అన్వేషించండి

Bird Flu In Andhra Pradesh: బర్డ్‌ఫ్లూతో పెరిగిన ఖర్చు- చికెన్ ప్లేస్‌లో మటన్‌, ఫిష్‌ చేరడంతో జనం గగ్గోలు

Bird Flu In Andhra Pradesh: వేడుకల్లో చికెన్‌ ముక్కకు బదులు మటన్, ఫిష్ చేరింది. దీంతో ఖర్చు అమాంతంగా పెరిగింది. ముక్కలేకుండా ముద్ద దిగదనే వారి జేబు చిల్లు పడుతుంది.

Bird Flu In Andhra Pradesh: వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందట.. అలా ఉంది.. ఇప్పడు బర్డ్‌ఫ్లూ వైరస్‌ శుభకార్యాలయాలపై ఎఫెక్ట్ పడుతోంది. మహూర్తాలు బాగున్నాయని పెళ్లిలు, ఇతర శుభకార్యక్రమాలు ఎక్కువ పెట్టుకున్నారుర జనాలు. సడెన్‌గా బర్డ్‌ఫ్లూ రావడంతో దాని ఎఫెక్ట్‌ భోజనాలపై తీవ్రంగా పడిందని అంటున్నారు నిర్వాహకులు. ఇటీవల కాలంలో ప్రతీ వేడుకకు ముక్కలేకుండా ముద్దదిగదని పరిస్థితి నెలకొంది. చాలా మంది నాన్‌వెజ్‌ వంటకాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు పెళ్లి వేడుక రోజున కేవలం వెజ్‌ వంటకాలు వడ్డిస్తున్నప్పటికీ ఆ తరువాత జరిపే వేడుకలకు, రిసెప్షన్లకు మాంసాహార వంటకాలు తప్పనిసరి చేస్తున్నారు. 

బర్డ్‌ ఫ్లూ పుణ్యమా అని నాన్‌వెజ్‌ వంటకాల్లో చికెన్‌ స్థానంలో మటన్‌ వచ్చి చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌ వల్ల లక్షల్లో కోళ్లు మృత్యువాతపడడం, బర్డ్‌ఫ్లూ వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టడి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం లేదని చెబుతున్నా జనం భయం మాత్రం పోలేదు. ఈ క్రమంలోనే చికెన్‌, కోడిగుడ్లు అమ్మకాలు పడిపోతున్నాయి. అంతే కాదు పంక్షన్ల మెనూ నుంచి చికెన్‌ ఐటెం తీసేసి దాని స్థానంలో మటన్‌ చేర్చుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఖర్చు భారీగా పెరగడంతో లబోదిబో మంటున్నారు నిర్వాహకులు. 

Also Read: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన

విందు ఖర్చులో భారీగా పెరిగిన వ్యత్యాసం..
కిలో చికెన్‌ రూ.250 అదే కిలో మటన్‌ ధర 800 పైమాటే..  వైరస్‌ ఉన్నందున మెనూ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. దీని బట్టి ఒక్కో కిలోకు సుమారు రూ.500 అదనంగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా పంక్షన్లలో చికెన్‌లోనే మూడు నాలుగు రకాల ఐటెమ్స్‌ పెట్టి కేవలం కర్రీ వరకు మటన్‌ వండుతుంటారు. ఇప్పుడు మొత్తం మటన్‌ వండాల్సి వస్తోంది. మటన్‌ బిర్యానీ వంటి ఐటెం చేయించడంతో ఖర్చు పెరిగిపోతుందంటున్నారు. మరికొన్ని పంక్షన్లలో ఫిష్‌కు ప్రాధాన్యనిస్తున్నారు. దీని వల్ల కూడా ఖర్చు భారీగా పెరిగిపోయిన పరిస్థితి. ఒక కిలో ఫిష్‌ రూ.300 నుంచి రూ.500 వరకు ఉండడంతో ఫిష్‌ వంటకాలు చేయించాలన్నా అదనపు ఖర్చు అవుతోంది.  

హోటళ్లలోనూ పెరిగిన ఖర్చు..
బయట తప్పక తినాల్సిన పరిస్థితుల్లో ఎక్కువ శాతం మంది విజిటేరియన్‌ భోజనానికే ప్రాధాన్యతనిస్తారు. అయితే మాంసాహార ప్రియులు మాత్రం మటన్‌, ఫిష్‌లతో చేసిన ఐటెమ్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెబుతున్నారు. తీరా తినేశాక బిల్లు చూసి ఘొల్లుమనే పరిస్థితి ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఒక పూట ఏదైనా హోటల్‌కు వెళ్లి తప్పనిసరిగ్గా తినాల్సి వచ్చినప్పుడు మటన్‌ స్టార్టర్‌ లేదా ఫిష్‌ స్టార్టర్‌ ఆర్డర్‌ ఇచ్చి ఆపై మటన్‌ లేదా, ఫిష్‌ బిర్యానీ అంతకీ లేదంటే మటన్‌, ఫిష్‌ కర్రీ ఆర్డర్‌ ఇస్తున్నారు. దీంతో రెట్టింపు ఖర్చు జేబుకు చిల్లు పెడుతోందని వాపోతున్నారు.  రూ.1000 అయ్యే ఖర్చు చికెన్‌ ఐటెమ్‌లు తినక పోవడం వల్ల మటన్‌, ఫిష్‌ ఐటెమ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో రూ.2000 పైనే బిల్లు చెల్లించాల్సి వస్తోంది. మొత్తం మీద ముక్కలేకుండా ముద్ద దిగని మాంసాహార ప్రియులు మాత్రం అదనపు ఖర్చు వల్ల మాత్రం కాస్త ఇబ్బందులు పడుతున్నారు. 

Also Read: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సడెన్‌గా జోరు పెంచిన కూటమి అభ్యర్ధి.. అసలు కారణం ఇదేనా..

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget