అన్వేషించండి

Konaseema Apple: కోనసీమలో కాసిన కాశ్మీర్ యాపిల్, చూసేందుకు భారీగా తరలివస్తున్న స్థానికులు

యాపిల్ కాయడానికి  ఎంత మాత్రం అనుకూలించని వాతావరణం లో యాపిల్ కాయడంపై యజమాని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి.

ఏపీలోని కోనసీమలో ఒక ఇంటి యజమాని తన పెరట్లో యాపిల్ కాయించి భళా అనిపించుకున్నారు. యాపిల్ కాయడానికి  ఎంత మాత్రం అనుకూలించని వాతావరణం లో యాపిల్ కాయడంపై యజమాని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.  డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శివారు పెద్దగూళ్ల పాలెంలో యాపిల్ కాసింది. యాపిల్ అతి శీతల ప్రదేశాల్లో పండే పంట.. జమ్ము, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి శీతల ప్రదేశాల్లో పండుతుందని చెబుతుంటారు.  దీనికి భిన్నంగా కోనసీమలో యాపిల్ పండు మొదటిసారిగా పండింది. 

ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లో పండని ఈ ఆపిల్ ను కోనసీమలో ఓ వ్యక్తి తన పెరట్లో పండించాడు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, పెదగూళ్ళపాలానికి చెందిన దంగేటి వెంకటేశ్వరరావు ఈ ఘనత సాధించాడు. సైకిల్ పై మొక్కలు అమ్మే వ్యక్తి వద్ద నుంచి యాపిల్ మొక్కను కొనుగోలు చేశాడు.ఆ మొక్కను తన పెరట్లో పాతి ఎనిమిది సంవత్సరాల పాటు పెంచాడు. ఆయన పెట్టుకున్న నమ్మకంతో నేడు ఆ చెట్టు శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇచ్చింది. ఆ చెట్టుకొమ్మకు ఒక యాపిల్ కాసింది. ఈ విషయం తెలిసిన పలువురు ఆపిల్ చెట్టును చూసి వెళ్తున్నారు. 

ఎక్కడో శీతల ప్రదేశాల్లో పండే యాపిల్ ఇక్కడ ఉండడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖ అధికారి భబితను సంప్రదించగా  శీతల ప్రదేశాల్లోనే కాకుండా యాపిల్  దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పండే అవకాశం ఉందని తెలిపారు. అయితే కాశ్మీర్ వంటి ప్రదేశాల్లో ఉండే యాపిల్ సైజు మిగతా చోట్ల చిన్నదిగా ఉంటుందని వివరించారు.

యాపిల్ వల్ల ప్రయోజనాలు
యాపిల్ లో మంచి ఫైబర్, పెక్టిన్ ఉంటుంది. గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఊబకాయం, బొడ్డు చుట్టూ వచ్చే కొవ్వుని తగ్గిస్తుంది. జీర్ణక్రియ నెమ్మదించేలా చేస్తుంది. ఎక్కువ సేపు పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాని వల్ల ఆహారం తినడం తగ్గిస్తారు. ఫలితంగా బరువు తగ్గుతారు. మరొక అధ్యయనంలో 74 మంది పెద్దలు రాత్రిపూట నారింజ రసం తీసుకున్నారు. ఇందులో కూడా 5-20 గ్రాముల పెక్టిన్ పొందారు. అతి తక్కువ మోతాదులో దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపించినట్టు పరిశోధకులు తెలిపారు.

100 గ్రాముల యాపిల్ లో 19 గ్రాముల చక్కెర, 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పాలీఫెనాల్స్ కి మంచి మూలం. బెల్లీ ఫ్యాట్ ని కరిగించడంలో పాలీఫెనాల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పలు అధ్యయనాలు నిర్ధారించాయి. ఒక మీడియం సైజు యాపిల్ లో 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. యాపిల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీవక్రియని మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. యాపిల్ నుంచి మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే తప్పకుండా తొక్కతో కలిపి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పెక్టిన్, డైటరీ ఫైబర్ గుణాలు గ్యాస్ట్రిక్ సమస్యలని తగ్గిస్తాయి. పేగు పనితీరుని మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యని నివారిస్తాయి. పెక్టిన్ గ్యాస్ట్రిక్ ఆమ్లంతో కలిసి ప్రీబయోటిక్ గా మారతాయి. ఇవి గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. యాపిల్ లేదా సిట్రస్ పండ్ల నుంచి వచ్చే పెక్టిన్ లు గట్ బ్యాక్టీరియాకు విలువైన కార్బన్ మూలాలు అని గతంలోని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. గట్ హెల్త్ బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?
రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ మాడ్యులర్ హెల్మెట్ - మీ డబ్బుకు తగ్గ వాల్యూ ఇస్తుందా?
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Embed widget