Amalapuram News: సంక్రాంతి పండక్కి రోల్స్ రాయిస్‌లో చెన్నై అల్లుడు- ఘన స్వాగతం పలికిన అమలాపురం మామ
Rolls Royce In Amalapuram: అమలాపురం రోడ్లపై రోల్స్ రాయిస్ కారు చక్కర్లు కొట్టింది. దీన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు.
![Amalapuram News: సంక్రాంతి పండక్కి రోల్స్ రాయిస్‌లో చెన్నై అల్లుడు- ఘన స్వాగతం పలికిన అమలాపురం మామ Amalapuram News Rolls Royce car on the roads of Amalapuram People showed interest to see Amalapuram News: సంక్రాంతి పండక్కి రోల్స్ రాయిస్‌లో చెన్నై అల్లుడు- ఘన స్వాగతం పలికిన అమలాపురం మామ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/13/56c6e380a3fa701cfe2a9adc733a3e131705131219713215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఈస్టు గోదావరోళ్లు అంటే మామూలుగా ఉండదు. మర్యాదల్లో కానీ పెట్టిపోతల్లో కానీ తగ్గేదేలే అంటారు. అలాంటి తూర్పుగోదావరి వాళ్లే బిత్తరపోయేలా ఎంట్రీ ఇచ్చాడో అల్లుడు. మేమూ తగ్గబోమంటూ అత్తవారు కూడా అదే స్థాయిలో స్వాగతం పలికారు. మొత్తానికి ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
సంక్రాంతి వచ్చిందంటే చాలు దేశవిదేశాల్లో ఉన్న అల్లుళ్లు, కూతుళ్లు, బందుమిత్రులతో సొంతూళ్లకు, అత్తవారింటకు వస్తుంటారు. అలానే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్తారింటికి ఓ అల్లుడు వచ్చాడు. చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తకు మురమళ్లకు చెందిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. పండక్కి వచ్చిన అత్తారింటికి వచ్చిన ఆ అల్లుడు ఏకంగా రోల్స్ రాయిస్ వేసుకొని ఎంట్రీ ఇచ్చాడు.
అమలాపురం వీధుల్లో తిరుగుతున్న ఆ రోల్స్ రాయిస్ కారును చూసిన వారంతా షాక్ తిన్నారు. ఇంత కాస్ట్లీ కారు ఎవరదనేి ఆరా తీయడం మొదలు పెట్టారు. చెన్నైకి చెందిన వ్యాపారవేత్తదని తెలుసుకున్నారు.
అల్లుడు రోల్స్ రాయిస్ కారులో రావడంతో అత్తవారు కూడా అదే స్థాయిలో స్వాగతం పలికారు. బాణసంచా కాల్చారు. పూల మాలలతో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
అమలాపురం రోడ్లపై రోల్స్ రాయిస్ కారును చూసిన జనం వీడియోలు ఫొటోలు తీసుకున్నారు. ఆ ఫ్యామిలీతో కాస్త క్లోజ్‌గా ఉన్న స్నేహితులు, బంధువులు సెల్ఫీలు తీసుకున్నారు. కారు వద్ద నిలబడి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఇప్పుడు ఇదే అమలాపురంలో పెద్ద టాపిక్‌గా మారిపోయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)