అన్వేషించండి

Accidents In Godavari River : గోదావరి పాయల్లో కన్నీటిధార! మృత్యుఘోష పాపం ఎవరిది? 

Accidents In Godavari River :గోదావ‌రి న‌దీపాయ‌ల్లో ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న దుర్ఘ‌ట‌నల‌కు ఇసుక మాఫీయా కార‌ణ‌మ‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాల వ‌ల్ల‌నే కోన‌సీమ‌లో 11 మంది మృత్యువాత‌ప‌డ్డార‌ని ఆరోపిప్తున్నారు..

Accidents In Godavari River : గలగలా పారే గోదావరి నదీపాయలు కోనసీమ ప్రాంతానికి ప్రకృతి రమణీయతతోపాటు వనరులను అందిస్తున్నాయి.. ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక్క అఖండ గోదావరి కోనసీమ ప్రాంతంలోనే గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయాలుగా ప్రవహిస్తూ సాగరంలో కలుస్తున్నాయి.. అందుకే ముఖ్యంగా కోనసీమ ప్రజలకు గోదావరితో వారి నిత్యకృత్యం మమేకమై ఉంటుంది. వ్యవసాయ, ఉద్యాన పంటల పరంగానే కాకుండా కాస్త సేద తీరేందుకుకైనా.. ఆటవిడుపుకైనా.. చివరకు ఊరుదాటాలన్నా  కూడా గోదావరి చెంతకు చేరాల్సిందే.. ఈ క్రమంలోనే అదే జీవనంతో ముడిపడి ఉన్న గోదావరి పాయల్లో మృత్యుపాశం ఎదరవుతోంది.

కొంత మేరకు అవగాహనా రాహిత్యం.. మరికొంత మానవతప్పిదం.. వెరసి మొత్తం మీద గోదావరి తీరం మృత్యుఘోషతో కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఎందరో తల్లులకు కడుపుకోత మిగుల్చుతోంది. ఇటీవలే గోదావరి పాయల్లో సరదాగా ఆటవిడుపుగా ఈత కోడదామని వెళ్లిన ఎనిమిది మంది యువకుడు గోదావరిలో మునిగి మృత్యువాత పడిన ఘటన తెలిసింది. ఈ మహా విషాదం మరువక ముందే పి.గన్నవరం మండల పరిధిలోని రామారాజులంక సమీపంలో వశిష్ట నదీపాయలోని ఇసుక తిన్నెల్లోకి సరదగా వెళ్లిన ముగ్గురు యువకులు గోదావరిలో గల్లంతై మృతిచెందారు.. రెండు నెలల క్రితం ఆత్రేయపురం సమీపంలో కూడా సరిగ్గా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.. అయితే ఈ మరణాల వెనుక కచ్చితంగా మానవతప్పిదాలే ఉన్నాయన్నది చాలా మంది ఆరోపణగా కనిపిస్తోంది. 

ఇసుకాసురుల చర్యలతోనే ప్రమాదాలు..

గోదావరి నదీపాయల్లో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు ఇసుక ర్యాంపుల నిర్వాహకులు. జేసీబీలు, పొక్లయిన్లతో ఇసుకను అత్యంత లోతుల్లో తవ్వి తరలిస్తున్న క్రమంలోనే గోదావరి నదీపాయల్లో భారీగా గుంతలు ఏర్పాడ్డాయని, ఈ క్రమంలోనే ఇటీవల కురిసి వర్షాలకు వర్షంనీటితోపాటు గోదావరి నీళ్లు వచ్చి చేరడంతో అవి అగాథాలుగా ఏర్పడ్డాయని పలువురు చెబుతున్నారు. ఇది తెలియని యువకులు పక్కనే ఇసుక తిన్నెలు వద్ద సరదాగా గడిపి స్నానం చేసేందుకు ఆ గుంతల్లో దిగిన వారు మృత్యుఒడిలోకి వెళ్లిపోతున్నారని, ఆ గోతులు అగాథాలు అని తెలియకనే ఇటీవల కాలంలో ఘోరాలు జరిగాయని అంటున్నారు.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అత్యధికంగా కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులు ఉండగా ఈ ర్యాంపుల పరిధిలో 16 వరకు ఇసుక తవ్వకం కేంద్రాలున్నాయి. ఇక్కడ యంత్రాలతో ఇసుకను తవ్వి తీస్తున్నారు. దీంతో అక్కడ భారీ అగాథాలుగా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈనేపథ్యంలోనే ఒక్క కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని గోదావరి పాయల్లో ఇటీవల చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు మృత్యువాతపడ్డారు. ఇక ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో కూడా గౌతమీ నదీపాయలో ఇసుక తవ్వకాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదంలో కమినిలంక, శేరులంక వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో యువకులు ఈ తరహా గోతుల్లో దిగే మృత్యువాతపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక వశిష్టానదీ ప్రవహించే పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో ముగ్గురు యువకులు మృతిచెందిన దుర్గటన విషయంలోనూ గోదావరి నదీపాయల్లో జేసీబీల ద్వారా తీసిక అగాధాలే కారణమని చెబుతున్నారు. 

ఇసుక మాఫియా తవ్వకాల వల్లే మృత్యువాత‌..

ఇసుక మాఫియా అక్రమ తవ్వకాలు వల్లే కమిని గ్రామంలో నదీ  ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు యువకులు మరణించారని దేనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సిపిఎం కమిటీ డిమాండ్ చేసింది.. ముమ్మాటికి ఇసుక మాఫియా చేసిన అక్రమ ఇసుక తవ్వకాలు వల్లే జరిగిన ప్రమాదంగా భావిస్తున్నామని ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా అక్రమ తవ్వకాలు జిల్లావ్యాప్తంగా మీడియాలోనూ స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా జిల్లా ఉన్నత అధికారుల యంత్రాంగం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని దానివల్లే ఈరోజు ఎనిమిది మంది ప్రాణాలు బలితీసుకున్నారని అక్రమంగా యంత్రాలతో నదిని పూర్తిగా గుంతలతో ఇసుకను తవ్వేసి ఆ గుంతల్లో పడి ఎనిమిది మంది చనిపోయారని ఈ సందర్భంగా తెలిపారు. ఇక్క‌డే కాకుండా పి.గ‌న్న‌వ‌రం మండ‌లంలో కూడా ఇదే ప‌రిస్థితి త‌లెత్తింద‌ని, ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాలే అన్నారు. 

ప్రధానంగా కోనసీమ జిల్లావ్యాప్తంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతం సముద్ర తీర ప్రాంతం ఉందని ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు గాని హెచ్చరిక చేస్తూ బోర్డులు గాని నెలకొల్పపకపోవడం బాధాకరమన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget