Snake in Wine Bottle: మద్యం సీసాలో పాము పిల్ల, ఉలిక్కిపడ్డ గుంటూరు వాసులు
Snake in Wine Bottle: స్నేహితులంతా కలిసి ఫుల్లుగా తాగి ఎంజాయ్ చేయాలనుకున్నారు. మద్యం సీసాలు తెచ్చుకొని అతృతగా తెరిచి చూశారు. కానీ అందులో కనిపించిన పాము పిల్లను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Snake in Wine Bottle: బంధించిన పాములను సీసాల్లో పెడుతుంటారు చాలా మంది. మనం కూడా వాటిని అలాగే చూస్తుంటాం. కానీ మనం తిని, తాగే ఆహార పదార్థాల్లో ఆ పాములు కనిపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. ఛీ ఇలా చెప్తున్నారేంటి అనుకుంటున్నారా.. తాజాగా ఓ మద్యం సీసాలో పాము పిల్ల దర్శనం ఇచ్చింది. అదేదో ఖాళీ అయిన సీసాలో అనుకునేరు. నిండుగా మద్యం ఉన్న సీసాలోనే పాము పిల్ల కనిపించింది. స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది.
స్నేహితులతో కలిసి పార్టీ, అంతలోనే షాక్..
గుంటూరు జిల్లాలోని పొన్నూరుకు చెందిన కొంతమంది యువకులు.. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవాలనున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల బస్టాండు వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం సీసాలను కొనుగోలు చేశారు. అయితే ఆతృతగా ఇంటికెళ్లి తాగుదామని సీసాను ఓపెన్ చేశారు. మద్యంతో పాటు ఆ సీసాలో పాము పిల్లను చూసి షాకయ్యారు. ఒకటికి పదిసార్లు.. అక్కడున్నా వారంతా దాన్ని గమనించారు. వెంటనే మద్యం దుకాణం వద్దకు వెళ్లి గొడవకు దిగారు. తాగే మద్యంలో పాము పిల్ల రావడం ఏంటని ప్రశ్నించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. యువకులంతా గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టారు. వందలు పెట్టి కొనుగోలు చేసిన మద్యంలో పాము వచ్చిందని.. అది తీస్కొని తమకు మరో సీసా ఇవ్వాలని కోరారు. దీంతో యువకుల పోరు పడలేక మరో మద్యం బాటిల్ ఇచ్చి వారిని వెనక్కి పంపించేశారు.
అయితే మద్యం సీసాలో పాము పిల్ల కనిపించిన విషయం తెలుసుకున్న వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వం మద్యం దుకాణాల్లో నాణ్యత లేని మద్యం అమ్ముతున్నారని మద్యం ప్రియులు గగ్గోలు పెడుతుండగా.. తాజాగా జరిగిన ఈ ఘటనతో మరింత గొడవ చేస్తున్నారు.
నాణ్యత లేనిది కాబట్టే డ్రమ్ముల్లో తెచ్చి పోశారా..?
గణేష్ నిమజ్జనం ఎక్కడైనా ఘనంగా చేస్తారు. డాన్సులతో హోరెత్తిస్తారు. భక్తులకు అన్నదానం చేస్తారు. ఇదంతా జరిగేదే. అయితే సినిమాలో డైలాగులా.. ఇవన్నీ అందరూ చేస్తారు.. కానీ మద్యాన్ని డ్రమ్ముల్లో పోసి భక్తులకు పోసే వారికే ఓ రేంజ్ ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ నేతలు అనుకున్నారేమో కానీ అదే పని చేశారు. ఇది ఎక్కడో కాదు. ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే తాడేపల్లిలోనే. ఆయన నివాసానికి అతిక కొద్ది దూరంలో ఉన్న గణేష్ మండపంలోనే.
ఎంపీ, ఎమ్మెల్యేల ఆశీస్సులతో ఏర్పాటైన గణేష్ మండపంలో అపచారం
తాడేపల్లి వైఎస్ఆర్‌సీపీ నాయకులు పట్టణంలో ఉత్సవ కమిటీగి ఏర్పడి గణేష్ ఉత్సవ ఏర్పాట్లు చేశారు. పూజలు చేశారు. ఇక నిమజ్జనం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అన్నదానం, గానా బజానా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి, రాజ్య సభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి కూడా వచ్చారు. వారుండగానే మందు బాబులకు పండుగ వాతారణాన్ని అక్కడ కల్పించారు.
డ్రమ్ముల నిండా మద్యం తెచ్చి ట్యాప్ తో మద్యం సరఫరా
వాటర్ డ్రమ్ముల నిండా మద్యం పోసి.. దానికి ట్యాప్ పెట్టి.. మందు బాబులందర్నీ క్యూలో నిలబెట్టారు. తర్వాత ఒక్కొక్కరికి ఆ డ్రమ్ములోనుంచి మద్యం నింపి ఇచ్చారు.ఇలా వందల మంది గ్లాసులు గ్లాసులు తాగారు. ఒక్కొక్కరికి ఒక్కో బాటిల్ పంచితే ఖర్చయిపోతుందని అనుకున్నారేమోకానీ.. ఇలా డ్రమ్ముల్లో తెప్పించి పంచేశారన్నమాట. ప్రస్తుతం మద్యం మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉంది. కొనాలంటే అక్కడే కొనాలి. డ్రమ్ముల్లో మద్యం అమ్మే సంప్రదాయం ఇం కారాలేదు కాబట్టి.. బాటిల్స్ కొని డ్రమ్ములో పోసి.. ఇలా పంపిణీ చేసి ఉంటారని భావిస్తున్నారు.
నాణ్యత లేని, తక్కువ రకం మద్యం ఉండటం వల్లే ఇలా డ్రమ్ముల్లో పోసి మద్యం ప్రియులకు తాగించారా అని కామెంట్లు చేస్తున్నారు చాలా మంది. ఇప్పటికైనా ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని మాత్రమే రాష్ట్రంలో విక్రయించాలని కోరుతున్నారు