంధించిన వాట్సాప్‌ చాటింగ్‌ చూపించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. 
అధికారులే రూల్స్‌ అతిక్రమిస్తున్నారు..

ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని అభ్యర్థులు అతిక్రమించడం తప్పని అయితే ఇక్కడ అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్నారని జీవీ శ్రీ‌రాజ్ ఆరోపించారు. స్క్రూట్నీ విష‌యంలో 11 మంది నామినేష‌న్లు తిర‌స్క‌రించ‌డంలో లోపాలున్నాయ‌న్నారు. ఎల‌క్ష‌న్ ప్రొసిజ‌ర్‌లో గ‌డువు పూర్త‌య్యాక అఫ‌డ‌విట్ క‌రెక్ట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించార‌ని అన్నారు. కూట‌మి అభ్య‌ర్థ‌కి అవ‌కాశం ఎలా క‌ల్పించార‌ని ప్ర‌శ్నించారు. దీనికి క‌లెక్ట‌ర్‌, ఆర్వో బాధ్యత వ‌హించాల‌న్నారు. క‌లెక్ట‌రు అవ‌లంభించిన తీరు బాధాక‌ర‌మ‌న్నారు.. 

కూట‌మి అభ్య‌ర్ధికి వత్తాసు: జీవీ శ్రీ‌రాజ్‌
కూట‌మి అభ్య‌ర్థి అఫ‌డ‌విట్‌లో లోపాలున్నా కూడా నామినేషన్ తిరస్కరించకుండా లోపాలు స‌రిదిద్దుకునే ఛాన్సస్ ఇచ్చారన్నారు జీవీ శ్రీ‌రాజ్‌. 11 మంది అభ్య‌ర్థ‌లు విష‌యంలో కూడా లోపాలు కచ్చితంగా ఉన్నాయ‌న్నారు. ఇది కేవ‌లం రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చారన్నది వాస్త‌వం అన్నారు. కూట‌మి అభ్య‌ర్థి నామినేష‌న్ సెట్‌లో అఫ‌డ‌విట్ లోపాలున్నాయ‌ని, దానిని తిరస్కరించేందుకు ఆధారాలున్నాయ‌న్నారు. 

Also Read: సైకిల్ ఎక్కిన మాజీ మంత్రి ఆళ్ల నాని- చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక

జీవీ సుంద‌ర్‌ను ఆఖ‌రికి నెట్టారు.. : జీవీ శ్రీ‌రాజ్‌

వ‌రుస సంఖ్య విష‌యంలో త‌న సోద‌రుడు జీవీ సుంద‌ర్‌ను వెన‌క్కునెట్టార‌న్నారు జీవీ శ్రీ‌రాజ్‌. కావాల‌నే జీవీ సుంద‌ర్ పేరును లైట్‌గా ఫ్రింట్ చేశార‌ని ఆరోపించారు. ఓట‌ర్ల‌కు ప్ర‌లోభ‌పెడుతున్నార‌ని, డ‌బ్బులు కూడా పంపిస్తున్నార‌ని, బ‌స్సు టిక్కెట్లకు డ‌బ్బులు పంపిస్తున్నార‌ని ఆరోపించారు. కూట‌మి అభ్య‌ర్థిని వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఇప్ప‌టికే ఫిర్యాదు చేశామ‌ని, కోర్టుకు కూడా వెళ్తామ‌న్నారు. 

కూట‌మి అభ్య‌ర్ధికి చెమ‌టలు ప‌డుతున్నాయి..: జీవీ శ్రీ‌రాజ్‌

త‌న సోద‌రుడు అభ్య‌ర్ధిగా రంగంలోకి దిగిన వెంట‌నే కూట‌మి అభ్య‌ర్ధికి, కూట‌మి నేత‌ల‌కు చెమ‌టలు ప‌డుతున్నాయ‌ని జీవీ శ్రీ‌రాజ్ అన్నారు. హ‌ర్ష‌కుమార్ త‌న‌యుడుగా జీవీ సుంద‌ర్ ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించ‌బోతున్నార‌ని అన్నారు. స‌జావుగా ఎన్నిక‌లు జ‌రిగితే త‌న సోద‌రుడే గెలుస్తాడ‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వానికి ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌న్నారు. 

Also Read: బర్డ్‌ఫ్లూతో పెరిగిన ఖర్చు- చికెన్ ప్లేస్‌లో మటన్‌, ఫిష్‌ చేరడంతో జనం గగ్గోలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Telangana Praja Jagruthi: కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Tirupati Crime News: ఆకలితో పాల కోసం ఏడ్చిన పాపను చంపిన తల్లి.. గుడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్! తిరుపతిలో దారుణం
పాల కోసం ఏడ్చిన పాపను చంపిన తల్లి.. గుడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్! తిరుపతిలో దారుణం

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Telangana Praja Jagruthi: కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Tirupati Crime News: ఆకలితో పాల కోసం ఏడ్చిన పాపను చంపిన తల్లి.. గుడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్! తిరుపతిలో దారుణం
పాల కోసం ఏడ్చిన పాపను చంపిన తల్లి.. గుడ్ న్యూస్ అంటూ భర్తకు ఫోన్! తిరుపతిలో దారుణం
Iran War: అమెరికాతో ముఖాముఖి పోరుకు ఇరాన్ సిద్ధం! పది లక్షల మంది యోధులతో భారీ సమీకరణ! అగ్ర రాజ్యాన్ని వణికిస్తున్న ఆయుధ కొరత?
అమెరికాతో ముఖాముఖి పోరుకు ఇరాన్ సిద్ధం! పది లక్షల మంది యోధులతో భారీ సమీకరణ! అగ్ర రాజ్యాన్ని వణికిస్తున్న ఆయుధ కొరత?
Telangana SSC Exams: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
IPL 2026 Live Streaming: ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ఏ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలన్నీ ఒక్క క్లిక్‌లో తెలుసుకోండి!
ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ఏ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలన్నీ ఒక్క క్లిక్‌లో తెలుసుకోండి!
Embed widget