అన్వేషించండి

MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంత బాబు విడుదల వాయిదా, షరతుల మాటేంటి !

మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితడిగా ఉన్న ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబు జైలు నుంచి విడుదల రేపటికి వాయిదా పడింది.

మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితడిగా ఉన్న ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబు జైలు నుంచి విడుదల రేపటి (బుధవారం)కి వాయిదా పడింది. డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యస్థ బెయిల్ ఆర్డర్లో ఈ కేసు విచారణ చేసే న్యాయస్థానం బెయిల్ కు సంబంధించి కొన్ని కండీషన్లు విధించే విధంగా ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మంగళవారం సంబంధిత కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటం వలన ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి వాదనలు విని ఆదేశాల కొరకు బుధవారాని వాయిదా వేశారు. దీంతో ఎమ్మెల్సీ అనంత బాబు మంగళవారం జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం లేదని సమాచారం.  న్యాయమూర్తి విధించే షరతులు ఆధారంగా బుధవారం నాడు అనంతబాబు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు  బెయిల్ మంజూరు చేసింది. డీఫాల్ట్  బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు. గతంలో విచారణకువచ్చిన సమయంలో  ప్రతి వాదులకు నోటీసులు జారీ చేశారు. సోమవారం జరిగిన విచారణలో బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బెయిల్ షరతులను కింది కోర్టు నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే అనంతబాబు బెయిల్ పిటిషన్ ను రాజమండ్రిలోని ఎస్సీ ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్ట్ కొట్టి వేశాయి. దీంతో బెయిల్ కోసం అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

డీఫాల్ట్ బెయిల్‌కు అనంతబాబు అర్హుడని సుప్రీంకోర్టులో అనంతబాబు లాయర్ వాదన 
గత విచారణలో అనంతబాబును అరెస్టు చేసి 90 రోజులు దాటిపోయిందని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  పోలీసులు దర్యాప్తు పూర్తి చేయడం లేదన్నారు.  ఫోరెన్సిక్ నివేదికలని మరో కారణం చెప్పి చార్జిషీట్ దాఖలు చేయడం లేదన్నారు.  ఆగస్టు 26న ట్రయల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా నిందితుడికి మరో 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలని.. ఈలోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెప్పారన్నారు. కానీ ఇప్పటి వరకు చార్జిషీట్ దాఖలు చేయలేకపోయారని అన్నారు. ఈ పరిస్థితుల్లో అనంత బాబు డిఫాల్ట్ బెయిల్ పొందేందుకు అర్హుడని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతబాబు తరపు లాయర్ వాదనలతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. 

రక్షణ ఉండదని సుబ్రహ్మణ్యం కుటుంబం లాయర్ వాదన
అనంతబాబుకు  బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించి, రూ. 2 లక్షలు డబ్బులిచ్చి, ఎక్కడా మాట్లాడొద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డారని డ్రైవర్ సుబ్రహ్మణ్యం తరపు లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  బెయిలిస్తే కేసులో సాక్షులను, బాధిత కుటుంబాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. ఈ పరిస్థితుల్లో అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అయితే  తామేమీ అనంత బాబును నిర్దోషిగా ప్రకటించడం లేదని, అయితే 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులవుతారని చెప్పింది.  ఆ వాదనల ప్రకారం ఇప్పుడు డీఫాల్ట్ బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. 

ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ  
ఎమ్మెల్సీ అనంత బాబు తన డ్రైవ‌ర్‌ సుబ్ర‌హ్మ‌ణ్యంను హత్య చేసి, ఆ త‌ర్వాత మృత‌దేహాన్ని బాధితుడి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఘ‌ట‌న ఏపీలో క‌ల‌క‌లం రేపింది. మే 19వ తేదీన  మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఆయన ఇంటి నుంచి అనంతబాబు తీసుకెళ్లారు. అదే రోజు ప్రమాదంలో చనిపోయారని మృతదేహాన్ని ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ సుబ్రహ్మణ్యం బంధువులు అడ్డుకున్నారు. అయితే  అందర్నీ బెదిరించి ఆయన అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన కలకలం రేపడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు. తాను ఒక్కడినే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశానని అంగీకరించినట్లుగా పోలీసులు ప్రకటించారు. అయితే ఈ కేసులో ఇంత వరకూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయలేకపోయారు. ఎమ్మెల్సీ అనంతబాబును వైఎస్ఆర్‌సీపీ నుంచి అప్పుడే సస్పెండ్ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget