అన్వేషించండి

Andhra Pradesh: 2020లోనే కూటమి బలాన్ని రుచి చూపిన తూర్పు గోదావరి ప్రజలు

East Godavari News: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందో 2020లోనే నాయకులకు, పార్టీలకు శాంపిల్‌ చూపించారు తూర్పుగోదావరి ప్రజలు.

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అసలు కూటమికి నాంది పలికిన ప్రాంతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానే అని మీకు తెలుసా.
కూటమి ఏర్పాటుకు బీజం పడింది ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్షనేత నారా చంద్రబాబును అరెస్ట్‌ చేసి రాజమండ్రి జైలులో అని చాలా మంది అనుకుంటారు. కూటమిగా పోటీ చేస్తున్నామని పోటీ చేస్తామి బహిరంగంగా చెప్పేందుకు రాజమండ్రిని పవన్‌ కల్యాణ్‌ వేదికగా చేసుకున్నారు. 

కానీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కూటమిగా పోటీ చేయాలనే ఆలోచన వచ్చింది. కూటమిగా పోటీ చేస్తే ఏం జరుగుతుందో స్థానిక సంస్థల ఎన్నికలు చెప్పాయి. అప్పట్లో ఈ విషయాన్ని చాలా మంది పట్టించుకోలేదు. ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, వైసీపీ మాత్రం గమనించి దానికి తగ్గట్టుగానే పావులు కదిపాయి. 

మార్పుకు నాంది తూర్పునే...
2020లో జరిగిన పంచాయతీ ఎన్నికలు సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా చోట్ల టీడీపీ, జనసేన లోపాయికర ఒప్పందంతో పని చేశాయి. ఎన్నికల్లో కలిసి పనిచేసి చాలాచోట్ల విజయాన్ని సాధించాయి. నిజానికి అప్పటికి టీడీపీ, జనసేన కలిసే ప్రయాణం చేస్తాయన్న ఆలోచన కూడా ఎవ్వరికీ రాలేదు. పైన ఎలా ఉన్నా మాత్రం గ్రామాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ, జనసేన నాయకులు ఓ నిర్ణయానికి వచ్చి బరిలో నిలిచి విజయం సాధించారు. 

ఇలాంటి ప్రాంతాల్లో మొదటి గ్రామం కడియం. ఈ గ్రామంలో టీడీపీ, జనసేన నాయకులు ముందుగా ఓ నిర్ణయానికి వచ్చి వైసీపీ నిలిపిన అభ్యర్ధిని ఓడించారు. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న తమ పార్టీ వారిపై వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారని పంచాయతీ ఎన్నికల్లో చురుగ్గా టీడీపీ శ్రేణులు పాల్గన్న పరిస్థితి లేదు. అలాంటి టైంలో కడియం మండలంలో చాలా గ్రామాల్లో ఇరు పార్టీలు సహకరించుకున్నాయి. కలిసి పోటీ చేసి విజయాన్ని సాధించాయి. ఇదే తరహాలో అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో కూడా కనిపించింది. చాలా గ్రామాల్లో విజయం సాధించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోకూడా...
రాజమహేంద్రవరం రూరల్‌ నియోకవర్గ పరిధిలో టీడీపీ, జనసేనకు బీజేపీ కూడా కలిసింది. ప్రధానంగా టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన నుంచి కందుల దుర్గేష్‌, బీజేపీ నుంచి సోము వీర్రాజు కలిశారు. దీంతో రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలో చాలా మండల పరిషత్తులు, జడ్పీటీసీలు టీడీపీ, జనసేన, బీజేపీ పరమయ్యాయి. ఇదే పరిస్థితి పి.గన్నవరం నియోజకవర్గంలో కూడా కనిపించింది. 
స్థానిక సంస్థల్లో టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లడం ద్వారానే వైసీపీని మట్టికరిపించామని అనుకున్నారు. ఇదే విషయంలో పార్టీ అధిష్టానంతో చర్చించలేక వారి నిర్ణయం కోసం ఎదురు చూశారు. ఇంతలో చంద్రబాబు అరెస్ట్‌ తరువాత జరిగిన పరిణామాలతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముందుగా టీడీపీ, జనసేన కలయిక ఆపై బీజేపీ చేరడంతో కూటమికి తిరుగులేకుండా పోయింది. 

వైసీపీను వీడుతున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు..
ఇప్పుడు ప్రభుత్వం మారడంతో స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు యూ టర్న్ తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు వైసీపీ ప్రాధన్యత లేకుండా చేసిందని గుర్రుగా ఉన్న సర్పంచ్‌లు ఇప్పుడు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీకు గుడ్‌బై చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా పంచాయతీ సర్పంచుల్లో కదలిక వచ్చింది. కడియం మండలంలోనే పంచాయతీ సర్పంచ్‌లు వైసీపీకు రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇదే బాటలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అడుగులు వేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget